ఆధ్యాత్మిక గురువు తన శిష్యుడి ఆలోచనల నుంచి భ్రమలు తొలగించి ఆధ్యాత్మిక దిశగా మళ్ళిస్తాడు. దేవుడు, గురువు ఇద్దరు ఎదురుగా ఉంటే ముందు ఎవరికి నమస్కరించాలని సందేహం తలెత్తితే తాను ముందుగా గురువునే ఎంచుకుంటానని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారు. ఆయన పుట్టినరోజునే మనం ‘టీచర్స్ డే’ గా జరుపుకుంటున్నాం.  తల్లిదండ్రులు జన్మనిస్తే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువులు మాత్రమే. అందుకే మన భారతీయ సంస్కృతిలో గురువు అంటే విపరీతమైన గౌరవం.  ఉపాధ్యాయులను గౌరవించడం,  దేశాన్ని గౌరవించడంగా మనం భావిస్తాం. 


 ప్రస్తుతం మన దేశంలో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులలో 6.6 లక్షల మంది ఎటువంటి బోధనా నైపుణ్యాలు లేకుండా పిల్లలకు పాఠాలు చెపుతున్నారు అంటే మన ప్రభుత్వాలు విధ్యకు ఇస్తున్న ప్రాధాన్యత అర్ధం అవుతుంది. అయితే సంవత్సరం అంతా ఉపాధ్యాయుడుని మరిచిపోయిన మనం కేవలం మొక్కుబడి కోసం ఈరోజు ఖచ్చితంగా గురువును గుర్తుకు చేసుకుంటాం. 

గ్రీస్, టర్కీ, దక్షిణ కొరియా అమెరికా, సింగపూర్ లాంటి దేశాలలో ఉపాధ్యాయ వృత్తిని చాల గౌరవ ప్రధంగా భావిస్తారు. కాని మనదేశంలో ఈ వృత్తి పట్ల ఎంత గౌరవం ఉందో అందరకీ తెలిసిన విషయమే.  గురువును దేవుడితో సమానంగా చూస్తూ గురుదేవో భవ అంటూ ఈరోజు గురు పూజోత్సవాలు నిర్వహిస్తాo. ఆధ్యాత్మిక బోధకుడికి, భౌతిక విషయాలు బోధించే ఉపాధ్యాయుడికి మధ్య తేడా ఉంది. అయితే అమ్మను మించిన ఉత్తమ గురువు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు.  

మరింత సమాచారం తెలుసుకోండి: