యోగా ఆరోగ్యప్రదాయిని. కానీ యోగా చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి...

1. ఎప్పుడూ కూడా కడుపు నిండుగా ఉన్నప్పుడు వ్యాయామం చెయ్యవద్దు.  అల్పాహారం తిన్న రెండు గంటల తరువాత, మధ్యాహ్న భోజనం తిన్న 4గంటల తరువాతో వ్యాయామం చేస్తే మంచిది.

 2. క్రమం తప్పవద్దు..  మీరు ఈ వ్యాయామాలని చేసేప్పుడు, మొదట్లో ఒక రకమైన ఇబ్బంది కలిగే అవకాశముంది, మీకు కళ్లు తిరిగినట్టనిపించవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యనివాళ్లలో ఇది సామాన్యంగా కనిపిస్తుంది. చెమట రూపంలో శరీరంలోని విషపదార్థాలు బైటికి రావటం వల్ల ఇలా జరుగుతుంది. అయినప్పటికీ, మీరు ఆసనాలు వెయ్యటం ప్రారంభించిన రెండు వారాల్లో మీ శరీరం వాటికి అలవాటు పడిపోతుంది.

 Image result for INDIAN YOGA TIPS




3. ఓపిక అవసరం..  ఒళ్లునొప్పులు కూడా రావచ్చు. ముఖ్యంగా మొదలుపెట్టిన కొత్తలో. ఎందుకంటే చాలాకాలంగా మీరు మీ శరీరాన్ని, అంటే కాళ్లు, చేతులు, నడుములాంటివి వంచి ఉండరు. దీన్ని కూడా మీరు పట్టించుకోనక్కర్లేదు. రెండు వారాల్లో ఆ వ్యాయామాలకి తగినట్టు మీ శరీరం సర్దుకుంటుంది.

 

4.  ఆసనాలన్నిటినీ అదే క్రమంలో చేస్తేనే, మీ శరీరానికి మీరు కోరుకున్న ఫలితాలు లభిస్తాయి. ఆసనాలు వేసేప్పుడు ఊపిరి ఎలా తీసుకోవాలో తెలుసుకోవటం చాలా ముఖ్యం.  మీ శరీరాన్ని వెనక్కి వంచే భంగిమలో ఊపిరి పీల్చాలి. వంచేప్పుడు ఊపిరి వదలాలి. ఒకే భంగిమలో స్థిరంగా ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవా లి.

Related image




5.  విరామం పాటించండి.. ఒక భంగిమలోకి మారేప్పుడు దానివల్ల ప్రభావితమయ్యే కండరం లేదా శరీరభాగం మీద దృష్టి కేంద్రీకరించండి. ఒక్కో ఆసనానికి మధ్య కనీసం 10 సెకన్ల విరామం ఉండాలి ్య వ్యాయామానికి ముందూ, తరువాతా కొద్ది నిమిషాల పాటైనా శరీరాన్ని వంచండి. ్య ఆసనాలు వేసేప్పుడు శరీరాన్ని మరీ ఎక్కువగా వంచద్దు. అలవోకగా ఆసనాలతో ఆరోగ్యం సంపాదించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: