జ్ఞానం, ధనం, విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు. వాళ్ళది చాలా గాఢమైన స్నేహం ఆనుకోకుండా ఒకసారి వాళ్ళు విడిపోవల్సి వచ్చింది. తిరిగి ఎప్పుడు? ఎక్కడ? కలుసుకోవాలి అనే ప్రశ్న వచ్చింది. ముగ్గురూ ఆలోచించసాగారు.

ఇంతలో జ్ఞానం అంటుంది...... 'దేవాలయాల్లో, విద్యాలయాల్లో నేను కలుస్తా' అని!

ధనం ' నేను ధనవంతుల దగ్గర కలుస్తా' అన్నది.

విశ్వాసం మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. 

కారణమేంటని జ్ఞానం, ధనం విశ్వాసాన్ని ఆడిగారు. 

అప్పుడు విశ్వాసం ఇలా చెప్పింది. ' మీరిద్దరూ విడిపోయినా, వెళ్ళిపోయినా ఎక్కడో ఒకచోట కలుసుకునే వీలుంటుంది. కానీ నేను ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగా రావడమనేది కుదరని పని. ఎట్టి పరిస్థితులలోనూ సాధ్యపడదు' అన్నది.

విశ్వాసం మాటల్ని విని  జ్ఞానం, ధనం ఆశ్చర్యపోయాయి! స్నేహం పట్ల, విడిపోవటం వల్ల విశ్వాసానికున్న గొప్ప ఆభిప్రాయాన్ని మెచ్చుకున్నాయి.

నీతి, ధనం, జ్ఞానం ఎప్పుడైనా వస్తాయి. కానీ విశ్వాసం ఒకసారి పోతే మళ్ళీ రాదు!

మరింత సమాచారం తెలుసుకోండి: