విభిన్న సంస్కృతులు,విభిన్న సంప్రదాయాలు కలిగిన భారత్ దేశంలో సహజ సిద్ధ వనరులకు,మానవ మేధస్సు కు కొదవ లేదు.అయినప్పటికీ గత ఏడు పదుల సంవత్సరాల నుండి భారత్ దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా లోనే  ఉన్నది.దీనికి కారణం ఆధిపత్యం కోసం ఇతర దేశాలను నాశనం చేస్తున్న అగ్రదేశాల దగ్గర మన సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టడం మరియు మన శాస్త్రవేత్తల ఆలోచనలకు తోడుగా నిలవకపోవడం వల్లనే అయినప్పటికీ మన శాస్త్రవేత్తల తమ అపార మేధస్సును వాడి ఉన్న వనరులతో ప్రపంచం మెచ్చే విజయాలను సాధిస్తున్నారు.

అలా వారందరూ విజయాలను అందుకోవడానికి ఆ సంస్థలు ప్రభుత్వంలో భాగం కావడానికి ఒక మహానుభావుడు కృషి చేశారు.ఆయనే హామీ జాహింగిర్ బాబా.ఈయన ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు.అందుకే ఆయన విద్యాభ్యాసం విదేశాలలో జరిగింది.మెకానికల్ ఇంజనీరింగ్ పట్టాను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి పొందారు.
క్వాంటం మెకానిక్ విసృత కృషి చేసి పేరు గాంచిన నోబెల్ గ్రహీత పాల్ డిరక్ వద్ద మ్యాథమెటిక్స్ ట్రిపోస్‌ను అభ్యసించారు.ఆర్.హెచ్.ఫౌలర్ వద్ద సిద్ధాంతపరమైన భౌతికశాస్త్రంలో డాక్టరేట్ కొరకు పనిచేస్తున్న రోజులలో బాబా స్క్యాటరింగ్ అనే సిద్ధాంతాన్ని ప్రపంచంలోని శాస్త్రవేత్తల చేత ఆమోదింప చేశారు.

ఆయన భారత్ కు వచ్చిన సమయంలో దేశంలోని శాస్త్రవేత్తల పరిశోధనలకు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ను స్థాపించాల్సిందిగా జే. ఆర్.డి టాటా ను కోరారు.దానితో టాటా గారు 1945 జూన్ 21 వ తేదీన బాబా గారు డైరెక్టర్ గా నియమించి ఆ సంస్థను ఏర్పాటు చేశారు.

1947 భారత్ స్వాతంత్రం తర్వాత తన మిత్రుడైన జవాహర్ లాల్ నెహ్రూ ను ఒప్పించి 1948 లో అటామిక్ ఎనర్జీ ఆఫ్ ఇండియాను స్థాపించారు.1962 లో విక్రమ్ సారభాయ్ తో కలిసి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ను ఏర్పరిచారు.

తన వారసుడిగా విక్రమ్ సారభాయ్ ను ఇండియన్ న్యూక్లియర్ రీసెర్చ్ లో భాగం చేశారు.తద్వారా తను లేకున్నా విక్రమ్ సారాభాయ్ సహాయంతో భారత్ అంతరిక్ష ప్రయోగాలు కొత్త పుంతలు తొక్కాలని చూశాడు.

1965 లో ఒక రేడియో కార్యక్రమం లో మాట్లాడుతూ భారత్ ప్రభుత్వం అనుమతి ఇస్తే తమ బృందం అటామిక్ బాంబ్ ను సైన్యానికి అందిస్తాం అని చెప్పారు.1966 జనవరి 24వ తేదీన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సదస్సుకు ఆస్త్రియాలోని వీయన్న వెళ్తూ ఫ్లయిట్ ప్రమాదం లో మరణించారు. ఇది అమెరికా సీఐఏ వారే చేసినట్టు 2008 లో వచ్చిన కన్వర్జేషన్ విత్ దా క్రౌ అనే పుస్తకం లో పేర్కొనబడింది. ఈ పుస్తకం రాబర్ట్ క్రౌలి అనే ఒక సీఐఏ ఏజెంట్ సంభాషణల ఆధారంగా రాయబడింది.

హామీ బాబా తన దేశ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయోగాలు ఎక్కడ తమ ఆధిపత్యాన్ని దెబ్బతీస్తాయో అని అగ్రదేశ భయానికి ఆయన మరణించారు.ఈయన చేసిన ఎనలేని కృషికి భారత అణు కార్యక్రమం పితామహుడిగా మరియు పద్మ భూషణ్ తో భారత్ దేశం సత్కరించుకుంది. ఆయన కృషి వల్లే నేడు ఇస్రో ఇన్ని ఘనతలు సాధిస్తూ మనమందరం తలెత్తుకునేలా చేస్తుంది.

సరిహద్దులలో పోరాడే సైనికులకు, దేశ అభివృద్ధి కోసం పోరాడే శాస్త్రవేత్తలకు,దేశం కు ఎదో చేయాలని తపించే ప్రతి వారికి సలాం
జైహింద్.


మరింత సమాచారం తెలుసుకోండి: