ఒక ఐడియా కోట్లాది మంది జ‌న జీవ‌నాన్ని ప్ర‌భావితం చేస్తుంది. కొత్త ప్ర‌పంచాన్ని చూపిస్తుంది. బాధ‌తో కుమిలిపోకుండా స‌రైన‌ ఆలోచ‌న‌ను అమ‌లులో పెట్టేస్తే అద్భుతాలు సృష్టించొచ్చు.. అంటూ కుర్రాడు చేసిన ప‌నికి ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు సెల్యూట్ చేస్తున్నారు. వాట్సాప్ అంటూ ప్ర‌తిక్ష‌ణం ఎంజాయ్ చేస్తున్నారు. ప్ర‌పంచాన్ని గెలిచిన ఆ స‌క్సెస్ వెనుక ఎంతో కృషి ఉంది. ఉద్యోగం ఇవ్వ‌ని కంపెనీకే తను కనుగొన్న ప్రొడ‌క్ట్‌ను బిలియ‌న్ డాల‌ర్ల‌కు అమ్మేసి రియ‌ల్ హీరోల నిల‌బ‌డ్డాడు వాట్సాప్ వ్యవస్థాపకుడు జాన్ కూమ్.

Image result for jan koum whatsapp owner

1976లో జన్మించిన జాన్ కూమ్.. ఉక్రెయిన్ దేశంలోని ఒక చిన్న గ్రామం. అతని తండ్రి కన్‌స్ట్రక్షన్ కంపెనీలో మేనేజర్‌గా పని చేసేవాడు. తల్లి గృహిణి. ఉక్రెయిన్‌లో ఉన్న రాజకీయ పరిస్ధితులు రాజకీయ అస్థిరత, నిత్య ఘ‌ర్ష‌ణ‌ల నేపధ్యంలో జాన్ కూమ్ కుటుంబం అమెరికాకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. 1992లో 16వ ఏట జాన్ కూమ్ కుటుంబ స‌భ్యులు కాలిఫోర్నియాకు వలస వచ్చారు. కాలిఫోర్నియాలోని మౌంటెన్‌వ్యూ పట్టణంలో ప్రభుత్వం సహకారంతో పొందిన ఒక చిన్న డబుల్ బెడ్‌ రూం అపార్టుమెంటులో ఉండేవారు. ఇల్లు గడవడానికి అతని తల్లి బేబీ సిట్టర్‌గా  పని చేసేది. జాన్ కూమ్ కూడా ఒక కిరాణా స్టోర్‌లో పనిచేసేవాడు. 18 ఏళ్ళ వయస్సులో హై స్కూల్లో ఉన్నప్పుడు పుస్తకాలు చదివి కంప్యూటర్ నెట్‌వర్కింగ్ నేర్చుకున్నాడు. వూవూ అనే హ్యాకర్స్ గ్రూపులో చేరాడు. హైస్కూల్ తర్వాత “సాన్ హోసే స్టేట్ యూనివర్సిటీ”లో జాయినయ్యాడు. అక్కడ చదువుతున్నప్పుడే ఒక కంపెనీలో సెక్యురిటీ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాడు. 1997లో యాహూలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్‌గా జాయినయ్యాడు. 2000లో తల్లి, 1997లో తండ్రి మరణించారు. ఒంటరితనంలో ఉన్న జాన్‌కు ఆక్టన్ అండగా నిలిచాడు. 2007 వరకు ఇద్దరూ యాహూలో కొనసాగారు. తర్వాత ఇద్దరూ ఒక ఏడాది పాటు జాబ్ నుంచి బ్రేక్ తీసుకుని సౌత్ అమెరికా టూర్‌కు వెళ్ళారు.

Related image

అమెరికాకు తిరిగి వచ్చిన తర్వాత 2008లో ఫేస్‌బుక్ కంపెనీలో జాబ్‌కి అప్లై చేసుకున్నారు. కానీ ఇద్దరూ రిజెక్ట్ అయ్యారు. ఫేస్‌బుక్‌లో ఉద్యోగం రాలేదు. మెల్లగా పొదుపు చేసుకున్న డబ్బు క‌రిగిపోయే ప‌రిస్థితి. జనవరి 2009లో జాన్ కూమ్ ఐఫోన్ కొన్నాడు. కొత్త ఐఫోన్‌లోని యాప్ స్టోర్‌ను చూసి తను కూడా ఏదైనా యాప్ డెవలప్ చెయ్యాలి అనుకున్నాడు. వెంటనే తన రష్యన్ ఫ్రెండ్ అలెక్స్ ఫిష్‌మన్ దగ్గరకు తన ఆలోచనను వివరించడానికి వెళ్ళాడు. అప్పుడే వాట్సాప్ అనే పేరును ఖరారు చేశారు. 24 ఫిబ్రవరి 2009లో కంపెనీ రిజిస్టర్ చేశారు. కోడింగ్‌లో తనకు సహాయం చెయ్యడానికి ఇంకొక ప్రోగ్రామర్‌ను నియమించుకున్నాడు. వాట్సాప్ మొదటి వర్షన్ సరిగ్గా పనిచేయలేదు. కేవలం తన స్నేహితులు మాత్రమే ఇన్‌స్టాల్ చెసుకున్న ఈ వర్షన్ తరచు ఆగిపోయి, క్రాష్ అయ్యేది. మొదట వాటిని ఎలా సరి చెయ్యాలో తెలియలేదు. ఒకసారి ఆక్టన్‌తో నిరుత్సాహంగా ఇది వదిలేసి జాబ్ వెతుక్కుంటా అని అన్నాడు.
2009 జూన్  నెల‌లో ఆపిల్ “పుష్ నోటిఫికేషన్” ఫీచర్ విడుదల చేయడంతో జాన్ కూమ్ కి కొత్త లైఫ్‌లైన్ దొరికినట్టయింది. పుష్ నోటిఫికేషన్ అంటే ఎదుటి వ్యక్తి ఫోన్‌లో యాప్ మూసి ఉన్నా కూడా మెసేజ్‌లు పంపియ్యగలగడం. దీనిని ఉపయోగించుకుని రెండవ వర్షన్‌ను తయారు చేసారు. అప్పటికి మార్కెట్‌లో ఫోన్ నంబరుతో పనిచేసే ఇంకో మెసెంజర్ లేదు. దాంతో అతి తక్కువ సమయంలో యూజర్స్ మూడు లక్షలకుపైగా పెరిగారు. ఇది తొలి విజ‌యం, జాన్ కూమ్‌లో తిరుగులేని ఆత్మవిశ్వాసం నింపింది. ఇంకా వెన‌క్కి తిరిగిచూసుకోలేదు.

Image result for jan koum whatsapp FACEBOOK

అప్పటికి అందుబాటులో ఉన్న రెగ్యులర్ ఎస్సెమ్మెస్, ఎమ్మెమ్మెస్‌ల కన్నా మంచి ఫీచర్‌లతో వాట్సాప్‌ను డెవలప్ చేయాలనుకున్నాడు. కానీ దానికి పెట్టుబ‌డి కావాలి. తన యాహూ ఫ్రెండ్ ఆక్టన్ 2.5 లక్షల డాలర్లు సమకూర్చాడు. దాంతో అతనికి కో-ఫౌండర్ స్టాయిని ఇచ్చాడు. 2011 మొదటి కల్లా వాట్సాప్ అమెరికాలో టాప్ 20 యాప్స్‌లో ఒకటిగా నిలిచింది. కానీ అప్పటికీ ఇంకా స్టాఫ్ జీతాలకి ఇతర ఖర్చులకి ఇన్వెస్ట్‌మెంట్ అవసరమయ్యింది. సీక్వోవియా కాపిటల్ అనే వెంచర్ క్యాపిటల్ కంపెనీ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఫిబ్రవరి 2013 కల్లా వాట్సాప్ యూజర్ల సంఖ్య 20 కోట్లకు చేరింది. ఏడాది తర్వాత ఫిబ్రవరి 2014లో ఫేస్‌బుక్ ఓనర్ మార్క్ జుకర్‌బర్గ్ వాట్సాప్ కంపెనీని కొనడానికి 19 బిలియన్ డాలర్ల ఆఫర్‌తో జాన్ కూమ్‌ను కలిశాడు. 10 రోజుల తర్వాత ఫేస్‌బుక్ వాట్సాప్‌ను కొన్నట్టు ప్రకటించింది.
ఆలోచ‌న‌, ఆత్మ‌విశ్వాసం క‌లిస్తే.. అద్భుతాలు సృష్టించొచ్చు. ప్ర‌పంచ జీవ‌నాన్నే ప్ర‌భావితం చేయ‌బ‌చ్చ‌ని నిరూపించిన విజ‌యం ఈ త‌రం యువ‌త‌కు గొప్ప స్ఫూర్తినిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: