సాధారణంగా ఎవరికైనా మధ్యాహ్నం కడుపునిండా భోజనం చేసిన తరువాత నిద్ర రావడం ఖాయం. ముఖ్యంగా రుచికరమైన పదార్ధాలతో లంచ్ చేసిన తరువాత ఎవరైనా ఎంత ప్రయత్నించినా మధ్యాహ్న నిద్రను ఆపుకోలేరు. ఇలాంటి స్థితిని వైద్యపరంగా 'పోస్ట్ ప్రాండియల్ సోమ్నోలెన్స్' అంటారు. మరో మాటలో అందరికీ అర్ధం అయ్యే విధంగా ఈస్థితికి ‘ఫుడ్ కోమా’ అన్న పేరు కూడ ఉంది. 

ఈ ఫుడ్ కోమా యొక్క కారణాలకు సంబంధించి వేర్వేరు సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో కొన్ని ప్రముఖమైనవి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రిప్టోఫాన్ ను కలిగి ఉన్న ఆహారా పదార్ధాలు కలిగిన ఆహారం తినడం వలన  భోజనం చేసిన తరువాత నిద్ర ముంచుకు వస్తుంది అని అంటారు. 

దీనికికారణం మనశరీరంలో అధిక స్థాయిలో ట్రిప్టోఫాన్ ఉత్పత్తి కావడమే అన్నవాదన కూడ ఉంది. ముఖ్యంగా డైరీ పదార్థాలు మరియు మాంసం పదార్ధాలతో నిండిన కూరలకు బియ్యం లేదా బంగాళాదుంపలు వంటి కార్బోహైడ్రేట్లతో తీసుకున్నప్పుడు ఇది మనశరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచి మన మెదడుకు ఒక విధమైన మత్తును కలగచేసే హార్మోన్స్ విడుదల చేయడంతో మన మెదడు మనశరీరాన్ని నిద్రకు సంసిద్ధం చేస్తుంది అన్న పరిశోధనలు కూడ ఉన్నాయి. 

ఆరోగ్య నిపుణుల అంచనాల ప్రకారం ఆహార కోమా మెదడుకు దూరంగా జీర్ణ అవయవాల వైపుగా రక్త ప్రసరణలో మార్పు కలగడం వలన మనకు ఒకవిధమైన ఫుడ్ కోమా వస్తుందని అంటున్నారు. అయితే ఇలాంటి ఫుడ్ కోమాను పరిష్కరించడానికి మరొకమార్గం కేవలం సమతుల్యమైన భోజనం చేయడంతో పాటు వీలైనంత వరకు డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉంటే ఈమధ్యాహ్న నిద్ర సమస్య నుండి బయట పడవచ్చని వైద్యులు చెపుతున్నారు.  ఇదేకాకుండా భోజనం తరువాత కనీసం ఒకఅరగంట నడవ గలిగితే రక్త ప్రసరణను మెరుగుపడి చురుకుగా ఉండటమే కాకుండా ఈమధ్యాహ్న నిద్ర సమస్య నుండి బయట పడవచ్చు అని వైద్యులు కూడ సలహాలు ఇస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: