Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 27, 2019 | Last Updated 1:31 pm IST

Menu &Sections

Search

స‌క్సెస్ స్టోరీ: ఆ ఒక్క ఆలోచ‌న కుబేరున్ని చేసింది!

స‌క్సెస్ స్టోరీ: ఆ ఒక్క ఆలోచ‌న కుబేరున్ని చేసింది!
స‌క్సెస్ స్టోరీ: ఆ ఒక్క ఆలోచ‌న కుబేరున్ని చేసింది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒక్క ఆలోచ‌న‌ల అద్భుతాన్ని ఆవిష్క‌రించింది. అల‌జ‌డిరేపుతున్న స‌మ‌యంలో దేశ‌ ఆర్థిక‌ జ‌న‌జీవనాన్ని స‌క్ర‌మ‌మార్గంలో పెట్టింది. ఆ ఆలోచ‌న వెనుక అహోరాత్రుల శ్ర‌మదాగి ఉంది. దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత పేటీఎమ్ ఎంతో పాపుల‌ర్ అయింది. రోజుకి 20 లక్షల ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిపే పేటీఎమ్ సంస్థ ప్రస్తుతానికి 50 లక్షలకు పైగా లావాదేవీలను నిర్వహించడం పేటీఎమ్ జ‌నాల్లో ఎంత‌గా చొచ్చుకుపోయిందో తెలుపుతోంది. ఇదంతా ఒక్క రోజులో ఏమీ జ‌ర‌గ‌లేదు. ఎన్నో ఏళ్ల కృషి, దీర్ఘ‌కాల ప్ర‌ణాళిక‌తోనే ఇదంతా జ‌రిగింది. ఇంజినీరింగ్ విద్య నుంచి డిజిట‌ల్ చెల్లింపులంటే పేటీఎమ్ అనేలా ఆ సంస్థ‌ను విజ‌య శేఖ‌ర్ శ‌ర్మ మ‌లిచిన తీరు ఈనాటి యువ‌తకు ఆద‌ర్శం.  
 vijay-shekhar-sharma-success-story-paytm-youngest-
చ‌దువులో ప్రతిభావంతుడైన విద్యార్ధి కావ‌డం వ‌ల్ల విజ‌య్‌కి 15 వ సంవత్సరంలో ఢిల్లీ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ లో అడ్మిషన్ దొరికింది. మొద‌టి నుంచి హిందీ మీడియం కావ‌డం వ‌ల్ల విజ‌య్‌కి ఆ స‌మ‌యంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంచి ఇబ్బందులు ఎదుర‌య్యాయి. దాంతో విజయ్ క్లాసులకు వెళ్లడం మానేసి లైబ్ర‌రీలో పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. ఆలా చాలా మంది సక్సెస్ స్టోరీస్ చదవడం వల్ల అవి విజయ్ జీవితాన్ని బాగా ప్రభావితం చేశాయి, అలాగే తన ఇంగ్లీష్ ను కూడా మెరుగు పరిచిందట. అంతేకాదు ఈ కారణంతో తనలో ఆలోచనలు మారుతూ తాను కూడా బాస్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు.
 
ఆలా తన ఆలోచనలకి అనుగుణంగా కంప్యూటర్ క్లాసులకు వెళ్లడం మొదలు పెట్టి కోడింగ్ కూడా నేర్చుకున్నాడు. తన 19 వ ఏట త‌న క్లాస్‌మెట్ హైందర్ తో కలిసి "ఇండియా సైట్ డాట్ కం ను డిజైన్ చేసాడు. ఆ తరువాత వీరిద్దరూ కలిసి రెండు మూడు చిన్న కంపెనీలకు పని చేశారు. 2001 లో విజయ్ తన ఇద్దరి స్నేహితులతో కలిసి ద‌క్షిణ‌ఢిల్లీ లో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అలా వారు 5 లక్షలు పెట్టుబడి పెట్టి one97 communications  అనే కంపెనీని ప్రారంభించారు.
 vijay-shekhar-sharma-success-story-paytm-youngest-
ఇదే మొద‌ట్లో మొబైల్ యూజర్లకు వార్తలు, రింగుటోన్స్, మెసేజీలు, జోక్స్ పంపేందుకు ఉపయోగపడింది. ఆ తరువాత one97 డౌన్ అవ్వ‌డం స్టార్ట్ అయింది. తమ వద్ద పెట్టుబడులు కూడా అయిపోవడంతో ఇద్దరు స్నేహితులు నిరాశకు గురయ్యారు. ఆలా రెండు సంవత్సరాలుగా పరిస్థితి కొనసాగటం చూసి 2003, 2004 లో విజయ్ వేరే కంపెనీల్లో ఉద్యోగాలు చేసి తన సొంత కంపెనీని కాపాడుకోటం కోసం ప్రయత్నించాడు. తన కంపెనీ లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం కోసం తన స్నేహితుడితో కలిసి తన బంధువుల దగ్గర 24 శాతానికి అప్పు తీసుకున్నాడు.
 
2004 లో తన కంపెనీ పడిపోయే దశలో ఫ్యుజ్ అగర్వాల్ సహాయం దొరికింది. తాను విజయ్ కంపెనీ లో 3 లక్షలు పెట్టుబడి పెట్టి 40 శాతం షేర్లను కొన్నాడు. ఇదే స‌మ‌యంలో విజయ్ కి ఒక ఆలోచ‌న త‌ట్టింది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోవ‌డం, దానికి సంబందించిన వినియోగ‌దారుల సమస్యలు పరిష్కరించడానికి కార్యాచరణ రాసుకున్నాడు.
 vijay-shekhar-sharma-success-story-paytm-youngest-
ఇందులో భాగంగానే విజయ్.. PAYTM .COM అనే ఆన్‌లైన్ సైట్ ని ప్రారంభించాడు. ఆలా PAYTM లో మొదట మొబైల్ రీఛార్జిగా ప్రారంభించారు. మార్కెట్ లో అనేక ఆన్‌లైన్ సైట్స్ ఉన్న పేటియం చాల సులభతరంగా ఉండేది. అందుకే అత్యంత తక్కువ సమయంలో అందరికి చేరువైంది.
 
గెలిచిన వీరులు ఎప్పుడూ రెడ్ కార్పెట్‌పై న‌డ‌వ‌రు. ఇదే విష‌యం శ‌ర్మ విష‌యంలోనూ నిజ‌మైంది. వ్యాపారంలో ఆయ‌న‌ను కూడా భాగ‌స్వాములు మోసం చేశారు. అయితే అంద‌రిలాగా ఆయ‌న డీలా ప‌డ‌లేదు. 2005లో అధిక వ‌డ్డీకి అప్పు తీసుకున్నారు. త‌న వెంచ‌ర్‌లో 8 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ పెట్టుబ‌డి పెట్టారు. న‌మ్మిన‌వారే మోసం చేయ‌డంతో 40 శాతం కోల్పోయాడు. అయితే అంత తొంద‌ర‌గా నిరాశ‌చెంద‌లేదు. భ‌విష్య‌త్తుపై ఆశ‌తో ముందుకు సాగాడు. వ‌న్97 క‌మ్యూనికేష‌న్స్‌లో భాగంగా 2011లో పేమెంట్ల వ్య‌వ‌స్థ ప్రారంభం అయ్యే వ‌ర‌కూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. చివ‌ర‌కు విజ‌యం సాధించాడు. నాలుగు ప‌దుల వ‌య‌సు నిండకుండానే బిలియ‌నీర్‌గా మారాడు. ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల లిస్టులోకి చేరాడు. ఎదురుదెబ్బ‌ల‌కు చెదిరిపోని మ‌నోధైర్యం, ముందుచూపు ఆలోచ‌న‌లు, విజ‌యంసాధించేవ‌ర‌కు త‌గ్గ‌ని ప‌ట్టుద‌ల.. విజ‌య శేఖ‌ర్ శ‌ర్మను విజ‌య‌శిఖ‌రాలకు చేర్చాయి. ఈ త‌రం యువ‌త‌కు పేటీఎం సృష్టిక‌ర్త విజ‌యం స్ఫూర్తినిస్తుంది.
 


vijay-shekhar-sharma-success-story-paytm-youngest-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.