క్రెడిట్ స్కోర్.. ఇప్పుడు ఎలాంటి రుణం తీసుకోవాలన్నా.. కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా ఈ క్రెడిట్ స్కోర్ చాలా కీలకం.. మరి దీన్ని ఎలా లెక్కిస్తారు.. మీ క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది.. క్రెడిట్ స్కోర్ బాగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. పరిశీలిద్దాం..

సంబంధిత చిత్రం


మీరు తీసుకున్న రుణాలు, వాటిని చెల్లిస్తున్న తీరును ఒక చోట క్రోడీకరించడమే రుణ చరిత్ర. ఈ చరిత్ర ఆధారంగా కొన్ని మార్కులు కేటాయించడమే క్రెడిట్‌ స్కోరు అని సింపుల్ గా చెప్పొచ్చు. సిబిల్‌ ఒక వ్యక్తికి సంబంధించిన రుణ చరిత్రను టెక్నికల్ గా విశ్లేషించి ఒక స్కోరును నిర్ణయిస్తుంది.

సంబంధిత చిత్రం


సాధారణంగా ఇది 300 నుంచి 900 పాయింట్ల మధ్యలో ఉంటుంది. మీ స్కోరు 900 పాయింట్లకు ఎంత చేరువగా ఉంటే.. మీకు రుణం లేదా క్రెడిట్ కార్డు వచ్చే అవకాశాలు అంత మెరుగ్గా ఉన్నాయన్నమాట. అంటే మీరు తీసుకున్న రుణాన్ని కచ్చితంగా చెల్లిస్తారని రుణ సంస్థలు నమ్ముతాయి.

credit score calculation కోసం చిత్ర ఫలితం



క్రెడిట్‌ స్కోరును లెక్కించే విధానం, పద్ధతులు సంస్థలను బట్టి మారుతుంటాయి. అన్నింటి కంటే.. ఒక రుణాన్ని తిరిగి ఎలా చెల్లిస్తున్నారన్నదే ప్రధానం. అసలు ఎంత మొత్తం రుణం తీసుకున్నారు.. ఇప్పటికే తీసుకున్న రుణాలన్నీ సక్రమంగా చెల్లిస్తున్నాడా లేదా.. ఒకవేళ చెల్లించకపోతే ఎన్ని రోజుల నుంచి బాకీ ఉన్నారు అనే విషయాలు పరిశీలిస్తారు. తీసుకున్న రుణం ఎలాంటిది.. వేరే ఎవరికైనా హామీ ఉన్నారా.. అనే అంశాలు కూడా పరిశీలిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: