బొప్పాయి పండు ముక్కలను తినడం వల్ల మనకు కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. అయితే కేవలం బొప్పాయి పండు ద్వారా మాత్రమే కాదు బొప్పాయి ఆకుల వల్ల కూడ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని లేటెస్ట్ అధ్యయనాలు చెపుతున్నాయి.. బొప్పాయి ఆకుల గుజ్జు తలకు రాసుకోవడం వల్ల వెంట్రుకలు బాగా పెరుగుతాయి. నేచురల్‌ కండిషనర్‌గా పనిచేస్తూ మన జుట్టును కాంతివంతంగాచేయడంలో ఈబొప్పాయి ఆకులు ఎంతగానో సహకరిస్తాయి. 

బొప్పాయి ఆకుల్లో పపైన్‌ కైమోపపైన్‌ లాంటి ఎంజైములు ఉన్నాయి. అందువ‌ల్ల బొప్పాయి ఆకులతో చేసిన జ్యూసు తాగితే శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుందిఅని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. అందువల్లనే డెంగ్యూ సోకిన వారికి ఈ జ్యూస్ తాగిస్తారు. అంతే కాదు  బొప్పాయి ఆకుల్లో యాంటీ మలేరియా గుణాలున్నాయి. వీటిలోని యాక్టోజెనిన్‌ విషజ్వరాలు రాకుండా కాపాడుతుంది. 

అదేవిధంగా మన కాలేయాన్ని శుభ్రం చేయడంలో క్లీనింగ్‌ ఏజెంటుగాబొప్పాయి ఆకులు పనిచేస్తాయని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు. లివర్‌ సిరోసిస్‌, ఇతర కాలేయ జబ్బుల్ని నివారించే గుణాలు బొప్పాయి ఆకుల్లో ఉన్నాయి. అదేవిధంగా  ఈ ఆకుల‌తో చేసిన జ్యూస్‌ను కొద్ది ప‌రిమాణంలో తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణక్రియ బాగా జరగడమే కాకుండా మలబద్ధకం కూడా తగ్గుతుంది.

దీనికితోడు బొప్పాయి ఆకుల్లోని యాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పేగులోని పొట్టలోని మంటను తగ్గిస్తాయి. బొప్పాయి ఆకుల జ్యూసు పెప్టిక్‌ అల్సర్లను తగ్గించడంలో కూడ విని యోగిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు బొప్పాయి ఆకులు మేలు చేస్తాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తాయి. బొప్పాయి ఆకుల‌లోని యాంటాక్సిడెంట్లు కిడ్నీ దెబ్బతినకుండా కాపాడడంతో పాటు ఫ్యాటీ లివర్‌ సమస్యను నివారిస్తాయి అని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న బోపాయి ఆకులను సక్రమంగా విని యోగించు కోగలిగితే అందరికీ ఆరోగ్యం సిద్దిస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: