హిందూ వివాహం ఒక పవిత్ర కార్యము అని గతంలో గుర్తింపు నివ్వడం జరిగింది. అయితే 1956 లో హిందూ వివాహ చట్టం రూపొందించిన తరువాత, వివాహానికి ఒక ప్రత్యేకమై న ప్రక్రియ గానీ, విధానంగానీ చెప్పబడలేదు. అంతే కాక హిందూ మత ఆచారానికి గుర్తింపునివ్వబడింది. హిందూ మతంలో ఉన్న విభిన్న సామాజిక వర్గాలు వేరువేరు వివాహ పద్ధతులను ఆచరించడాం జరుగుతుంది. హిందూ వివాహపు సరైన గుర్తింపు కోసం మతాచారాలను పాటించడం ప్రధానం. హిందూ వివాహం చెల్లుబాటు అగుటకు ఈ క్రిందినుదహరించిన పద్ధతులు పాటించాలి.

Image result for marriage tradition

వరుడు 21 సంవత్సరాలు, వధువు 18 సంవత్సరాలు నిండి ఉందాలి. ఈ షరతును ఉల్లంఘించితే శిక్షార్హమైన నేరంగా పరిగణింపబడుతుంది.
వధూవరులకు గతంలోనే వివాహమైన పక్షంలో వారి భార్త లేదా భర్త జీవించి ఉండరాదు లేదా అట్టి వివాహం అమలులో ఉండరాదు. ఈ షరతును భిన్నంగా జరిగిన ద్వితీయ వివాహాన్ని బహుభార్యత్వం అనే నేరంగా పరిగణిస్తారు.  వధూవరులిద్దరూ వివాహానికి అనుమతి ఇవ్వగల మానసిక సామర్థ్యం కలిగి ఉండాలి. మానసిక వైకల్యం వివాహానికి కానీ, సంతాన వృద్ధికి గానీ ఆటంకమవుతుంది. వధూవరులిద్దరూ తరచూ మానసిక వైకల్యానికి లేదా "ఎపిలెప్సీ" అనే మానసిక వ్యాధికి గురి అయి ఉండరాదు.

Image result for marriage tradition

వధూ వరుల మధ్య నిషేధించబడిన స్థాయిలలో బంధుత్వం ఉండరాదు. అనగా ఒకరు వారి తల్లి నుండి మూడు తరాలు లేదా తండ్రి నుండి మూడు తరాలలో బాంధవ్యం కలిగి ఉండరాదు. అలాగే వధూవరులకు సపిండ బంధుత్వంలో ఒకే తరపు బంధువు పైస్థాయిలో ఉండరాదు. సోదర/సోదరి, పిన తండ్రి/మేనమామ, మేనకోడలు/కూతురు, మేనత్త/పినతల్లి/మేనల్లుడు/కుమారుడు, సోదరులు/సోదరీల సంతానముల మధ్య వివాహం నిషేధించబడింది. ఏ వ్యక్తి అయినా తన సోదరుడి భార్యను విడాకులైన తరువాత కూడా వివాహం ఆడరాదు. అయితే ఏ ప్రాంతములోనైనా, లేదా సామాజిక వర్గంలోనైనా అనాదిగా పాటిస్తూ వచ్చిన ఆచారం రీత్యా నిషిద్ధ స్థాయిలలో బంధుత్వం ఉన్నప్పటికీ వివాహం చేసుకోవచ్చు. అలాగే భార్య గతించిన వ్యక్తి, భర్త గతించిన మహిళను వివాహమాడవచ్చు.

Image result for marriage

కేవలం సబ్‌రిజిష్టర్ కార్యాలయంలో ఒక దస్తావేజు రాసి నమోదు చేయించినంత మాత్రాన హిందూ వివాహం చెల్లుబాటు కాదు. వివాహానికి సంబంధించిన ఆచార క్రతువులు నిర్వర్తించనిదే ఆ వివాహం సక్రమమైనదిగా గుర్తించలేము. అదే విధంగా హిందూ వివాహాల రిజిష్టర్ లో అసలు వివాహం కార్యక్రమమే జరుపకుండా నమోదు చేసిన వివరాలు ఆ వివాహాన్ని చలామణి చేయవు. అయితే వివాహ కార్యక్రమం పూర్తి అయినాక హిందూ వివాహ రిజిష్టర్ లో వధూవరులు తమ వివాహ వివరాలను నమోదు చెయవచ్చు. ఈ రిజిష్టర్ లోని నమోదు చేయబడిన అంశాలు వివాహం వాస్తవంగా జరిగినట్లు సాక్ష్యంగా ఉపయోగపడతాయి. అందువల్ల ఇలా నమోదు చేయడం దంపతులిద్దరికీ ఉపయోగకరం.


మరింత సమాచారం తెలుసుకోండి: