బర్గర్లు, పిజ్జాలు ఇష్టపడే వయసులో అతడేదో కోరుకున్నాడు. అందరితోనే ఉంటూ.. అందరికంటే భిన్నంగా ఆలోచించాడు. ప్రపంచాన్ని శాసిస్తున్న ఫేస్‌బుక్‌ని రూపొందించింది తలపండిన ఓ మేథావి కాదు. ఒక టీనేజ్ కుర్రాడు. అతని పేరే జుకర్ బర్గ్. స్వ‌శ‌క్తి, సంప‌ద‌, స‌వాళ్లు, సహాయం.. వంటి అంశాల‌తో ఈ త‌రానికి, రాబోయే త‌రాల‌కు కూడా గెలుపుపాఠంగా నిలుస్తున్నాడు.
Related image

ఎదురుగా దూసుకొస్తున్న‌ స‌వాళ్లను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటూ తిరుగులేని సోష‌ల్ మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్య‌క్తి మార్క్ జుకర్ బర్గ్ చిన్న‌వ‌య‌సు నుంచే చురుకుగా ఉండేవాడు. చిన్న‌త‌నంలో జుకెర్ బర్గ్ కు  కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజస్ పై ఆస‌క్తి చూపడంతో జుకెర్ తండ్రి తనకు తెలిసిన ఒక అటారీ అనే ఒక  ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ను జుకెర్ కు నేర్పించాడు. దీనిని ఎంతో ఇష్టపడ్డ జుకెర్ వీలు దొరికినప్పుడల్లా తన సమయాన్ని మొత్తం దీనికే  కేటాయించేవాడు. ఆ తరువాత తన తండ్రి జుకెర్ ను దగ్గరలోఉన్న డేవిడ్ అనే ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ తో జుకెర్ కు ప్రైవేట్ గా ప్రోగ్రామింగ్ పై శిక్షణ ఇప్పించేవాడు కూడా. కానీ అతికొద్దీ కాలం ప్రోగ్రామింగ్ లో డేవిడ్ ను మించిపోయాడు జుకెర్. తన సమయం అంతప్రోగ్రాంల మీద దృష్టి నిలిపేవాడు జుకెర్. ఆ సమయంలో తాను జుక్నెట్ అనే ఒక సాఫ్ట్ వేర్ ను తయారు చేసాడు. ఇది ఇప్పటి మెసెంజర్ లాంటిది. జుక్నెట్ ను జుకెర్, తన తండ్రి పని చేసే క్లినిక్ నుండి ఇంటికి అలాగే ఇంటి నుండి క్లినిక్ కు సమాచారం పంపించడానికి ఉపయోగించేవారు.  అప్పటికి జుకెర్ వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే.

Related image

కొత్త కొత్త ప్రోగ్రాంలను క్రియేట్ చేస్తూ హై స్కూల్ చదువుతున్నప్పుడే SYNAPSE మీడియా ప్లేయర్ ను తయారు చేశాడు. ఆ వయసులో అందరు కంప్యూటర్ గేమ్స్ ఆడితే, జుకెర్ మాత్రం ఏకంగా కంప్యూటర్ గేమ్స్ ను తయారు చేసేవాడు. ఆ తరువాత జుకెర్ హార్వార్డ్ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. తాను యూనివర్సిటీ లో చదివే సమయం లో Face mash అనే ఒక వెబ్ సైట్ ను తయారుచేసాడు. ఆ సైట్‌లో యూనివర్సిటీ లోని అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి, ఎవరు అందంగా ఉన్నారో పోలింగ్ పెట్టేవాడు. చాలా తక్కువ సమయంలోనే ఈ సైట్‌కు భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. చివరికి యూనివర్సిటీలోని సర్వర్లు కూడా హ్యాంగ్ అయ్యేవి. అయితే ఈ వెబ్ సైట్ అమ్మయిల గ్లామ‌ర్‌కు సంబందించింది కావటంతో.. కొంతమంది అమ్మాయిలకు నచ్చక, వారు జుకెర్ మీద కంప్లైంట్ చేయడంతో జుకెర్ దానిని ఆపేశాడు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత జుకెర్ ఆలోచనలో పడ్డాడు. ఏదైనా కొత్తగా ఒకటి చేయాలనుకున్నాడు. అదే సమయంలో తనకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. యూనివర్సిటీ లోని విద్యార్థులందరూ తమ తమ అభిరుచులు, ఇష్టాలను, ఫోటోలను తమ స్నేహితులతో పంచుకునే విదంగా ఒక వెబ్ సైట్ ను తయారు చేయాలనుకున్నాడు. ఆలోచన వచ్చింది తడవుగా దాని కోసం పని చేయటం మొదలు పెట్టాడు. తాను ఊహించిన ఒక ఊహకు రూపు ఇవ్వాలని జుకెర్ ఎంతో కష్టపడ్డాడు. హాస్టల్ రూమ్ లో ఒంటరిగా ఒక్కడే కూర్చుని అహర్నిశలు శ్రమించాడు. ఆ విధంగా తాను తయారు చేసిన వెబ్ సైట్ కు THE FACE BOOK అని పేరు పెట్టాడు. తొలి రోజుల్లో కేవలం హార్వార్డ్ యూనివ‌ర్సీటికే పరిమితం అయినా, ఆ తరువాత వెబ్ సైట్ ను అమెరికాలోని ఇతర యూనివర్సిటిలకు కూడా అందుబాటులోకి తెచ్చేలా చేశాడు జుకెర్. ఈ వెబ్ సైట్ ను మరింత గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో హార్వార్డ్ యూనివ‌ర్సీటీలో చదువు మానేశాడు జుకెర్. ఆ తరువాత the face bookనుండి the ను తొలగించి face book కు 2004 ఫిబ్ర‌వ‌రి 4న‌ ఒక రూపం ఇచ్చాడు జుకర్. face book కు వస్తున్న స్పందన చూసి దానిని విద్యార్థులకే కాకుండా అందరికి న‌చ్చేలా డెవ‌ల‌ప్ చేశాడు. దీని వల్ల 2004 చివరినాటికి ఏకంగా 10 లక్షల యూజర్లను ఫేస్‌బుక్ కు సంపాదించి పెట్టాడు జుకెర్.

Image result for mark zuckerberg childhood

సోషల్ మీడియా రంగంలో తిరుగులేని క్రేజీ ఏర్పాటు చేసి చేసి ఫేస్‌బుక్‌ను ప్రారంభించి పది సంవత్సరాలు తిరిగేలోపల లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు. తన తోటి స్నేహితులు పార్టీలు చేసుకొంటుంటే తాను మాత్రం హాస్టల్ గదిలో ఒక్కడే ఫేస్‌బుక్ కోసం నిరంతరం శ్రమించాడు అయినా అందుకు ఏనాడూ బాధపడలేదు, ఫేస్ బుక్ ను అభివృద్ధి చేయటం కోసం హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో చదువు వదులుకోవడానికి ఏ మాత్రం ఆలోచించలేదు, తాను కన్న కలలకు ఒక రూపం ఇచ్చి.. తన ఆసాధారణ ప్రతిభతో ఈరోజు ప్రపంచ ప్రజలందరినీ ఒక తాటిపైకి తీసుకురాగలిగాడు. 
     Related image
యువ‌త‌కు సూచ‌న‌లు
ఇటీవ‌ల‌ ఐఐటీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వ్యాపారరంగంలోకి అడుగుపెట్టే యువతీయువకులకు పలు సూచనలు చేశాడు. ఒక లక్ష్యనిర్దేశం లేకుండా అనేకమంది వ్యాపారాలు ప్రారంభిస్తున్నారని.. కాని అది సరైనది కాదని.. గొప్ప గొప్ప సంస్థలన్నీ వాటిని స్థాపించిన అధినేతల ఇష్టంతోనే, బాధ్యతాయుతంగా వారు వ్యవహరించిన తీరుతోనే విజయవంతమయ్యాయని తెలిపారు. ఫేస్‌బుక్‌ని ప్రారంభించిన తొలినాళ్లలో తాము కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని..అయితే విజేతలుగా ఎదగాలనుకోనే వారు తప్పులు చేయడానికి వెనకాడకూడదని.. అవి పాఠాలు నేర్పుతాయని చెప్పాడు. ఫేస్‌బుక్ పేదవాళ్లకు, నిరుద్యోగులకు చేరినప్పుడే తన లక్ష్యం నెరవేరినట్లు భావిస్తానని జుకర్‌బర్గ్ తెలిపాడు. 

Related image

33సంవత్సరాలకే లక్షలకోట్లకు అధిపతి అయినా జుకర్ ఏనాడూ గర్వాన్ని ప్రదర్శించలేదు. ఇంట్లో ఆడపిల్ల పుడితే మరింతగా ఆస్తులు కూడబెట్టుకొనే  ఈ రోజుల్లో, ఆడపిల్ల పుట్టిందన్న సంతోషంతో ఉన్న ఆస్తులన్నీ నలుగురి బాగు కోసం దానం చేసిన మహనీయుడు జుకర్. తాను ఎదగటమే కాకుండా, ఎందరో నిర్భాగ్యుల, నిరాశ్రయుల జీవితాల్లో వెలుగు నింపాడు జుకర్. అందుకే ఈ శతాబ్దపు విజేతలలో ఒకడిగా నిలిచాడు జుకర్. ఎన్నో కోట్ల మందికి ఆదర్శంగా నిలిచాడు ఈ జీవన విజేత. చిన్న‌వ‌య‌సులోనే ఊహించ‌న‌న్ని విజ‌యాలు సాధించి త‌ర‌త‌రాల‌కు చెప్పుకునే గెలుపు పాఠం అత‌డు.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: