ప్రస్తుతం అన్ని రంగాలలోను పోటీ వాతవరణం పెరిగి పోవడంతో ప్రతి వ్యక్తికి వారివారి  స్థాయిలలో ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్ సమస్య నుండి తప్పిచు కోలేక పోతున్నారు. దీనితో ఆమానసిక సమస్యల నుండి తప్పించుకోవడానికి మానసిక వైద్యుల సలహాలు కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో ఈ డిప్రెషన్ సమస్యల నుండి  బయటపడటానికి చేప‌లు రొయ్య‌ల‌ను తిన‌డం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయని లేటెస్ట్ అధ్యయనాలు చెపుతున్నాయి. 

చేపలు రొయ్యలు లాంటి సి ఫుడ్ తినడం ద్వారా మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాలు లభించడమే కాకుండా మనస్సును నియంత్రించే డిప్రెషన్ కు లోను కాకుండా చేస్తుందని అధ్యనాలు చెపుతున్నాయి. అందువల్ల వారంలో క‌నీసం రెండు మూడు సార్లు వీటిని ఆహారంగా తీసుకుంటే డిప్రెష‌న్ బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని తాజాగా చేసిన ప‌రిశోధ‌న‌లు తెలుపుతున్నాయి. 

ఈమధ్య అమెరికాలో 18 నుంచి 65 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న 3వేల మంది బ్ల‌డ్ శాంపిల్స్‌ను సేక‌రించిన ప‌లువురు సైంటిస్టులు వాటిని ప‌రీక్షించ‌గా బాధితుల్లో ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్లు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని నిర్దారించారు. దీనితోపాటు ఈబ్లడ్ సాంపిల్స్ సేకరించిన వారిలో చాలమంది డిప్రెష‌న్ బారిన ప‌డ్డార‌ని నిర్ధారణ జరిగింది. 
దీనితో ఈ పరిశోధన నిర్వ హించిన వారు తాము పరిశోధన చేస్తున్న వారికి 3 వారాలపాటు వారానికి రెండు, మూడు సార్లు సీఫుడ్‌ను తినిపించారు. అలా సీ ఫుడ్‌ను తిన్న‌వారిలో 30 శాతం మందికి డిప్రెష‌న్ త‌గ్గింద‌ని నిర్దారణ జరిగింది. దీనితో సీఫుడ్‌ను రెగ్యుల‌ర్‌గా తిన‌డం వ‌ల్ల డిప్రెష‌న్ బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని సైంటిస్టులుతేల్చిన పరిశోధనా ఫలితాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: