ఎక్క‌డికి వెళ్లినా ఫ‌లితం ఉండ‌దు. ఎవ‌రూ అవ‌కాశం ఇవ్వ‌రు. తిరిగి తిరిగి అలసిపోయి క‌సి పెంచుకున్నాడు. క‌సిలోంచే పుట్టిందో ఆలోచ‌న‌. త‌నేం చేయాలో క్లారిటీ వ‌చ్చాడు. ఆలోచ‌న‌ల‌ను అమ‌ల్లో పెట్టేశాడు ఇంకేం ప్ర‌పంచ కుబేరుడిగా, ఆసియాలో నంబర్ వ‌న్ ధ‌న‌వంతుడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. 

అత‌నికి చ‌దువు అంటే ఎంతో ఇష్టం. ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకున్న తనను హార్వార్డ్ యూనివర్సిటీ పది సార్లు తిరస్కరించింది. చైనాలో కేఎఫ్సీ రంగప్రవేశం చేసిన తొలినాళ్లలో అందులో ఉద్యోగం కోసం 24 మంది దరఖాస్తు చేసుకుంటే 23 మందిని ఎంపిక చేస్తే, ఆ ఎంపిక కాని ఏకైక వ్యక్తి అత‌డే. దీంతో అత‌నిలో తీవ్ర అసహనం. ప్రపంచాన్ని మార్చాలని అనిపించేది అత‌నికి. అయితే అంతకంటే ముందు మారాల్సింది తానేనని గుర్తుచేసుకున్నాడు. ఉపాధ్యాయుడిగా మారాడు. లైఫ్‌లో ఎద‌గాల్సింది ఎంతో ఉంద‌ని త‌న‌కు తాను గ్ర‌హించుకున్నాడు. ఆ త‌ర్వాత త‌నేంటో తెలుసుకున్నాడు. ఏం సాధించాలో ఆలోచించుకున్నాడు. ఇంకేం వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. ఆసియాలోనే నంబ‌ర్ వ‌న్ కుబేరుడిగా అవ‌త‌రించాడు చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీ బాబా గ్రూప్ అధినేత జాక్ మా. 

 Image result for alibaba jack ma life
ప్రపంచ కుబేరులలో జాక్ మా స్థానం టాప్‌లో ఉంది.. కానీ అత‌డు ఒకప్పుడు ఒక పేద ఉపాద్యాయుడు. 1980 లో చైనాలో ఒక సాధారణ స్కూల్లో ఒక ఉపాధ్యాయుడుగా జాక్ మా పని చేసాడు. కొద్దీ కాలం తర్వాత ఆ ఉపాద్యాయుడుగా ఉద్యోగం మానేసి ఒక అనువాద సంస్థ స్థాపించాడు. బిల్ గేట్స్ , స్టీవ్ జాబ్స్ , ఇక ఇతర ధనవంతులు లాగా జాక్ మా గారికి కంప్యూటర్ పరిజ్ఞానం లేదు. అయిన ఈయన తెలివితో ఇప్పుడు ప్రపంచంలో ఒక వ్యాపార దిజగ్గం లాగా నిలిచాడు. 
 
జాక్‌మా చిన్నప్పుడు నుంచి చదువులో అంతా రాణించేవాడు కాదు. చిన్నతనంలో ఈయనకు లెక్కల పరీక్షలలో 120 మార్కులకి కేవలం 1 మార్కు వచ్చింది. ఈయన ఎంత అవమానం పడ్డారు అంటే కే ఎఫ్ సి సహా పలు కంపెనీ ఇంటర్వ్యూలు ఈయనని తిరస్కరించారు. జాక్ మా 1994లో అమెరికాకు వెళ్లాడు. అక్కడే కంప్యూటర్ గురించి తెలుసుకున్నాడు. ఇలా కంప్యూటర్ గురించి తెలుసుకున్న తర్వాత ఈయన స్నేహితులు అలీబాబా కంపెనీ పెట్టడానికి సహాయపడ్డారు. 
 Image result for alibaba jack ma life
జాక్ మా 17 మంది తన స్నేహితులతో కలిసి 1997 లో ఫిబ్రవరి 21 న అలీబాబా కంపెనీ మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో స్థాపించారు. అదే కాక అలీబాబా కంపెనీ చైనాలో నెంబర్ వన్ కంపెనీగా నిలిచింది. ఇప్పుడు జాక్ మా ఆస్థి ఎంత ఉంటుందో తెలుసా? అక్షరాలా 2 ల‌క్ష‌ల 43 వేల కోట్లు. అలీబాబా ఈ కామర్స్ బిజినెస్‌లోనే కాకుండా డిజిటల్ పేమెంట్ కంపెనీగా కూడా అత్యున్నత శిఖరానికి చేరుకుంది.  420 బిలియన్ డాలర్ల విలువైన ఈ కామర్స్ సంస్థగా అలీబాబా ఓ వెలుగు వెలుగుతూనే వుంది.
 
అలీబాబా ప్రారంభించి, తన సంస్థలో 47 శాతం మంది మహిళలకు స్థానం కల్పించానని చెబుతాడు జాక్ మా. అదే తన స‌క్సెస్ సీక్రెట్ అని చెబుతాడాయ‌న‌. ఈ రోజు నీ దగ్గర కొన్ని వందల మిలియన్ల సంపద ఉండి ఉండొచ్చు...కానీ ఆ సంపదను ఇచ్చింది ఈ సమాజమేనన్న కృతజ్ఞత ఉండాలి అంటాడు.
 Related image
అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప‌ద‌వికి జాక్ మా త్వరలో రిటైర్ కానున్నాడు. రిటైర్మెంట్ అంటే అధ్యాయం ముగిసిపోవడం కాదంటాయాన‌. కొత్త శకం ప్రారంభమ‌ని, విద్య పైన దృష్టి సారిస్తానని తెలిపాడు. అయితే జాక్ మా అలీబాబా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఉంటారు. కంపెనీ మేనేజ్‌మెంట్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తారు. జాక్ మాకు ఈ సెప్టెంబ‌ర్ 10న‌ 54 ఏళ్లు వయ‌సులోకి అడుగుపెడుతున్నాడు. ఒక సాధార‌ణ ఉపాధ్యాయుడు త‌న స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌ల‌తో ప్ర‌పంచ‌మే గ‌ర్వించే ఒక వ్య‌వ‌స్థ‌ను నిర్మించాడు. ఆ స‌క్సెస్ స్టోరీ ఈ త‌రం యువ‌త‌కు స్ఫూర్తి మంత్రమ‌నే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: