సంక్రాంతి సందడికి పల్లెలు రెడీ అవుతున్నాయి. మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభతో శోభిళ్లనున్నాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు ఇది అతి పెద్ద పండుగ. కేవలం ఈ పండుగ కోసమే పల్లెటూళ్లు ఎదురు చూస్తుంటాయి. పట్టణాలను పాకిన వలస జీవనాలు పండుగ వేళ తమ మూలాలను స్పృశిస్తాయి.

sankranthi celebrations కోసం చిత్ర ఫలితం


ఎక్కడెక్కడికో బతుకుదెరువుకు వెళ్లినవారు కూడా తప్పకుండా సంక్రాంతికి సొంత ఊళ్లకు చేరడం సర్వసాధారణం. ఇక సంక్రాంతి సెలవులంటే పిల్లలకు మరపురాని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. బాలల విషయానికి వస్తే సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. సంక్రాంతి రోజుల్లో ఆకాశాలు పతంగులతో సరికొత్త అందాలు సంతరించుకుంటాయి.

sankranthi CHILDREN కోసం చిత్ర ఫలితం


పోటీపడి మరీ పెద్ద పెద్ద పతంగులు తయారు చేయడం.. పతంగులను అత్యంత ఎత్తుకు ఎగరేయడం.. ఒకరి గాలిపటాన్ని మరొకరు పోటీపడి తెంపేయడం.. ఇలా పిల్లలు, కుర్రకారు గాలిపటాల సందడికి అంతే ఉండదు. హైదరాబాద్ వంటి చోట్ల ప్రత్యేకించి సంక్రాంతి రోజుల్లో కైట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తుంటారు కూడా.

సంబంధిత చిత్రం


ఇక చాలా ప్రాంతాల్లో సంక్రాంతి రోజుల్లో బొమ్మల కొలువులు నిర్వహిస్తారు. ఈ బొమ్మల కొలువుల్లో మన దేవుళ్లు, పురాణ పాత్రలు, గ్రామీణ వృత్తుల బొమ్మలు.. ఇలా అనేక రకాల బొమ్మలను కొలువుతీరుస్తారు. సాయంత్రం వేళల్లో ఈ బొమ్మలకొలువుల సందడి చాలా బావుంటుంది. ఇక భోగి పండుగ రోజులు పిల్లలను ప్రత్యేకంగా అలంకరించి వారికో భోగిపళ్లుూ పోయడమూ ఓ తీపి జ్ఞాపకమే.


మరింత సమాచారం తెలుసుకోండి: