మనిషి అమీబా లాంటి వారు...
అర్ధం కాలేదా ,కాలానుగుణంగా మారిపోతుంటారు...

ఈ రోజు ఉన్న ప్రవర్తన ,ఈ రోజు వున్న నడవడిక రేపు కూడా వుంటాయి అనుకోవడం కష్టం...

అలాగే మనుషులందరూ ఒకే విధంగా గా కూడా వుండరు...
ఒకరికి మంచి అనేది మరొకరికి చెడు గా కనిపిస్తుంది...
ఈ రోజు మంచి అనేది రేపు చెడుగా మారిపోతుంది...
అందుకే మనిషి మనసు చంచల మైనది అంటాం...

భాగవతం లో చెప్పినట్లు సంధ్య వేళ నీ బట్టి మంచి చెడుగాను, చెడు మంచిగాను మారుతుంది....

ప్రతి బిడ్డకు తన తండ్రి చేసేది తప్పుగానే కనిపిస్తుంది...

కానీ అదే నిజమని ఆ బిడ్డ తండ్రి అయినపుడు మాత్రమే తెలుస్తుంది...
ప్రతి స్టూడెంట్ కి టీచర్ చెడ్డ వానిగానే కనబడతాడు...

ఏమి ఈ చాదస్తం అంటాడు,కానీ ఆ చాదస్తమేమి టో అతను టీచర్ అయినపుడు కనబడుతుంది...

అందుకే అందరి చేత మంచి అనిపించుకునే మనిషే లేడు భూలోకం మీద...

తల్లి,తండ్రి,గరువు,దైవాలనే మనం తిట్టుకుంటూ వుంటాం...
వారి వల్ల మనకు మేలు జరగక పోతే...
అంటే వారు మనకు చెడు చెయ్యక్కర్లేదు ,
మనము అనుకున్నది చెయ్యకపోతే చాలు...

పై నలుగురిని కూడా వదలకుండా దులిపేస్తాం...
ఇక వారినే దులిపేస్తే మిగతా వారిని వదులు తామా...
అందుకే మనిషి మనస్సు అమీబా లాంటిది అనేది...
ఎటు పల్లం ఉంటే ,అదే ఎటు అనుకూలం గా వుంటే అటు పరిగెడుతుంది...

ఇది తెలుసుకుంటే మనం ఇప్పుడు జరిగే విషయాలను ఇది మంచి,ఇది చెడు అని విశ్లేషణలు పెట్టం...

కానీ ఎక్కువ మందికి మేలు చేసేదిగా వుండే పనులు చేయగలిగితే...
నూటికి నూరు శాతం మంచి అనిపించుకొలేక పోయినా...

ఇతను కూడా మంచి వాడులే అని అంటారు ,అది చాలు...
మీరు అదీ చెయ్యకపోయినా పరవాలేదు...

ఇతరులకు నష్టం కలిగించేది చెయ్యకపోయినా...
మిమ్మల్ని కూడా జనాలు,ఇతనూ మంచివాడు సుమీ అంటారు...

మరి మంచి చేసి మంచివాడు అనిపించు కుంటారా లేదా చెడు చెయ్యకుండా మంచివారు అనిపించుకుంటారా అనేది మీ ఇష్టం...

మరింత సమాచారం తెలుసుకోండి: