ఔను.. ఇప్పుడు జనంలో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఆరోగ్యం బావుంటేనే జీవితంలో ఏదైనా సాధించగలమని నమ్ముతున్నారు. అందుకే నాలుకను కాస్త కంట్రోల్ లో ఉంచుకుని ఆరోగ్యవంతమైన ఆహారం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది నోట వినపడుతున్న మాట కొర్రలు.

సంబంధిత చిత్రం


మరి ఈ కొర్రల్లో ఏం ప్రత్యేకత ఉంది.. ఓసారి పరిశీలిద్దాం..  సెటారియా ఇటాలికా జాతికి చెందిన కొర్రలు ఆరోగ్యానికి ఎనలేని మేలు చేస్తాయిమధుమేహాన్ని నియంత్రించటంలో కొర్రలు ప్రముఖ పాత్ర పోషిస్తాయిఇంతకు ముందు తరాలు ఎక్కువగా డయాబెటిస్‌ బారిన పడలేదంటే అదంతా ఈ కొర్రల చలవే

సంబంధిత చిత్రం

కొర్రన్నం తినటానికి డయాబెటిస్‌ వ్యాధి గ్రస్తులు ఇబ్బందిగా అనిపిస్తుందిఇలాంటప్పుడు మామూలు బియ్యంలో గుప్పెడు కొర్రల్ని వేసి అన్నం చేసుకుని తింటే మంచి గుణం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. కొర్రల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో సులువుగా జీర్ణమైపోతుంది

korralu images కోసం చిత్ర ఫలితం


కొర్రలు జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి కూడా. కొర్రల్లో ప్రొటీన్లు 11 శాతం ఉంటాయిముఖ్యంగా కొర్రలతో చేసిన ఆహారం తింటే కొవ్వు పెరిగే సమస్యే ఉండదు. శరీరంలోని జీవక్రియల్ని సక్రమంగా నడిపించే శక్తి ఈ తృణధాన్యాలకుందిఅందుకే ఇప్పుడు అంతా కొర్ర జపం జపిస్తున్నారు. మరి మీ సంగతి..?


మరింత సమాచారం తెలుసుకోండి: