హైదరాబాద్‌ నగర ప్రజలకు , తెలంగాణ సంస్కతీ, సంప్రదాయాలు, గ్రామీణ వాతావరణంతో ఆహ్లాద పరుస్తున్న పరిచయం హైటెక్‌ సిటీ పక్కనే ఉన్న శిల్పారామం తరహాలోనే మరొక సుందర గ్రామీణ సౌందర్యం నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఉప్పల్‌ పమీపంలో మినీ శిల్పారామం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 2018లో నాటి మున్సిపల్‌ డెవలప్‌ మెంట్‌ మంత్రిగా కేటీఆర్‌ ఈ వేదికకు పునాది వేశారు. ఇపుడా నిర్మాణం పూర్తయి, ఉప్పల్‌-నాగోల్‌ ప్రధాన రహదారికి సమీపంలో, మూసీనది తీరంలో ప్రారంభోత్సవానికి సిద్ధం అయింది. హెచ్‌ఎండీఏ అధ్వర్యంలో .... ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌, మూసీ నదిని అనుకొని ప్రాంతంలో హైదరాబాద్‌ మహానగరాభివద్ధి సంస్థకు చెందిన 7.5 ఎకరాలను శిల్పారామానికి కేటాయించారు.

శిల్పారామం నిర్మాణానికి హెచ్‌ఎండీఏ రూ. 5 కోట్లను కేటాయించింది. జూన్‌ 2న ప్రారంభం '' మాదాపూర్‌లోని శిల్పారామం సేవలను తూర్పు విభాగానికి విస్తరించేందుకు ఉప్పల్‌ లో రెండో శిల్పారామం మొదలు పెట్టాం. ఇప్పటి వరకు మెదటి ఫేజ్‌ పనులు పూర్తయ్యాయి. హస్తకళల కోసం స్టాళ్లు, మినీ వేదికలు, పల్లె వాతావరణం తలపించేలా నిర్మాణాలను, ల్యాం డ్‌స్కేపింగ్‌ చేపట్టి ఆకర్షణీయం గా తీర్చిదిద్దాం. ఇక్కడ, గ్రామీణ నేపథ్యాన్ని, గ్రామీణ కళలు, సంస్కతులు కళాకారులను ప్రోత్సహించే విధంగా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

చేనేత వస్తువులు, కళాత్మక వస్తువులు విక్రయానికి 40 స్టాల్స్‌ను ఏర్పాటు చేశాం. అరుదైన రుచులను అందించే ఫుడ్‌ కోర్టు ,కాఫీ హౌస్‌ కూడా ఉన్నాయి. జూన్‌ 2న ప్రారంభించడానికి సిద్ధం చేశాం.'' అని వివరించారు మినీశిల్పారామం స్పెషల్‌ ఆఫీసర్‌ జి.కిషన్‌రావు. రెండవ ఫేజ్‌లో క్రాఫ్ట్స్‌ మ్యూజియం, విలేజీ మాల్స్‌,బోటింగ్‌తో సహా మరి కొన్ని ఆకర్షణలు ఉంటాయని ఆయన అన్నారు. అందుబాటులో మెట్రో రైలు మాదాపూర్‌లో శిల్పారామం చూసిన వారు అక్కడ మెట్రో రైలు ఎక్కితే 45 నిముషాల్లో ఉప్పల్‌లోని మినీ శిల్పారామం చేరుకునే సౌకర్యం ఉంది . పక్కనే మూసీనది ఉండటం వల్ల దుర్గంధం రాకుండా ప్రత్యేకమైన మొక్కలను పెంచుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: