Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 6:14 pm IST

Menu &Sections

Search

స‌క్సెస్ స్టోరీ: స‌మ‌స్య‌ల‌కే స‌వాల్ విసిరి, విజ‌య‌శిఖ‌రం ఎక్కాడు!

స‌క్సెస్ స్టోరీ: స‌మ‌స్య‌ల‌కే స‌వాల్ విసిరి, విజ‌య‌శిఖ‌రం ఎక్కాడు!
స‌క్సెస్ స్టోరీ: స‌మ‌స్య‌ల‌కే స‌వాల్ విసిరి, విజ‌య‌శిఖ‌రం ఎక్కాడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జీవితం అనుకున్న‌ట్టు సాగ‌దు. ఊహించ‌ని ఎదురుదెబ్బ‌లు ఎన్నో తాకుతాయి. ఇక ఆత్మ‌హ‌త్య మార్గ‌మ‌ని వెళ్లిన ఆ వ్య‌క్తికి జీవితం అంటే ఏంటో తెలిసింది. ఎదురుదెబ్బలు ఎన్నితాకుతున్నా త‌న అంతిమ ల‌క్ష్యం వైపు దూసుకుపోయాడు. ఫైవ్ స్టార్ హోట‌ల్ రంగంలో తిరుగులేని శ‌క్తిగా మారాడు. హోటళ్ల రంగంలో ‘కామత్‌’ అన్న పేరుని బ్రాండ్‌గా మార్చిన వ్యాపారవేత్త విఠల్ వెంక‌టేష్ స‌క్సెస్ స్టోరీ ఇది. 

kamath-venkatesh-vithal-విఠల్-వెంకటేష్-కామత్-కామత్

మ‌హారాష్ట్ర‌లోని మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన విఠ‌ల్ వెంక‌టేష్ ఇంజ‌నీరింగ్ చ‌దివాడు. ఒక స‌మ‌యంలో అనుకోకుండా తండ్రి నడుపుతున్న హోటల్‌లో పనిచేయాల్సివచ్చింది. ఎంతో పరిశుభ్రంగా ఉండడమే కాక వేగంగా సప్లై చేయడంతో ఆ హోటల్‌కి మంచి పేరొచ్చింది. ఆ పేరును ఉపయోగించుకుని వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకున్నాడు విఠల్‌. చక్కని ప్రణాళిక సిద్ధంచేసుకుని కామత్‌ హోటళ్ల చెయిన్‌కి శ్రీకారం చుట్టాడు. రోజుకు 20 గంటలు పనిచేస్తూ నెలకో కొత్త రెస్టరెంట్‌ చొప్పున 50 చోట్ల రెస్టరెంట్లను ప్రారంభించాడు.

kamath-venkatesh-vithal-విఠల్-వెంకటేష్-కామత్-కామత్

ఇంత వేగంగా ఎలా దూసుకుపోతున్నాడు అంటూ.. అంతా ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టి చూస్తున్నవారికి అర్థం అవడానికి కొన్నాళ్లు పట్టింది. ఆ రోజుల్లో పలు నగరాల్లో ఒకటీ రెండు పెద్ద హోటళ్లు మినహాయిస్తే మిగిలినవన్నీ చిన్న ఇరానీ చాయ్‌ దుకాణాలే. అవి వరసగా మూతబడుతున్న విషయాన్ని గుర్తించిన విఠల్‌ పరిస్థితిని తనకు అనువుగా మార్చుకున్నాడు. కామత్‌ హోటళ్ల విస్తరణ అయిపోయింది. 
చిన్న హోటళ్లున్నాయి, ఐదు నక్షత్రాల పెద్ద హోటళ్లున్నాయి. మధ్యలో ఏమీ లేవు. ముంబయి ఎయిర్‌పోర్ట్‌ దగ్గర అమ్మకానికున్న నాలుగు నక్షత్రాల హోటల్‌ని కొని కామత్‌ ప్లాజాగా మార్చి ఆ ఖాళీనీ తనే భర్తీచేశాడు. తర్వాత దాని స్థానంలో ఆసియాలోనే తొలి ఫైవ్‌స్టార్‌ ఎకోటెల్‌ని కట్టాలనుకున్నాడు విఠల్‌. ‘ఎకో ఫ్రెండ్లీ హోటలా... విఠల్‌కి విజయం తాలూకు పొగరు బాగా తలకెక్కింది’ అనుకున్నారు జనాలు. విఠల్‌ పట్టించుకోలేదు. 100 కోట్లు అప్పు చేశాడు. అయితే ఇక్క‌డే అత‌నికి ఊహించని ఎదురుదెబ్బ త‌గిలింది. పునాదుల్లో రాళ్లు కుద‌ర‌క‌పోవ‌డంతో కామత్‌ ప్లాజా కూలిపోయింది. సోదరులు ఆస్తులు పంచుకుని విడిపోయారు. దాంతో అప్పూ ఆర్కిడ్‌ ప్లానూ మాత్రం విఠల్‌కి మిగిలాయి. అదే స‌మ‌యంలో ఆరోగ్య సమ‌స్య‌లు కూడా ఎదురొచ్చాయి. త‌న‌ తండ్రికి క్యాన్సర్‌. 

kamath-venkatesh-vithal-విఠల్-వెంకటేష్-కామత్-కామత్

ఆత్మహత్య మార్గం అనుకున్నాడు. త‌న‌ స్నేహితుడి ఆఫీసు 26వ అంతస్తుకి చేరుకున్నాడు. అతణ్ణి బయటకి పంపి, కిటికీలోంచి బయటకు దూకబోతుండగా ఓ సంఘటన అత‌న్ని మార్చేసింది. 23వ అంత‌స్తు బ‌య‌ట‌వైపు ఒక వ్య‌క్తి రంగులు వేస్తూ క‌నిపించాడు. పై నుంచి వెదురుబొంగుల‌తో క‌ట్టిన ఫ్లాట్‌ఫాంపై అత‌ను నిలుచుని త‌న ప‌నిపై నిమ‌గ్న‌మ‌య్యాడు. అత‌ను క‌దిలిన‌ప్పుడల్లా ఆ వెదురు బొంగుల ఫ్లాట్‌ఫాం ఊగుతోంది. మ‌ర‌ణం అంచున నిల‌బ‌డి నిల‌క‌డ‌గా దీక్ష‌గా అత‌ను చేస్తున్న ప‌ని విఠ‌ల్‌కు గొప్ప పాఠంలా అనిపించింది. అంత ప్ర‌మాద‌క‌ర‌మైన రిస్క్ తీసుకుని అత‌ను ఎందుకు ప‌ని చేస్తున్నాడు. జ‌స్ట్ కూలీ కోసం. త‌న ఫ్యామిలీని పోషించ‌డానికి అత‌ను ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితిని కూడా లెక్క చేయ‌కుండా చేస్తుంటే విఠ‌ల్‌కు జీవిత పాఠం ఏదో చెబుతున్న‌ట్టు అనిపించింది. అప్పుడే వెన‌క్కి తిరిగివ‌చ్చాడు 
సీన్ కట్ చేస్తే.. విఠ‌ల్ ప‌ని అయిపోయిందనే అనుకున్నారు అంతా. ఆ స్థలాన్ని అమ్మేసి అప్పులు తీర్చి ఉద్యోగం చేసుకోమని సలహాలిచ్చారు. కానీ విఠల్ విధితో పోరాటం చేయాల‌నే కసి పెంచుకున్నాడు. చివ‌రికి అత‌డి పట్టుదల ముందు సమస్యలే తలవంచాయి. ఒకప్పుడు ఆయన హోటళ్లలో కస్టమర్లుగా సేవలందుకున్నవారు బ్యాంకుల్లో పెద్ద హోదాల్లో ఉన్నారు. విఠల్‌ మీద నమ్మకంతో వారు చేతనైన సాయం చేసి ఆదుకున్నారు. దాంతో మళ్లీ శక్తులన్నీ కూడదీసుకుని ఆర్కిడ్‌ని పూర్తి చేశాడు విఠల్‌. ఇప్పుడు ప్రపంచంలోని బెస్ట్‌ హోటల్స్‌లో ఆర్కిడ్‌ ఒకటి. అదే కాకుండా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో హెరిటేజ్‌, ప్యాలస్‌ హోటళ్లు; రిసార్టులు, లగ్జరీ బిజినెస్‌ హోటళ్లూ కట్టడంతోపాటు తన జయాపజయాల గురించి ఆత్మకథ కూడా రాసుకున్నాడు. 
మ‌న ప‌నిలో స్మార్ట్ ఐడియాలు ఉండాలంటాడు విఠ‌ల్. ఇడ్లీ ఒక ప్లేట్లో, చట్నీలు మరొక ప్లేట్లో, సాంబార్ సెపరేట్‌గా గిన్నెలో సర్వ్ చేసేవాళ్ళం. మూడూ ఒకే దానిలోఇచ్చేలా 'దొప్ప'లున్న "కామత్" ప్లేట్లు తయారు చేయించాను. దానితో అంట్లు తొమే వారి ఖర్చు నెలకి పాతికవేలు తగ్గింది. ఇప్పుడు దాదాపు అన్ని హోట‌ల్స్ కామ‌త్ ప్లేట్లు వాడుతున్నాయి.. అంటూ త‌న ఐడియా రేంజ్ ఎంత‌లా వ‌ర్క‌వుట్ అయిందో చెబుతాడు.

kamath-venkatesh-vithal-విఠల్-వెంకటేష్-కామత్-కామత్

స్టార్టప్ లో అవ‌కాశాలను అందిపుచ్చుకోవాలనుకునేవారికి విఠ‌ల్ త‌న అనుస‌రించే ఫార్ములా చెబుతాడు. మ్యాప్‌, గ్యాప్‌, ట్యాప్‌. మార్కెట్‌ని పరిశీలించాలి. అక్కడ ఉన్నదేంటో, వినియోగదారుడు కోరుకుంటున్నదేమిటో తెలుసుకోవాలి. ఆ రెంటి మధ్య ఉన్న ఖాళీనే మనకు లభించే అవకాశం. దాన్ని ఉపయోగించుకునేందుకు ఫర్‌ఫెక్ట్ ప్లాన్ రెడీ చేసుకుని నమ్మకమైన సిబ్బందిని తయారుచేసుకుంటే డబ్బు వెతుక్కుంటూ వస్తుంది. పట్టుదల, అంకితభావం, క్రమశిక్షణ- ఈ మూడింటికీ ప్లానింగ్‌ తోడైతే విజయం మన వెంటే ఉంటుందని ఆత్మ‌విశ్వాసంతో చెబుతాడు విఠల్‌.


kamath-venkatesh-vithal-విఠల్-వెంకటేష్-కామత్-కామత్
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.