Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 27, 2019 | Last Updated 12:32 pm IST

Menu &Sections

Search

స‌క్సెస్ స్టోరీ: 5 రూపాయ‌ల కూలీ నుంచి మిలియన్ డాలర్ల కంపెనీ అధినేతగా..

స‌క్సెస్ స్టోరీ: 5 రూపాయ‌ల కూలీ నుంచి మిలియన్ డాలర్ల కంపెనీ అధినేతగా..
స‌క్సెస్ స్టోరీ: 5 రూపాయ‌ల కూలీ నుంచి మిలియన్ డాలర్ల కంపెనీ అధినేతగా..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పొలంలో పనిచేస్తూ విమానం చూసి, జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కగలనా అనుకుంది ఆమె. జీవితంలో గెల‌వాల‌న్న క‌సి  ఉంది. రోజుకు 5 రూపాయల కూలీకి పొలాల్లో పని చేసింది. క‌ఠిక పేద‌రికం నుంచి మిలియన్ డాలర్ల కంపెనీ అధినేతగా ఎదిగి తానేంటో నిరూపించుకుంది.  

jyothi-reddy-జ్యోతిరెడ్డి-

పేద‌రికంతోనే జీవితం ప్రారంభమైంది. కన్న కూతురికి తిండి పెట్టలేక తండ్రి అనాథాశ్రమంలో చేర్పించాడు. ఫలితంగా అనాథాశ్రమంలో పెరగింది. 10వ తరగతి దాకా చదువుకుంది. 16 ఏళ్ల‌ వయసులో ఆ తండ్రి వచ్చి ఆ అమ్మాయికన్న పదేళ్ళు పెద్ద వయసులో ఉన్న ఒకరికి ఇచ్చి వివాహం చేశాడు. రెండేళ్ళలో ఇద్దరు బిడ్డల తల్లి అయింది. కటిక పేదరికంలో మగ్గుతూ, కట్టుకున్న వాడికి, పిల్లలకూ తిండి పెట్టేందుకోసం ఎన్నో ఉద్యోగాల ప్రయత్నం చేసి విపలమైనా ఆమె ఓడిపోలేదు. చివరకు రోజుకు 5 రూపాయల కూలీకి పొలాల్లో పని చేసింది. ఈ అన్ని పరిణామాలూ ఆ అమ్మాయిని నిరాశ, నిస్పృహలకు గురి చేయలేదు సరికదా మరింత దృఢంగా కష్టించేందుకు ప్రేరేపించాయి. ఫలితంగా ఇప్పుడు ఆమె అమెరికాలో కీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇవో)గా పని చేస్తోంది. నేను జీవితంలో ఓడి పోలేదంటూ స‌గ‌ర్వంగా చెబుతోంది.  

jyothi-reddy-జ్యోతిరెడ్డి-

వరంగల్ జిల్లా హన్మకొండ మండలం మైలారం గ్రామంలోని ఒక పేద కుటుంబంలో జ‌న్మించింది జ్యోతిరెడ్డి. ఐదుగురు పిల్లల్లో జ్యోతిరెడ్డి రెండవ సంతానం. చిన్న వయసులోనే తల్లి చనిపోవటంతో తండ్రి ఆలనా పాలనా చూడలేక అనాథాశ్రమంలో చేర్పించాడు . అక్కడ 10వ‌ తరగతి దాక చదువుకుంది. అయితే ఆ తర్వాత కటిక పేదరికం కారణంగా చదువుకు స్వస్తి చెప్పి పొలాల్లో కూలి పనికి కుదురుకుంది. 16 ఏళ్ల వయసు రాగానే ఆమెకన్న 10 ఏళ్ల పెద్ద వయసున్న వాడికి బలవంతంగా కట్టబెట్టారు. ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూడటానికి రోజుకు 5 రూపాయల కూలీకి చేరింది. 1988లో వయోజన విద్యా వలంటీర్‌గా 120 రూపాయల చిన్న ఉద్యోగం సంపాదించింది. దానితో పిల్లలను పోషించింది. ఆ తర్వాత నేషనల్ సర్వీస్ కార్యకర్తగా నెలకు 200 వేతనానికి కుదిరింది. అయితే కుటుంబం నడవటానికి ఆ డబ్బు కూడా సరిపోవటంతో రాత్రి వేళల్లో దుస్తులు కుట్టి మరి కాస్త సంపాదించింది.

jyothi-reddy-జ్యోతిరెడ్డి-

చదువు కొనసాగిస్తానంటే భర్త ఒప్పుకోలేదు. అయినా ఆమె గ్రామాన్ని విడిచిపెట్టి పిల్లలను తీసుకొని హన్మకొండ చేరుకుంది. టైప్ రైటింగ్లో శిక్షణ పొంది చిత్రకళ కోచింగ్ కు కూడా వెళ్లింది. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటంతో పాటు తాను అనుకున్నది సాధించటం కోసం కుటుంబంతో, సమాజంతో అనునిత్యం పోరాటం జరపాల్సి వచ్చేది. ఈ క్రమంలోనే అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ నుంచి 1994లో డిగ్రీ పూర్తి చేశారు. కాకతీయ వర్సిటీ నుంచి 1997లో పోస్టు గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. ఫలితంగా ఆమెకు 398 రూపాయ‌ల‌ వేతనంతో స్పెషల్ టీచర్ ఉద్యోగం వచ్చింది. బడికి వెళ్ళటానికి రోజూ 2గంటలు పట్టేది. ఈ మధ్య సమయంలో తన తోటి ప్రయాణికులకు చీరెలు అమ్మి మరి కాస్త అదనపు డబ్బు సంపాదించింది.

jyothi-reddy-జ్యోతిరెడ్డి-

అదే సమయంలో ఒక ఇంగ్లీష్ డైలీలో వచ్చిన యాడ్ చూసిన జ్యోతి రెడ్డి జన శిక్షణ నిలయంలో లైబ్రేరియన్గా ఉద్యోగం సంపాదించుకుంది. చదువును కొనసాగించటం కోసం ప్రతి ఆదివారం ఓపెన్ స్కూల్కు హాజరయ్యేది. 1992లో వరంగల్‌కు 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న అమీన్ పేటలో 18 నెల‌ల‌ కాల పరిమితితో కూడిన స్పెషల్ టీచర్ ఉద్యోగం తనకు దక్కింది, చివరకు 1994లో 2,750 వేతనంతో పూర్తి స్థాయి ఉద్యోగం లభించింది. మరో నాలుగేళ్ళ తర్వాత అమెరికా నుంచి వచ్చిన తన భర్త బంధువును చూసి ఆశ్చర్య పోయింది. అతడి హుందా, దర్జా చూసి తానూ అలా కావాలనుకుంది. అనుకున్నదే తడవుగా సాఫ్ట్ వేర్ నైపుణ్యం వైపు దృష్టి సారించింది. అందుకోసం హైదరాబాద్లోని విసిఎల్ కంప్యూటర్స్లో చేరి సాఫ్ట్వేర్ శిక్షణ తీసుకుంది. అందుకోసం దీర్ఘకాలిక సెలవు పెట్టింది. 2000లో పాస్‌పోర్టు, హెచ్1 వీసా లభించటంతో అమెరికా వెళ్లింది. అక్కడ పని చేసే తన భర్త బంధువు సహాయంతో ఒక దుకాణంలో ఉద్యోగం సంపాదించి 12గంటలకు 60 డాలర్ల వేతనం పొందింది. అమెరికా వెళ్ళేందుకు వీలుగా తన ఇద్దరు పిల్లలనూ ఒక మిషనరీ స్కూల్లో చేర్పించింది. 

jyothi-reddy-జ్యోతిరెడ్డి-

అయితే ఆమె అమెరికా జీవితం అంత సాఫీగా ఏమీ కొన‌సాగలేదు. ఒక గ్యాస్ స్టేషన్లో కొంతకాలం, బేబీ సిట్టర్‌గా ఇంకొంతకాలం, వీడియో షాప్‌లో సరకుల లోడింగ్, అన్‌లోడింగ్ పనిలో మరి కొంతకాలం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒక సమీప బంధువు సహాయంతో సిఎస్ అమెరికా అనే కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. మరో కంపెనీలో ఆ తర్వాత ఉద్యోగం వచ్చినా ఎక్కువరోజులు నిలవలేదు. ఫలితంగా మళ్ళీ బేబీ సిట్టర్‌గా పని చేయాల్సి వచ్చింది. ఇక అప్పటినుంచీ ఆమె కలలు సాకారం కావటం మొదలైంది. అమెరికాలోని ఒక సంస్థ ఆమెను సాఫ్టువేర్ నియామకాలు చూసుకునే పనికి నియమించింది. అన్నిటినీ తట్టుకుని ముందుకు సాగి అతి త్వరలోనే స్వంత సంస్థ స్థాపించుకోగలిగింది. అప్పటికే ఆమె పిల్లలు కూడా అమెరికా వచ్చేశారు. కేజీ నుంచి పీజీ దాకా వెయ్యి మంది చిన్నారుల‌కి చదువు చెప్పాలన్న తన డ్రీమ్ ప్రాజెక్టును సాకారం చేయటం ప్రారంభించింది. సాఫ్టువేర్ శిక్షణ ఆ సంస్థ ప్రత్యేకం. ఈ క్రమంలో తన ఆలోచనా ధోరణితో LEARN TO LIVE FOUNDATION ను స్థాపించారు. అది విజయవంతంగా నడుస్తోంది.

jyothi-reddy-జ్యోతిరెడ్డి-

ఆ త‌ర్వాత జ్యోతిరెడ్డి ఫినిక్స్ అనే సంస్థను ప్రారంభించింది. ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు. ఏటికేడు ప్రయాణం.. ఒక్కో మజిలీ దాటుతూ వచ్చింది. ఇప్పుడు ఫినిక్స్ మిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. పూర్తిస్థాయి సేవకార్యక్రమాలకు జ్యోతి టైం కేటాయిస్తోంది. ఆర్ఫాన్ స్కూళ్ల ఏర్పాటుపై పోరాటం చేస్తోంది. తనతో కలసి వచ్చేవారికి ఆహ్వానం పలుకుతోంది.


jyothi-reddy-జ్యోతిరెడ్డి-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.