Related image

పట్టుమని మూడున్నర దశాబ్ధాల వయసు కూడా లేని ఒక గ్రామీణ యువకుని జీవితం, పోరాట పటిమ, సాధించాలనే తపన, ఇబ్బందులు ఎదురైన, ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో,  దూసుకెళ్ళే తీరు, నేటి యువతరానికి మార్గదర్శనం చేస్తుంది. అతి చిన్న వయసులోనే ఆయన స్థాపించి పేంచి పోషిస్తున్న "కోటీ గ్రూప్ ఆఫ్ వెంచర్స్" నేడు ₹ 750 కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించింది.

Mr.Kotii Reddy - Profound Philanthropist, Man with Motives and Missions now featured in Wikipedia

అంతలా ఎదిగిన దాని చత్రచాయలో ఆయన తలపెట్టిన అనేక సమాజ సేవా కార్యక్రమాలు ప్రజా సామాన్యానికి అందించా లనే ఆయన సేవానిరతికి నిదర్శనం.  ₹ 750 కోట్లు అనేది ఆయన దృష్టిలో ఒక కొలత మాత్రమే. సేవానిరతి, పరోపకారం అనెవి ఆయన సంపద లంటారు ఆయన్ని కోటిరెడ్డి సరిపల్లెగా ఎరిగినవారు.

Image result for koti group of technological ventures r&d p limited

ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా గుడివాడ లోని ఒక మద్యతరగతి రైతు కుటుంబానికి చెందిన కోటిరెడ్ది పద్నాలుగేళ్ళకే ఎస్.ఎస్.సి. పూర్తి చేసుకొని తన గమ్యాన్ని, తన భాగ్యాన్ని వెతుక్కొంటూ భాగ్యనగరానికి వచ్చారు. పిజిడిసిఏ సర్టిఫికేట్ తో ఒక శక్తివంతమైన లక్ష్యాన్ని మది నిండా మోసు కొని హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ పుస్తకాల పురుగు కు చదువు మాత్రమే లక్ష్యమైతే ఈయన గొప్ప వాడై అక్కడే ఉండేవాడు. మనకు చెప్పుకోవటానికి ఏమీ ఉండేది కాదు!

Image result for koti group of technological ventures r&d p limited

డిగ్రీ లేకపోవటాన్ని ఒప్పించి పన్నెండు రౌండ్ల ఇంటర్వ్యూని దాటుకొని మైక్రోసాఫ్ట్ ఇండియాలో -  ఉన్నత స్థాయికి చేరేవరకు - ఒక దశాబ్ధం పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్ స్థాయి నుండి అప్లికేషన్ ఆర్కిటెక్ట్ - ఆధిపథ్యం వరకు పని చేస్తూ ఆపై సమాంతరంగా యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లో గ్రాడ్యుయేషన్ ఆ తరవాత డాక్టరేట్ సాధించే వరకు నిద్రపోలేదు కోటిరెడ్డి. ఏ డిగ్రీ లేకుండా మైక్రోసాఫ్ట్ లో చేరిన తొలి భారతీయుడు డా: కోటిరెడ్డి మాత్రమే.  

Image result for koti group of technological ventures r&d p limited

ఊహలకు అవతలి తీరం దాటి కలలు కన్న స్వాప్నికుడు ఈ సామాన్యుడు. ఎంచుకున్న పుస్తకాలు నవలలు, సాహిత్యం మాత్రమే కాదు,  ఙ్జానసమూపార్జన లక్ష్యంగా,  జీవన గమ్యాన్ని ముందుగానే నిర్దేశించ గల సజీవ ప్రవాహమైన జీవితచరిత్రలు. అందులో జీవన విజయాలే కాదు, సజీవ పరాజయాలు చవి చూసిన ఉద్దండుల ఉద్గ్రంధాలూ ఉన్నాయి. అంతకు మించిన ప్రోత్సాహ ప్రవాహం ఆయనకు తగినంత సామర్ధ్యాన్ని అకుంఠిత దీక్షను ఇచ్చింది. 

Image result for koti group of technological ventures r&d p limited

అందుకే ఈ గ్రామీణ సామాన్యుడు మహానగరాలను కాస్మోనగరాలను చేరి అనన్య సామాన్యుడుగా మారిన ట్రాన్స్ఫార్మేషన్ అదే పరివర్తనను తీర్చిదిద్ది, దాన్నిగతి తప్పకుండా నడిపించింది మాతృమూర్తి నుండి అందిపుచ్చుకున్న బలమైన కోరికే. అదే ఆశీస్సుగా  చెప్పొచ్చు.

ఒక గ్రామీణ బాలుడు అతి స్వల్ప కాలగమనంలో తానెదిగి, తన ఎదుగుదలతో ఆగిపోలేదు సరికదా! తన వారికి, తన గ్రామాని కి  సాధికారత సాధించటానికి ప్రయత్నించటమే, అమ్మమాటను మించి ఆయనలో ఆయన పెంచుకున్న సంపద.

Mr.Kotii Reddy - Profound Philanthropist, Man with Motives and Missions now featured in Wikipedia

సమయ గమనంలో తన గ్రామీణ సాధికారత అనే ఆలోచనను 238 దేశాల్లో 784 కోట్ల గ్రామీణ ప్రాంతాల నుండి కాస్మోనగరాల వరకు ప్రజలకు విద్య, ఆరోగ్యం. ఆర్ధికం, వ్యవసాయం, నిర్మాణం, పరిశోధన & అభివృద్ది, సేవలు మొదలైన రంగాల్లో వారికి సహకారం అందిస్తూ తానెదుగుతూ.... పదుగురికి సహకరించే పరోపకారి గా నిలవాలన్నదే ఆయన లక్ష్యం, తపన.

అందుకోసమే భారత్ ఇన్నొవేషన్ లాబ్స్, డిజిటల్ ఎడుకేషన్, డిజెడ్ పే, కోటీ ఫౌండేషన్, ఇండియా హెరాల్ద్, బోద, సేవా ఫౌండేషన్, క్రౌడ్ బ్లడ్, సిట్రస్ క్లినిక్, స్నాగర్ వంటి సంస్థలను స్వంతంగా అంతర్జాతీయ గుణాత్మక విలువలతో ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగిపోతుందీ కోటీ పరోపకార ప్రవాహం. 

Mr.Kotii Reddy - Profound Philanthropist, Man with Motives and Missions now featured in Wikipedia

పరోపకారిగా (పిలాంథ్రపిస్ట్) కోటిరెడ్ది తొలి ప్రయత్నం తను చదువుకున్న తన కుగ్రామం నందివాడ, జొనపాడులలోని రెండు ప్రభుత్వ పాఠశాలలకు సాంకేతికత....మిళితం చేసి పాఠాశాల విద్యను అందిస్తున్నారు. దీని ద్వారా 700 మంది విద్యార్ధులు ప్రయోజనం పొందగా తొలి ప్రయత్నంలోనే నూరుశాతం ఆ గ్రామీణ విద్యార్ధులకు సాధించి పెట్టారు.

Related image

Image result for koti group of technological ventures r&d p limited

సేవాభావం నిర్దేశించుకున్న తెలివైన వాళ్లు,  సరైన లక్ష్యం కలిగిన వాళ్ళు తన అనుభవాల పైనే కాకుండా ఇతరుల అనుభవాలను కూడా పునాదులుగా చేసుకొని తమ లక్షిత సామ్రాజ్యాలను నిర్మించుకుంటారు. అదే మన కోటిరెడ్డి చేశారు.

Image result for benefit of biography reading quotes

సమకాలీన పరిస్థితుల్లో సమకాలీనుల విజయవంతమైన జీవితచరిత్ర లపై మనసులో చేసుకొని తన ప్రయత్నాల్లో ఆ అనుభవాల సారాన్ని వాడెయ్యటమే ఆయన విజయాలకు పునాదులైతే,  అపజయాల జీవితచరిత్ర లు వైఫల్యాలను దరిచేరకుండా ఎలా నివారించాలో  తెలుసుకోవటం ఆయన నవయువ పరిఙ్జనానికి నిదర్శనం.

Mr.Kotii Reddy - Profound Philanthropist, Man with Motives and Missions now featured in Wikipedia

జీవిత చరిత్రల పఠనం లక్ష్య నిర్దేశానికి తగిన ఙ్జానం అందిస్తే – వైఫల్యాల చరిత్రలు విజయాలకు రాజమార్గాలు నిర్మిస్థాయి అనే యదార్ధం డా: కోటి రెడ్డి విషయంలో ఋజువైంది.  

Mr.Kotii Reddy - Profound Philanthropist, Man with Motives and Missions now featured in Wikipedia

Mr.Kotii Reddy - Profound Philanthropist, Man with Motives and Missions now featured in Wikipedia

మరింత సమాచారం తెలుసుకోండి: