కొన్ని గంట‌ల్లోనే వేల కోట్ల రూపాయ‌లు సంపాదించ‌డం సాధ్య‌మా? ఎంత పెద్ద ధ‌న‌వంతుడైనా రోజుకి మహా అయితే కోటో, రెండు కోట్లో సంపాదిస్తాడు. కానీ అత‌డు రెండ్రోజుల్లో ఏకంగా ఆరు వేల కోట్ల రూపాయలకుపైగా సంపదని తన ఖాతాలో వేసుకొని, ఒక్క దెబ్బతో దేశంలోని మొదటి ఇరవై మంది శ్రీమంతుల్లో ఒకరిగా మారిపోయాడు.

Image result for d'mart radhakishan damani

 సామాన్యుడి సూపర్‌మార్కెట్‌గా ముద్రపడిన డీ-మార్ట్‌ని స్థాపించింది రాధాకిషన్‌ దమాని. కొన్ని నెల‌ల క్రితం తొలిసారి షేర్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన డీ-మార్ట్‌ సంస్థ విలువ రెండ్రోజుల్లో ఏకంగా 40వేల కోట్లు దాటింది. దాంతో అది దేశంలోనే అతిపెద్ద రిటైల్‌ సంస్థగా అవతరించింది. ఆ ఘ‌న విజ‌యం వెనుక రాధాకిషన్‌ దమాని క‌ష్టం ఉంది. క‌సితో కూడిన‌ కృషి ఉంది.
 
దేశంలోని చిన్న పట్టణాల నుంచీ మెట్రో సిటీల దాకా చాలా ప్రాంతాల్లో కనిపించే సూపర్‌ మార్కెట్ డీమార్ట్‌. ఆ స్టోర్ల అధినేత దమానీ మాత్రం బయట ఓ చిన్న బిజినెస్‌ పార్టీలో కూడా కనిపించరు. ముప్ఫయి ఏళ్లుగా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తున్నా, కనీసం ఒక్క వ్యక్తిగత ఇంటర్వ్యూ కూడా మీడియాకి ఇవ్వకపోవడం ఆయన వ్యాపార దృక్పథానికి నిదర్శనం. వెనక ఎన్ని వేల కోట్లున్నా ఎప్పుడూ తెల్లని ప్యాంటూ చొక్కాతో కనిపించడం దమానీ నిరాడంబరత్వానికి ఉదాహరణ. ఒకప్పుడు స్టాక్‌ మార్కెట్‌లో ఆయనో తిరుగులేని శక్తి. అంతకంతకూ పడిపోతున్న షేర్లు కూడా ఆయన కొంటే అమాంతం పైకి లేస్తాయని ఇన్వెస్టర్ల నమ్మకం. అందుకే దమానీని ‘భారతీయ బఫెట్‌’ అని పిలిచేవారు. ఆయన సూచనల ప్రకారం స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్లంతా కోటీశ్వరులుగా ఎదిగారు. అలా చాలా ఏళ్ల పాటు మదుపరిగా మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన దమానీ, ఉన్నట్టుండీ పదిహేడేళ్ల క్రితం స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడులకు దూరమై అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఎన్నాళ్లగానో తన మనసులో మెదులుతున్న రిటైల్‌ వ్యాపారం మీద దృష్టిపెట్టడానికే ఆ నిర్ణయం తీసుకున్నారు.

Related image

ఇన్వెస్టర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి నేడు ఓ అతిపెద్ద గ్రోసరీ గొలుసుకట్టు దుకాణాల సంస్థకు అధిపతిగా, సక్సెస్‌ఫుల్‌ ఇన్వెస్టర్‌గా దమానీ, ఎంతో మంది పారిశ్రామిక వేత్తలను... విలువ, వ్యూహాల పరంగా వెనక్కి నెట్టేశారు. ఆయన పాటించే సూత్రాల్లో స్టాక్‌ను తక్కువ ధరల వద్దే కొనుగోలు చేయడం.  ఎన్నో ఏళ్ల క్రితమే తక్కువ ధరల్లో ఉన్నప్పుడే వాటిని తన పోర్ట్‌ఫోలియోలో చేర్చుకున్నారు. అంతేకాదు, వీటితోపాటు ఇతర కంపెనీల షేర్లనూ కొనుగోలు చేశారు. గరిష్ట ధరల వద్ద విక్రయించారు. తక్కువ ధరల వద్ద కొనడం, గరిష్ట ధరల వద్ద ఎగ్జిట్‌ కావడం కూడా ఆయన పాటించే విధానాల్లో ఒకటి. 
జీవితంలో గెల‌వ‌డానికి దగ్గర దారులు ఉండవు. సరైన వ్యూహంతో, ఓపిగ్గా కష్టపడితేనే అది ఏదో ఒక రోజు మన తలుపు తడుతుంది. దమానీ ఇరవైఏళ్ల స్టాక్‌ మార్కెట్‌ అనుభవం, పదిహేనేళ్ల డీమార్ట్‌ ప్రయాణం మరోసారి ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. స్టార్ట‌ప్ కంపెనీల‌కు, ఈ త‌రం యువ‌త‌కు రాధాకిషన్‌ దమాని జీవితం ఓ స్ఫూర్తి.



మరింత సమాచారం తెలుసుకోండి: