ఒబేసిటీ ఇప్పుడు మనలో చాలామందిని వేధిస్తున్న సమస్య. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి. చాలామంది తిండి మానేసి బరువు తగ్గాలని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో అసలైన పోషకాలు శరీరానికి అందక ఇతర రోగాల బారిన పడతారు. మరి కావలసినంత తింటూనే బరువు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి.

obesity foods to eat కోసం చిత్ర ఫలితం


ఇలా జరగాలంటే.. ఏం తింటే కొవ్వు చేరదో గమనించాలి. మనం తినే జాబితాలో ఆ ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి. అవేమిటో చూద్దాం.. ఉడికించిన కోడిగుడ్డు తింటే బరువు తగ్గుతారట. దీనిలోని ల్యూసిన్‌ అనే అమైనో యాసిడ్‌ బరువు తగ్గించడానికి సహాయపడుతుందట. అలాగే దానిమ్మ గింజలు ఎన్ని తిన్నా మంచిదే అని చెబుతున్నారు నిపుణులు.

సంబంధిత చిత్రం


ఆహారపదార్థాల తయారీకి ఆలివ్‌ ఆయిల్‌ ఉపయోగిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెలోని మోనో శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొల్రెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను కాపాడటమే ఇందుకు కారణం. బరువు పెంచని మరో ఆహారం చేపలు.

సంబంధిత చిత్రం

చేపల్లో కొవ్వు ఉండకపోవడం వల్ల క్యాలరీలు చాలా తక్కువ. పచ్చని కాయగూరలు, ఆకుకూరల్లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండినట్టు అనిపిస్తుందట. వెజిటబుల్ సూప్స్ వల్ల కూడా క్యాలరీలు పెద్దగా పెరగవు. మనం రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్లో ఉడికించిన కోడిగుడ్డు, చేపలు, కూరగాయలు, ఆలివ్ నూనె, దానిమ్మ గింజలు.. వుండేలా చూసుకుంటే బరువు పెరగకపోవడం మన చేతుల్లోనే ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: