Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 19, 2019 | Last Updated 8:15 pm IST

Menu &Sections

Search

త్వరలో అంతరించబోతున్న పాత తరం తస్మాత్ జాగ్రత్త ...!

త్వరలో అంతరించబోతున్న పాత తరం తస్మాత్ జాగ్రత్త ...!
త్వరలో అంతరించబోతున్న పాత తరం తస్మాత్ జాగ్రత్త ...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచం  నుండి కనుమరుగు అవ్వబోతోంది.

అవును ఇది ఒక చేదు నిజం ।

ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు.

వాళ్ళు.....
 
రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు !
ఉదయం పెందరాళే లేచేవాళ్ళు !
నడక అలవాటు ఉన్నవాళ్ళు! 
మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు !
 
వాళ్ళు.....
 
ఉదయమే  వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !
ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు! 
మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!
 పూజకు పూలు కోసే వాళ్ళు !
 
వాళ్ళు....
 
పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !
మడిగా వంట వండేవాళ్ళు !
దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు! 
దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు !
దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!!
మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!!
 
వాళ్ళు 
 
 అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు! 
కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు !
తోచిన సాయం చేసేవాళ్ళు !
చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు !
 
వాళ్ళు 
 
ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు !
ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు !
పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు! 
ఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు! 
 
వాళ్ళు 
 
పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు!
కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు !
సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు !
పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ! 
 
వాళ్ళు .... 
 
 
తీర్థయాత్రలు చేసేవాళ్ళు !
ఆచారాలు పాటించే వాళ్ళు !
తిధి, వారం , నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు !
పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు !
 
వాళ్ళు ....
 
 
చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు !
లుంగీలు, చీరలు  కట్టుకుని ఉండేవాళ్ళు !
చిరిగిన  చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు!
అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు !  
 
 
వాళ్ళు ....
 
 
తలకు నూనె రాసుకునే వాళ్ళు !
జడగంటలు పెట్టుకున్నవాళ్ళు !
కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు !
చేతికి గాజులు వేసుకునే వాళ్ళు !
ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువుల తో కాకుండా... వస్తువులను వాడుకుంటూ మనుషుల తో గడిపిన తరం.....
 
ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు
 
మీకు తెలుసా ? 
 
వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా  మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు.
 
మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారు.
 
మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి 
 
లేదంటే .....

లేదంటే .....  

లేదంటే .....

ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది.

వాళ్ళ ప్రపంచం, వస్తువులతో కాకుండా, మనుషులతో మానవత్వం తో కూడి ఉండే తరం...

సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!
 
 స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !

కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!

 ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగిన తరం

ద్వేషం, మోసం లేని జీవనం గడిపిన తరం అది!
 
సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అది!

 
లోకానికి తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది !🙏

ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!😊

 తనకోసం కొంత మాత్రమే వాడుకుని, తన సంతానం వృధ్ధి కోసం పరితపించిన తరం

వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది 🤔

మీ కుటుంబం లో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. .🙏
 
సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశం గా ఈ భారతాన్ని  మార్చేయ్యకండి !!!
తప్పులను సరిదిద్దగలది  సంస్కారమే.


old-memories
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎగ్జిట్ పోల్స్... ప్రజల్లో పెరిగిన ఆసక్తి...ఎన్డీయేకి 287 స్థానాలు... యూపీఏ 128!
చెత్తకుప్పలో  వీవీప్యాట్ స్లిప్పుల కలకలం!
రోడ్డు ప్రమాదంలో ‘మహర్షి’నటుడికి గాయాలు!
సమాజమే నా కుటుంబం అనుకున్నారు.. పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి గారు...!
చంద్రగిరి నియోజకవర్గంలో క్షణ క్షణం..ఉత్కంఠ...!
లగడపాటి సర్వే - తారుమారైన సందర్భాలు
దిల్‌రాజు చేతుల మీదుగా గాడ్ ఆఫ్ గాడ్స్ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా "మళ్ళీ మళ్ళీ చూశా" జూన్ లో విడుదల..!!
ప్రియుడికోసం కట్టుకున్న భర్త, కొడుకుని దారుణంగా చంపింది!
మెగాస్టార్ కి విలన్ గా సల్మాన్ సోదరుడు!
ఈ అందం చూస్తుంటే..బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు!
పోస్టల్ బాలెట్ల గోల్ మాల్...సబ్బంహరినిపోటీకి అనర్హుడిగాప్రకటించే అవకాశం?
వరల్డ్ కప్ విన్నర్ కి మైండ్ బ్లోయింగ్ ప్రైజ్ మనీ!
ఆ విషయంలో ప్రభాస్ ని పక్కకు నెట్టిన విజయ్ దేవరకొండ!
ఒక్క డాక్టర్ తప్పు..400 జీవితాలు నాశనం!
కడప దర్గాలో వైఎస్ జగన్ పూజలు!
ఇదేనా మెరుగైన సమాజం అంటే..సిగ్గు సిగ్గు : ఎంపీ విజయసాయిరెడ్డి
‘పటాస్’నుంచి శ్రీముకి అందుకే ఔట్!
యువత కోరుకున్న సినిమారంగం
గోవాలో రామ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌` పాట చిత్రీక‌ర‌ణ‌
జూన్ లో రానున్న "పండు గాడి ఫోటో స్టూడియో"
మాసివ్ డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘‘శివరంజని’’ ట్రైలర్ విడుదల
టాలీవుడ్ లో మరో విషాదం!
గోదారోళ్ళెంత అదృష్టవంతుల్రా..!
ఇంటర్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు.. గ్లోబరినా సంస్థకు హైకోర్ట్‌ నోటీసులు!
కేటీఆర్ అన్నా నన్ను చంపేసేలా ఉన్నారు..నువ్వే దిక్కు!
హిప్పీ నుంచి ‘ఎవత్తివే ఎవత్తివే...’సాంగ్ రిలీజ్!
మహర్షి లో అందరిని కదిలించిన "నువ్వని, ఇది నీదని సాంగ్" విడుదల ఎప్పుడంటే?
పతా హై మై కౌన్‌ హూ.. శంకర్‌.. ఉస్తాద్‌ ‘ఇస్మార్ట్ శంకర్’ఇరగదీశిండు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.