ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవి శరీరంలో అత్యంత కీలకమైన మరియు ముఖ్యమైన అవయవం బ్రెయిన్. ఎందుకంటే బ్రెయిన్ అనేది శరీరంలో ప్రతి ఒక్క అణువునీ కంట్రోల్ చేస్తుంది. మన ప్రతి ఒక్క ఆలోచన, కదలిక బ్రెయిన్ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే దాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం. ఇప్పుడు చెప్పబోయే 7 అలవాట్లు మన బ్రెయిన్ కి ఎంతో హాని కలిగిస్తున్నాయి. వెంటనే ఈ అలవాట్లను సరిచేసుకుంటే చాలా మంచిది.


1. రోజు రాత్రి 8 నుంచి 9 గంటల దాకా మన శరీరం రెస్ట్ తీసుకుంటుంది. కాబట్టి పొద్దున్న లేవగానే అన్నిటికన్నా ముందు మన బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. కాబట్టి మన బ్రెయిన్ కి హాని కలగకుండా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయకూడదు.


2. ఒకప్పుడు స్కూల్, కాలేజీ లేదా ఆఫీస్ నుంచి తిరిగి రాగానే.. కాసేపు చదువుకుని లేదా టీవీ చూసి త్వరగా నిద్రించేవారు. కాని ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోవడంతో.. బెడ్ మీద వాలిపోయి అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత పడుకుంటున్నారు. ఈ అలవాటు బ్రెయిన్ కి చాలా హాని కలిగిస్తుంది. రాత్రి 10 లోపు నిద్రించిన తర్వాత… కనీసం 8 గంటల మంచి నిద్ర ఉండాలి. అప్పుడే బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది.
Image result for cel phone dange
3. వీలైనంతవరకు షుగర్ వాడకం  తగ్గించండి . స్వీట్స్ తక్కువగా తినండి. ఎక్కువ శాతం షుగర్ తింటే మన బ్రెయిన్ కి హాని కలుగుతుంది. షుగర్ వల్ల కేవలం బ్రెయిన్ మాత్రమే కాదు ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి.

4. మన శరీరం అనేది రాత్రి పూట రెస్ట్ తీసుకోడానికి.. పగటి పూట కష్టపడడానికి తగ్గట్టుగా సృష్టించబడింది. కాబట్టి పగటి పూట ఎక్కువ సేపు నిద్రించకూడదు. శ్రుష్టికి విరుద్దంగా పగటి పూట ఎక్కువ సేపు నిద్రిస్తే అది మన బ్రెయిన్ కి హాని కలిగిస్తుంది.

5. మన బ్రెయిన్ కి సరైన పోషణ అందాలంటే భోజనం కరెక్ట్ పద్ధతిలో చేయాలి. టీవీ చూస్తూ, కంప్యూటర్ ముందు కుర్చుని, స్మార్ట్ ఫోన్ లో కాలక్షేపం చేస్తూ భోజనం తినకూడదు.

6. మనం పీల్చుకునే ఆక్సిజన్ ఎక్కువ శాతం బ్రెయిన్ కే చేరుతుంది. కాబట్టి మీ బెడ్ రూమ్ ని శుభ్రంగా ఉంచుకోవాలి. మన బ్రెయిన్ కి ఎంత ఫ్రెష్ ఎయిర్ అందిస్తే అంత యాక్టివ్ గా ఉంటుంది.
Image result for cel phone dange
7. చాలా మంది రాత్రి పడుకునేటప్పుడు నిండా దుప్పటి కప్పుకొని పాడుకుంటారు. అలా చేస్తే మన బ్రెయిన్ కి బయటనుంచి ఫ్రెష్ ఎయిర్ తగలదు. దీనితో పాటు రాత్రి పడుకునేటప్పుడు తలకి క్యాప్, స్కార్ఫ్ లాంటివి ధరించకూడదు. కాళ్ళకి సాక్స్ కూడా వేసుకోకూడదు..

8. యూరిన్ ని బిగపట్టుకుని ఉండడంవల్ల కూడా మన బ్రెయిన్ కి హాని కలుగుతుంది. యూరిన్ బిగపట్టుకుంటే అది మన నెర్వస్ సిస్టం పై ప్రభావం చూపిస్తుంది. వెంటనే ఈ అలవాటుని మానుకోండి.
 
బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు ..
క్యాన్సర్ పేరు వింటేనే భయపడుతుంటాం.అందులో మెదడుకు క్యాన్సర్ వచ్చిందంటే ఇక ఆందోళన చెప్పనలవి కాదు.డాక్టర్లు కూడా బ్రెయిన్ క్యాన్సర్కి సర్జరీ చేయడమే మొట్టమొదటి మార్గంగా ఎంచుకుంటారు. ఆరోగ్యకరమైన కణజాలం ప్రభావితం అయ్యే అవకాశాలుండడమే ఇందుకు కారణం.
మెదడులో మాలిగ్నెంట్ ట్యూమర్ ఏర్పడటాన్ని బ్రెయిన్ క్యాన్సర్ అంటారు. మెదడులో ప్రారంభమై లేదా శరీర వివిధా భాగాలలో ప్రారంభమై, మెదడుకు వ్యాపిస్తుంది. అన్ని రకాల క్యాన్సర్'లు మాలిగ్నెంట్'కి చెందినవి కాదు, క్యాన్సర్'లలో చాలా రకాలు ఉన్నాయి.

Image result for cel phone dange

మన శరీరంలో నిరంతరం పాత కణాలు చనిపోతూ కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో అవసరం లేకపోయినా కొత్త కణాలు పుడుతుంటాయి. అదేవిధంగా చనిపోవాల్సిన కణాలు అలాగే ఉండిపోతాయి. దీనివల్ల కావలసినదాని కన్నా అదనంగా కణాలు పెరుగుతాయి. ఇదే ట్యూమర్ లేదా కణితి ఏర్పడడానికి దారితీస్తుంది. ఈ ట్యూమర్లు బినైన్, మాలిగ్నెంట్ అని రెండు రకాలు. బినైన్ ట్యూమర్లలో క్యాన్సర్ కణాలు ఉండవు. కాబట్టి మెదడులో ఏర్పడే బినైన్ ట్యూమర్లు వాపును, అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కానీ క్యాన్సర్ కణాలతో కూడిన ఈ మాలిగ్నెంట్ ట్యూమర్లు మాత్రం ప్రమాదకరమైనవి. ఆరోగ్యంగా ఉన్న మెదడు కణాలపై దాడిచేసి ప్రాణాపాయం కలిగిస్తాయి.


బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కనిపెట్టే లక్షణాలు..!
క్యాన్సర్ సోకిన కణాలు వాటి చుట్టూ ఉండే కణాలకి సోకి, వాటిని కూడా క్యాన్సర్ వ్యాధికి భారినపడేలా చేస్తాయి. కానీ బ్రెయిన్ క్యాన్సర్'ని కలుగచేసే కారకాలు ఇంతవరకు కనుగొనబడలేదు, మీ జీవన శైలిలో మార్పులు మరియు కొన్ని రకాల ప్రమాదకర కారకాలకి దూరంగా ఉండటం వలన బ్రెయిన్ క్యాన్సర్'కి దూరంగా ఉండవచ్చు. వీటకంటే ముందు బ్రెయిన్ క్యాన్సర్ గురించి కొన్ని వాస్తవాలను తెలుకోవడం మంచిది. బ్రెయిన్ క్యాన్సర్ కు సబంధించిన వాస్తవాలను, లక్షణాలను మరియు ట్యూమర్ మరియు మరికొన్ని బ్రెయిన్ క్యాన్సర్ కు సంబంధించిన కొన్ని విషయాలను ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది.చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే... సాధారణంగా బ్రెయిన్ క్యాన్సర్ టిష్యులు బ్రెయిన్ లో ఏర్పడటం వల్ల వస్తుంది. దీన్ని బ్రెయిన్ ట్యూమర్స్ గా పిలుస్తాము .

ఈ ట్యూమర్స్ మెదడు పనితీరు మీద ప్రభావం చూపుతుంది . వీటితో పాటు కొన్ని వాస్తవాలను ఈ క్రింది స్లైడ్ ద్వారా:
మొదట బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు తెలుసుకోవాలి. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడే వారిలో తలనొప్పులు, వికారంగా ఉండటం, చూపు మందగించడం, మాటలు తడబడటం, జ్ఞాపకశక్తి సమస్యలు, స్థాయీభావాల్లో తేడాలు రావడం, కాళ్లూచేతుల్లో తిమ్మిర్లు రావడం లాంటి లక్షణాలు కనబడుతాయి.
ఇది అంత్యంత సాధారణమైన బ్రెయిన్ క్యాన్సర్. దీన్నే సెంకడరీ బ్రెయిన్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు.రెండవ అంత్యంత సాధారణ బ్రెయిన్ క్యాన్సర్ గ్లియోబ్లాస్టోమా. ఇది చాలా సహజమైనట ప్రైమరీ బ్రెయిన్ క్యాన్సర్ . ఇది అత్యంత ప్రమాధకరమైనది మరియు దీనికి వెంటనే చికిత్స అవసరం అవుతుంది.


అవయవాలు దానం చేసే వారిలో బ్రెయిన్ క్యాన్సర్ ఉన్నట్లైతే అది రెండవ వ్యక్తి(అవయవగ్రహీత)లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సెకండరీ బ్రెయిన్ క్యాన్సర్ గా చెబుతారు.బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడే వారిలో తరచూ తలనొప్పి వేధిస్తుంటుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే వెంటనే డాక్టర్ ను సంప్రధించాలి. ముఖ్యంగా ఉదయంపూట వచ్చే తలనొప్పి అత్యంత ప్రమాధకరమైనదిగా గుర్తించాలి.


రేడియేషన్ వల్ల కూడా బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సెల్ ఫోన్ రేడియేషన్.
బ్రెయిన్ క్యాన్సర్ కుంటుంబంలో ఎవరికైనా ఉన్నట్లైతే, కుంటుంబ సభ్యులకు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం మంచిది.
బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలో కొత్త మందు........!
బ్రెయిన్ ట్యూమర్…ఈ పేరు వింటేనే ఒకప్పుడు ఒణుకు పుట్టేది. అయితే ఇప్పుడున్న లేటెస్ట్ మెడికల్ టెక్నాలజిలో ఈ న్యూరో డిసీజ్ కి చాలా వరకు ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా న్యూయార్క్ రీసెర్చర్స్ దీనికి సంబంధించి ఒక కొత్త మెడిసిన్ ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. పీపీఎఫ్ అని పిలవబడే ఈ డ్రగ్ బ్రెయిన్ ట్యూమర్ ని తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుందంటున్నారు మెడికల్ ఎక్స్పర్ట్స్. మెదడులోని క్యాన్సర్ కు గురైన  గ్లియోబ్లాస్టోమా కణాలలోని ప్రొటీన్ లను నాశనంచేయడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్ ల చికిత్సలో వాడే కీమోథెరపీతో పాటు రేడియోథెరపి విధానాలకు ఈ మెడిసిన్ పనిచేస్తుంది. అంతేకాదు క్యాన్సర్ కణాలను నిస్సహాయంగా మార్చడంలో పీపీఎఫ్  డ్రగ్  విజయవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నంటున్నురు డాక్టర్లు . జనరల్ గా ట్యూమర్ డ్రగ్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ కామన్. అయితే క్లినికల్ ట్రయల్స్ లో సైడ్ ఎఫెక్ట్ కూడా తక్కవేనని  ఈ డ్రగ్ ప్రూవ్ అయిందంటున్నారు 


మరింత సమాచారం తెలుసుకోండి: