మనంతినే ఆహారంలో అనేక పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం మనం తినే ఆహారంలో విటమిన్స్ మినరల్స్ తో పాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అనబడే పోషకాలు కూడా మనం తినే పలు ఆహార పదార్థాల్లో ఉంటాయి అన్న విషయం చాల కొద్దిమందికే తెలిసిన విషయం. 

ఈ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన మెదడుకు పోషణనిస్తాయి. దీనివల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. అంతేకాదు ఈ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వల్ల గుండె రక్త నాళాలు ఊపిరితిత్తులు శరీర రోగ నిరోధక వ్యవస్థలకు బాగా బలం చేకూరుతుంది. దీనివల్ల ఈ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహార పదార్ధాలను బాగా తీసుకోమని వైద్యులు సలహాలు ఇస్తున్నారు. 

ముఖ్యంగా వాల్‌నట్స్, చెస్ట్‌నట్స్, బాదంపప్పు, పల్లీలు, అవకాడోలు, గుమ్మడికాయ విత్తనాలు, ఆలివ్ ఆయిల్, అవిసె గింజలు, కోడిగుడ్లు, కాలిఫ్లవర్, చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మన శరీరానికి పోషణ  లభించడమే కాకుండా మరెన్నో లాభాలు సమకూరుతాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహార పదార్ధాలను బాగా తీసుకున్న వారికి ఆస్తమా సమస్యల నుండి బయట పడవచ్చు.

అదేవిధంగా కీళ్ళ నొప్పులు వాపుల సమస్యల నుండి కూడ ఈ ఒమేగా 3 ఆహార పదార్ధాలు రక్షణ కలిగిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంతో పాటు ఈ ఆహారాలను తినడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. అంతేకాదు ఈ పోషక పదార్ధాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనం యాక్టివ్ గా ఉండటమే కాకుండా జ్ఞాపక శక్తి పెంపొంది చైతన్య వంతంగా ఉండవచ్చు..



మరింత సమాచారం తెలుసుకోండి: