ఈ అమ్మాయి వ‌య‌సు జ‌స్ట్ 20 ఏళ్లు. వార‌స‌త్వం నుంచి వ‌చ్చిన ఆస్తి అస‌లే లేదు. అయితేనేం మ‌హామ‌హా కుబేరులకే షాక్ ఇస్తోంది. ఊహించ‌నంత స్పీడ్‌గా త‌న టాలెంట్‌తో సంపాదిస్తోంది. స్వ‌యంకృషితో చిన్న‌వ‌య‌సులోనే తిరుగులేని సంపాద‌న‌తో ప్ర‌పంచ దృష్టిని త‌న‌వైపే తిప్పుకుంటోంది. 

అమెరికన్‌ మోడల్‌ కైలీ జెన్నర్‌.. వయసు 20 ఏళ్లు మాత్రమే. కైలీ ఏం చేస్తే అదే ఫ్యాషన్‌. యూత్ బ్లైండ్‌గా ఆమె స్టైల్‌ను ఫాలో అయిపోతుంటారు. రెండేళ్ల క్రితం కైలీ కాస్మోటిక్స్‌ పేరిట ఓ స్టార్ట‌ప్ మొద‌లుపెట్ట‌గా.. అది కాస్త 630 మిలియన్‌ డాలర్లకు అమ్ముడుపోయి హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత ‘హండ్రెడ్ పర్సంట్‌’ పేరిట లిప్‌ కిట్.. 29 డాలర్లకు కిట్‌ అమ్మకాల బిజినెస్‌ను ప్రారంభించి.. రెండేళ్లలో గణనీయంగా ఆదాయాన్ని వెనకేసుకుంది. ప్రస్తుతం ఈ భామ ఆదాయం టాక్స్‌ మినహాయింపులుపోనూ సుమారు 900 మిలియన్‌ డాలర్లపైమాటే. భారత కరెన్సీలో చెప్పాలంటే 6 వేల కోట్లుకు పైమాటే. 

 Image result for kylie jenner
ఈ మేరకు ఫోర్బ్స్‌ మాగ్జైన్ కైలీజెన్న‌ర్ గురించి ఓ స్పెష‌ల్ స్టోరీ ప్రచురించింది. యంగెస్ట్‌ సెల్ఫ్‌ మేడ్‌ యూస్‌ బిలినియర్‌ పేరిట కైలీ గురించి ఆ ప్రత్యేక కథనం ప్రస్తావించింది. ఇదిలా ఉంటే కైలీ ప్రముఖ మోడల్‌, నటి కిమ్‌ కర్దాషియన్‌కు బంధువు. ట్రావిస్‌ స్కాట్‌తో రిలేషన్‌ షిప్‌లో ఉన్న కైలీ.. ఏడాది క్రితం  బిడ్డకు జన్మ ఇచ్చింది. పలు టీవీ షోలు, సినిమాల్లో సైతం నటించిన ఈ యంగ్‌ మోడల్‌కు సోషల్‌ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. 

Related image

గతంలో ఈ రికార్డు 23 ఏళ్ల‌వ‌య‌సులో ఫేస్‌బుక్‌ యాజమాని మార్క్‌ జుకర్‌బర్గ్ పేరిట ఉండగా.. 20 ఏళ్ల‌కే ఇప్పుడు కైలీ ఆ రికార్డు బద‍్ధలు కొట్టింది. మొత్తానికి చిన్న వ‌య‌సులోనే విప‌రీత‌మైన ఫాలోయింగ్‌తో, 6వేల కోట్ల సంపాద‌న‌తో ఈ త‌రానికి స్ఫూర్తిగా నిలుస్తోంది కైలీ.


మరింత సమాచారం తెలుసుకోండి: