అమిత్ అనిల్ షా అక్టోబర్ 22 వ తేదీని 1964 లో గుజరాతీ బానియ కుటుంబం లో జన్మించారు.ఆయన తండ్రి అనిల్ చంద్ర షా పీవీసీ పైపుల యజామని.అమిత్ షా జీవరసాయన శాస్త్రంలో బీఎస్సీ డిగ్రీ ని పొందారు. ఆయన చదువుకునే రోజులలోనే ఆర్.ఎస్.ఎస్ విద్యార్థి సంఘం నాయకుడిగా పని చేశారు.అమిత్ షా 1987 లో బీజేపీలో చేరారు.అంతకముందు సంవత్సరమే మోదీ బీజేపీ లో చేరారు.

మోదీ మరియు అమిత్ షా అప్పట్లో గుజరాత్ గ్రామీణ ప్రాంతాలలో బలంగా ఉన్న కాంగ్రెస్ ను దెబ్బ తీయడానికి కలిసి పనిచేశారు. అందువల్ల బీజేపీ  1995లో మొదటిసారిగా గుజరాత్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది.వారిద్దిరూ అప్పటి నుండి పార్టీలో కలిసి పని చేయడం వల్ల కాంగ్రెస్ గుజరాత్ లో పట్టును కోల్పోయింది.

అమిత్ షా 2009 లో గుజరాత్ రాష్ట్ర చదరంగ సంఘానికి అధ్యక్షుడిగా పని చేశారు.అలాగే మోదీ అధ్యక్షుడిగా పని చేసిన గుజరాత్ క్రికెట్ సంఘానికి ఉప అధ్యక్షుడిగా పని చేశారు.2014 లో మోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత అమిత్ షా తొలిసారిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ఆయన బీజేపీ అధ్యక్షుడిగా పార్టీకి ఎనలేని సేవలు అందించారు.

అందుకే బీజేపీ ఏకంగా 303 సీట్లను గెల్చుకుంది. మోదీకి అమిత షా తో ఉన్న సన్నిహిత్యం వల్ల, దేశం లో సమస్యల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల , కాశ్మీర్ సమస్య ముందు ఉండడం వల్ల వాటి పరిష్కారానికి అమిత్ షా కృషి అవసరం అని అతనికి హోంమంత్రి పదవిని అప్పజెప్పారు.బీజేపీ సిద్దాంతం ప్రకారం 60 యేళ్ళు దాటిన నాయకులను ప్రక్కన పెడుతారు.వచ్చే ఎన్నికల సమయానికి మోదీకి 60 యేళ్ళు నిండుతాయి.తర్వాత షా నే బీజేపీ ప్రధాన అభ్యర్ధిగా ఉంటారు అనే ప్రచారం కూడా ఇప్పటినుండే జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: