Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 7:23 am IST

Menu &Sections

Search

తియ్యని మామిడి పండ్ల లాంటి విజయం

 తియ్యని మామిడి పండ్ల లాంటి విజయం
తియ్యని మామిడి పండ్ల లాంటి విజయం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వరంగల్‌ నుండి 73 కిలో మీటర్ల దూరంలో సమ్మక్క,సారాలక్క జాతర జరిగే సమీపం లోని గోవిందరావు పేట మండలం(జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా) అటవీ ప్రాంతం లోకి అడుగు పెట్టగానే, తునికాకులు ఎండపెడుతున్న మహిళలు కనిపించారు. మీ ఊరి పేరేంటమ్మా..? అని అడిగితే ' ఫ్రూట్‌ ఫారం' అని వారు చెప్పారు. తునికి, ఇప్పచెట్లు తప్ప పండ్లతోటలు కన్పించని ఒక మారు మూల గిరిజన పల్లెకు ఆ పేరెలా వచ్చిందని మేం కన్ప్యూజ్‌ అవుతుంటే, ఆ రహస్యం వారే చెప్పారు. 60 ఏళ్ల క్రితం ఆ గ్రామం పండ్ల తోటలకు ప్రసిద్ది. కాలక్రమంలో తోటలన్నీ అంతరించి పోగా , ఆరేళ్ల క్రితం 33మంది గిరిజనులు ఆ ఊరికి పునర్వైభవం తెచ్చారు.. వారి కషి వెనుక ఉన్న ఆసక్తి కరమైన కథనాన్ని ...ఇలా చెప్పారు. 

పేరు వెనుక కథ 

'' ఇదంతా 1958 నాటి ముచ్చట. వరంగల్‌ జిల్లా, గోవిందరావు పేట మండలంలో ల్యాండ్‌ లార్డ్‌ వెంకటపతి రాజు కి వేలాది ఎకరాలుండేవి. జంపన్న వాగు సమీపంలో సర్వేనెంబర్‌ 667లోని అతని 30ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ వాగు సమీపంలో పూరిళ్లు వేసుకొని బతుకుతున్న15మంది కోయగిరిజనులతో ఆ భూముల్లో మామిడి,జామ,బత్తాయి పండ్లతోటలు సాగు చేయించారు. తోటలు పెంచినందుకు గిరిజనులకు కూలీని చెల్లించేవారు. పది సంవత్సరాల తరువాత 1968లో అప్పటి ప్రభుత్వం ఆ గిరిజనులతో 'కోయ కోఆపరేటివ్‌ కలెక్టివ్‌ జాయింట్‌ ఫార్మింగ్‌' సంస్ధను ఏర్పాటు చేయించి , ఆ భూములను వారికే అప్పగించారు. అప్పటి నుండి ఫలసాయాన్ని గిరిజనులు పొందసాగారు.

అనేకమంది అధికారులు సందర్శించి, గిరిజనుల సమష్టి సాగును పరిశీలించే వారు. ఇదే క్రమంలో ఐటిడిఎ నుండి పిఓ శర్మ అనే అధికారి ఆ పండ్లతోటలను చూసి 'మీ గ్రామం పేరేంటి?' వారిని అడగ్గా,' తోటల గ్రామం ' అని చెప్పారు. ఆయన దాన్ని 'ఫ్రూట్‌ఫారమ్‌' అని మార్చగా అప్పటినుండి ఇప్పటి వరకు ఆ గ్రామానికి అదే పేరు స్ధిర పడింది.'' అని వనసమాఖ్య స్వచ్ఛంద సంస్థ సిఇఒ శ్రీనివాసులు చెప్పారు. 

పండ్లు కోసిన చోట, ఆకులు ఏరుకుంటూ...

 కాల క్రమంలో సాగునీటి కొరత వల్ల ఆ తోటలన్నీ అంతరించి పోయి 'ఫ్రూట్‌ఫారమ్‌' పేరు మాత్రమే మిగిలింది. ఒకపుడు పండ్లతోటల సాగుతో ఏ లోటు లేకుండా బతికిన గిరిజనులు ఆ తరువాత తునికాకు,ఇప్పపూల సేకరణే జీవనాధారంగా బతక సాగారు. మరి కొందరు సమీప నగరాలకు వలస పోయేవారు. మార్పు కోసం... ఇలాంటి స్ధితిలో, ఒకప్పటిలా పండ్లతోటలు ఎందుకు సాగు చేయకూడదని గిరిజనులంతా కలిసి చర్చించుకున్నారు. వారి పొరుగు గ్రామాల్లో తునికాకు సేకరణలో,అమ్మకంలో సాయపడుతున్న 'వనసమాఖ్య' స్వచ్ఛంద సంస్ధను సంప్రదించారు. శ్రమదానంతో పనులు చేస్తే తోటలు పెంచుకోవచ్చని నాబార్డు అధికారులు,వనసమాఖ్య ప్రతినిధులు చెప్పడంతో రైతులంతా కలిపి మామిడి,ఉసిరి మొక్కలు నాటారు. వారికి నాబార్డు 'మాతోట' పథకంలో తోటల పెంపకానికి ఆర్ధికంగా సాయం అందింది. ఒకపుడు ఇప్పపూల సేకరణ మీద ఆధారపడిన గిరిజనులు ఇపుడు పండ్లతోటలకు యజమానులయ్యారు.

నేడు ఈ ఊరు రైతుల ఆదాయం ఏడాదికి సుమారు రూ. 36 లక్షలకు చేరింది. గ్రామ ఆర్ధిక చిత్రం మారింది. కష్టే ఫలం... '' ఇంతకు ముందు ఎవరికైనా మా ఊరు పేరు చెప్పాలంటే ఇబ్బందిగా ఉండేది. ఆరేళ్లలో పండ్లతోటలు పెంచాం. ఇపుడు మా తోటలు చూపించి ఇదే ఫ్రూట్‌ ఫారం అని గర్వంగా చెప్పుతున్నాం.ఈ మామిడి పండ్ల కోసం హైదరాబాద్‌ నుండి కూడా వస్తున్నారు.'' అని తమ చెట్లకు కాసిన తోతాపురి మామిడి పండ్లను చూపిస్తూ , సంతోషాన్ని పంచుకున్నారు సమ్మక్క. ఒకపుడు ఎండిన 'ఫ్రూట్‌ఫారం' సమష్టి శ్రమతో చిగురించింది. వీరు పండించిన తీపి రసాలు , బంగినపల్లి మామిడి పండ్ల కోసం హైదనాబాద్‌ వ్యాపారులు క్యూ కడుతున్నారు. 


mango-farm
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.