Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 3:09 am IST

Menu &Sections

Search

స‌క్సెస్‌స్టోరీ: ఆ చెత్తకుండీలో చిన్నారి.. నేడు గ‌ర్వించే స్థాయిలో..

స‌క్సెస్‌స్టోరీ: ఆ చెత్తకుండీలో చిన్నారి.. నేడు గ‌ర్వించే స్థాయిలో..
స‌క్సెస్‌స్టోరీ: ఆ చెత్తకుండీలో చిన్నారి.. నేడు గ‌ర్వించే స్థాయిలో..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒక మాన‌వ‌త్వం, ఒక విజ‌యం క‌ల‌గ‌లిసిన‌ నిజ జీవిత క‌థ ఇదీ. ఏ తల్లి కన్న బిడ్డో.. చెత్తకుప్ప పాలైంది.. ఓ నాన్న కాని నాన్న కంట పడింది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ పసికందు ఆ చెత్త కుప్ప‌లో చూసి ఆవేద‌న ప‌డి, వెంట‌నే అక్కున చేర్చుకున్నాడు. అన్నీ తానై పెంచి పోషించాడు. చివ‌రికి ఆ మంచి త‌నానికి పెద్ద బ‌హుమ‌తియే ఇచ్చింది ఆ కూతురు. స‌మాజం సెల్యూట్ చేసే స్థాయికి ఎదిగింది. 

jyothy-sobaran-జ్యోతి-సోబ‌ర‌న్-success-story

అసోంలోని తీన్ సుఖియా జిల్లాకు చెందిన సోబరన్‌‌ బండిమీద కురగాయలు పెట్టుకుని వీధివీధి తిరుగుతూ అమ్ముతుండేవాడు. అదే ఆధారంగా బతుకుతున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ పెద్దవారు కావడం వారిని చూసుకునే బాధ్యత తనపై పడడంతో పెళ్లి చేసుకోవాలని కూడా ఆలోచించలేకపోయాడు. రోజులానే ఓ రోజు కూరగాయలు అమ్మి చీకటి పడిన తరువాత ఇంటికి వస్తున్నాడు. ఇంతలో ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఓ పసికందు చెత్తకుప్పలో ఏడుస్తూ కనిపించింది. పరుగున వెళ్లి చుట్టూ చూశాడు. పాప తాలూకూ ఎవరూ కనిపించలేదు. ఏ జన్మ బంధమో నాకోసమే పుట్టిందేమో అనుకుని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నాడు. అమ్మానాన్నా అన్నీ తానై పెంచి పెద్ద చేశాడు. 25 ఏళ్లు వచ్చిన ఆ అమ్మాయి.. నాన్నా నీ కష్టం ఊరికే పోలేదు.. అసిస్టెంట్ కమిషనర్ అయ్యానంటూ తనకి ఉద్యోగం వచ్చిన ఆర్డర్స్ తండ్రి సోబరన్ చేతిలో పెట్టింది. చిన్నారి రాకతో తన జీవితం మారిపోయింది.
 jyothy-sobaran-జ్యోతి-సోబ‌ర‌న్-success-story
తన జీవితంలో వెలుగులు పంచిన ఆ చిన్నారికి జ్యోతి అని పేరు పెట్టాడు. రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కోసం తండ్రి పడే తపన, కష్టం అంతా జ్యోతి కోసం పడ్డాడు సోబరన్. మంచి స్కూల్లో జాయిన్ చేశాడు. బాగా చదవాలంటూ ప్రోత్సహించాడు. జ్యోతి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఓ తండ్రిగా అందమైన కలలు కన్నాడు. కష్టం తెలియకుండా, కన్నీళ్లు రానివ్వకుండా జ్యోతిని పెంచి పెద్ద చేశాడు. ఫలితంగా జ్యోతి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పట్టా తీసుకుంది. అసోం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్‌లో పాస్ అయింది. ఇంటర్వూలో కూడా విజయం సాధించి ఇన్ కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందుకుంది. బిడ్డ విజయాన్ని చూసిన తండ్రి సోబరన్ కళ్లలో ఆనంద భాష్పాలు చూసి జ్యోతి తల్లడిల్లిపోయింది. కన్నీళ్లతో తండ్రి పాదాలు తడిపేసింది. వీధిపాలు కావలసిన జీవితాన్ని విద్యావంతురాలిని చేసి ప్రపంచం ముందు విజేతగా నిలబెట్టిన తండ్రికి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంది.
 
మాన‌వ‌త్వం ప‌రిమళించిన విజ‌య‌గాథ ఇది. ఇంత‌క‌న్నా మ‌నిషికి ఏం కావాలి.. అంటూ ప్ర‌తి ఒక్క‌రిని ఆలోచింప‌జేస్తున్న స‌క్సెస్ స్టోరీ ఇది. 


jyothy-sobaran-జ్యోతి-సోబ‌ర‌న్-success-story
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.