మన భారతీయ సాంప్రదాయంలో చీర రెండు అక్షరాల పదమైనా మగువల్లో కొత్త అందాన్ని తెస్తుంది. తెలుగు సంస్కృతికే కాదు భారతీయతకి అద్దం పట్టే అలంకరణ చీర. టాలీవుడ్ లో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. గతంలో చాలా మంది హీరోయిన్లు చీరకట్టులో ప్రేక్షకులను కనికట్టు చేసి అలరించేవారు. 'చెంగావి చీర కట్టుకున్న చిన్నదీ’ అని అక్కినేని నాగేశ్వరరావు కథానాయికతో వేసే స్టెప్ కు ఇప్పటికీ జన హృదయం నీరాజనం పడుతుంది.  
Image result for erotic vidyabalan in saree
ఆడవారికి చీరకట్టులో ఉన్నఅందం మరే డ్రస్ లోనూ ఉండదు. ఆ చీరకట్టులో కొందరిని ఎంత సేపు చూసినా తనివి తీరదు. ఆ చీరకట్టు అందం అలాంటిది. ఇక చీరకట్టు లో సినిమా హీరోయిన్ల అందాల ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటిదాకా మెడ్రన్ డ్రస్సుల్లో చూసి ఒక్కసారిగా వారు చీరకట్టులో చూస్తే వర్ణించడం చాలా కష్టం. వారిని చీరకట్టులో చూస్తూ ఎక్కడ కనురెప్ప కొడితే ఏ అద్బుత దృశ్యం మన కనుల ముందు నుండి మాయమవుతుందేమోనని అనిపిస్తుంది. 

Image result for anushka in mirchi in a sareeవంపు సొంపులను చూపించి చూపించ నట్టు ఉండే యానకమే చీరకట్టు. అది మాత్రం నిజం చీరలో అందాన్ని మన కవులు చాలా విదాలుగా వర్ణించారు. చీరకట్టులో కనిపించీ కనిపీంచని నడుము సోయగాలు, ఎద పొంగుల మలయ మారుతం ఇలా మనం తన్మయమైన విషయాలు చెప్పుకుంటూ పోతే చీరకట్టులో అందం మహా సాగరమంత. చీర అందంపై ఎన్నో సినిమా పాటలు కూడా వచ్చాయి. 
Image result for rashmika mandanna in sarees

చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది దీని తస్సదియ్య, అందమంతా చీరలోనె ఉన్నది లాంటి పాటలు సినీ అభిమానులను అలరించాయి. విజయశాంతి, సౌందర్య, భానుప్రియ, రాశి, ఇలా చాలా మంది హీరోయిన్లు చీరకట్టు లో తెలుగు సినీ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన విషయం తెలిసిందే. ఇలా వారు చీరకట్టులో నటించిన అనేక చిత్రాలు బంఫర్ హిట్ కొట్టాయి. ప్రస్తుత ట్రెండ్ లో కూడా కొంత మంది హీరోయిన్లు చీరకట్టులో హాట్ అండ్ సెక్సీ అందాల విందును చేస్తున్నారు. ఆదే నిజంగా చీరకట్టు కనికట్టు.

Image result for most beautiful models in Saree

చరిత్రకు తెలిసిన చీర సింగారం:

చరిత్రకు పూర్వం సింధూలోయ ప్రాంతపు స్త్రీలు ప్రత్తి నూలుతో నేయబడిన బట్టలు ధరించేవారు. ప్రత్తి మరియు పట్టుబట్టల గురించి వేదాలలోను, రామాయణ, మహాభారత కథలలోనూ కూడా చెప్పబడింది. చంద్రగుప్తుని కాలంలో పాటలీపుత్రానికి వచ్చిన గ్రీకు రాయబారి మెగస్తనీసు భారత స్త్రీలు ధరించిన వస్త్రాల గురించి "బంగారు జరీతో విలువైన రాళ్ళు పొదగబడి నవి" అని వ్రాశాడు. 
Related image
ప్రాచీన కాలపు చిత్రాలలోను, రాతి విగ్రహాలలోను పలచని చీర మడతలు సూచించబడ్డాయి. అజంతా గుహల కుడ్య చిత్రాల లో ప్రాచీన భారతదేశపు నేతగాళ్ళ ప్రతిభ ప్రదర్శింపబడుతూంది. సమకాలీన వాంగ్మయంలో వివరించబడిన చీరల పేర్లను పరిశీలిస్తే ఆనాటి హస్తకళా నైపుణ్యం విదితమవుతుంది. ఆకాశంలో దట్టమైన మేఘాలు వలే కనిపించే చీరలకు మేఘాంబర్ అని, హంసపాదాల చీరకి హంస పాదుక అని పేరుపెట్టారు. మధ్య యుగంలో చీరలకు మంచి ప్రసిద్ధి ఏర్పడింది. ఆనాడు ఆస్మాన్‌ తారా (ఆకాశాన నక్షత్రాలు) అనే చీరలు వ్యాప్తిలో ఉండేవి. నీలాంబరి (నీలాకాశం), దూప్‌ చాన్ (సూర్యకాంతి నీడ) మరికొన్ని ప్రాచీన చీరల రకాలు.
Related image

బంగ్లాదేశ్ రాజధాని నగరమైన ఢాకా మస్లిన్ బుటిదార్ చీరలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. విదేశాలలో కూడా విస్తారంగా వాడేవారు. ఢాకా మస్లిన్ చీరలు మిక్కిలి నాజూకు గాను, సున్నితంగానూ ఉండేవి. వీటిని పచ్చని గడ్డి మీద పరచినప్పుడు పొద్దుటి మంచుతో కప్పబడి కంటికి కూడా కనిపించనంతటి సున్నితంగా, పలచగా ఉండేవి. అందుచేత ఈ చీరలకు షబ్నం (పొద్దుటి మంచు) అనే పేరు వచ్చింది. 
Image result for jayaprada in a beautiful saree
ఈ షబ్నం చీరలు మొఘల్ అంతపురాలలో కూడా ప్రవేశించాయి. ఔరంగజేబు ఒకనాడు తన కుమార్తె జెబున్నీసా చీరను చూసి ఆ చీర సభ్యత కాదని, గౌరవానికి లోపం అని మందలించాడు. రాకుమార్తె తాను ఎనిమిది మడతలుండే కట్టుకున్నానని చెప్పింది. 19వ శతాబ్దపు విక్టోరియా మహారాణి కాలంలో కూడా సంప్రదాయక ఢాకా మస్లిన్ చీరలు అనేక రకాలు ఉండేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో పెద్ద పెద్ద మెషీనులు, కావలసిన సాధన సంపతు కలిగిన బ్రిటిషు వారు అతి సున్నితమైన ఢాకా చీరల వంటి చీరలను తయారు చేయలేకపోయేవారు. 


15 గజాల పొడవు, ఒక గజం వెడల్పు గల ఢాకా మస్లిన్ చీర కేవలం 900 గ్రెయినులు తూగేవి.అలాంటి చీరను మడతెట్టి అగ్గిపెట్టె లాంటి బాక్సుల్లో సర్దేవారని ప్రతీతి. 
Related image
ఇటువంటి సున్నితమైన నూలు విలువ ఒక ఔన్సు, 3 పౌండ్ల, 3 షిలింగులు ఉండేది. వారణాశికి చెందిన బెనారస్ జరీ చీరలకు, తమిళనాడు మధుర చీరలకు, పశ్చిమ బెంగాలు లోని ముర్షిదాబాద్ చీరలకు కూడా ఎంతో ప్రసిద్ధి ఉంది. బెనారస్ చీరలు బంగారు, వెండి జరీలతో నేయబడతాయి. అనేక తరాల పాటు మన్నుతాయి. 


ఇవి చిరిగి పోయినా వాటికి జరీ విలువ ఉంటుంది. ఇదే విధంగా ఆంధ్ర ప్రదేశ్‌లోని గుంటూరు చీరలు, వెంకటగిరి చీరలు, ధర్మవరం చీరలు ఎంతో ప్రసిద్ధిపొందాయి. నేత రకాన్నిబట్టి, రంగును బట్టి వీటిని ప్రత్యేక ఉత్సవాలలోను, పండుగలలోను కట్టుకుంటారు. 
Image result for aishwarya rai in a saree
అంతేగాక కాలానుగుణ్యంగా కూడా చీరలు ఉంటాయి. వసంత కాలంలో పసుపు వర్ణపు చీర, వేసవి కాలంలో తెల్లని చీరలు వాడతారు. మధ్యాహ్న సమయంలో ఉత్సవాల సమయంలో అందంగా నేయబడిన ముదురు రంగు చీరలు ధరిస్తారు. ప్రస్తుతం లండన్, న్యూయార్క్ నగరాలలో సైతం విలువైన పెద్దపెద్ద చీరలు కనిపిస్తాయి. బట్టల్లో చీర చాలా అందమైనదని పాశ్చాత్యులు గ్రహించారు. అంతేకాదు, లండన్, న్యూయార్క్‌లో గల భారత స్త్రీలు చీరను కట్టే విధానంలో కూడా ఒక విధమైన సౌకుమార్యం, అందం ఉందని వారి అభిప్రాయం. 
Image result for rekha in a beautiful saree
లండన్, న్యూయార్క్ నగరాలలో డిజైనర్లకు భారతీయ చీరస్ఫూర్తిని కలిగించింది. సాయంత్రం పూట అక్కడ ధరించే గౌనులకు కూడా చీర ఆకృతులను వారు ప్రవేశ పెట్టారు. భారతదేశపు ప్రాచీన కాలపు చీరల ఆకృతులు సరికొత్త ఫేషన్లకు మార్గదర్శకంగా నిలిచాయి. భారత స్త్రీకి ఈ చీర కట్టుడు విధానం వల్ల ప్రపంచ దేశాల్లో ఎనలేని గౌరవ మర్యాదలు సముపార్జించుకుంది. చీరలోని నిండు తనం కొత్త అందాలను సమకూర్చుతూ పరిపూర్ణ మహిళగా భారత స్త్రీ నిలిచింది. చీరకట్టు మనదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరకంగా ఉంటుంది.
Image result for sholey hema malini in a saree

• భారతదేశంలో ఎక్కువమంది చీరను ఒకసారి నడుంచుట్టూ తిప్పి, కొన్ని మడతలు పెట్టి, మళ్ళీ సగం నడుంచుట్టూ తిప్పి రెండవ చివర పమిటచెంగు ఎడమ భుజం మీదనుండి వెనుకకు వది లేస్తారు.

• గుజరాత్ రాష్ట్రంలో పమిటచెంగు కుడి భుజం మీదనుండి వేసుకుంటారు.
చీరలు తయారుచేసిన దారం ఆధారంగా పట్టుచీరలు, నూలుచీరలు, నైలాన్ చీరలు అని వివిధ రకాలుగా పేర్కొనవచ్చును. నూలుచీరలు ఎక్కువగా వేసవికాలంలో ధరించడానికి ఇష్టపడతారు. పట్టుచీరలు ముఖ్యంగా వివాహాలకు, విందులకు, దేవాలయాలకు పోయినప్పుడు ఎక్కువగా ధరిస్తారు. కంచి, ధర్మవరం, పోచంపల్లి, మైసూర్ మొదలైనవి పట్టుచీరలకు ప్రసిద్ధి.
 
 
భారతీయుల దుస్తులలో దాదాపు ప్రామాణికమైన చీర ముఖ్యంగా జానపద సాహిత్యంలో, పలు సందర్భాలలో ప్రస్తావించ బడింది. తెలుగు సినిమా పాటలలలో చీర:

Image result for tamanna in a saree


మరింత సమాచారం తెలుసుకోండి: