* చేతిలో డబ్బు లేకపోతే ఇంట్లో ఉన్న కూరగాయలు తినేసి ఊరుకుంటావ్..జేబునిండా డబ్బు ఉంటే స్టార్ హోటల్‌కు వెళ్లి అవే కూరగాయలు తిని ఆనందిస్తావ్..!

 

* డబ్బు లేని రోజున ....సైకిల్ మీద ఆఫీసుకు వెళతావ్...డబ్బులు ఎక్కువైతే అదే సైకిల్ ఇంట్లోనే ఎక్కి ఎక్కర్‌సైజ్‌లు చేస్తావ్...!

 

* డబ్బులు లేనప్పుడు సంపాదన కోసం చెప్పులు అరిగేలా నడుస్తావ్...డబ్బు ఎక్కువైతే పెరిగిన కొవ్వు కరిగించుకొనేందుకు నడుస్తావ్...!

 

* మనిషీ ... ఓ! మనిషీ!! ఇలా నిన్ను నీవు మోసం చేసుకొనేందుకు ....ఏ రోజునా వెనకడుగు వేయవ్!

 

* డబ్బు లేనప్పుడు కుదురుకొనేందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటావ్ డబ్బు ఎక్కువయినప్పుడు విడాకులు కావాలనుకుంటావ్ ...!

 

* డబ్బు లేనప్పుడు ....నీ భార్య నీ సెక్రటరీ అవుతుంది....డబ్బు ఎక్కువైతే ....నీ సెక్రటరీయే భార్య అవుతుంది....!

 

* డబ్బు లేనప్పడు ....సంపన్నుడిలా నటిస్తావు...డబ్బు ఉన్నప్పడు ....నిరుపేదలా నటిస్తావు...!

 

* మనిషీ... ఓ! మనిషీ!! జీవితంలో ఎన్నడూ ....

సత్యానికి దగ్గరగా ఉండవ్...!

 

* షేర్ మార్కెట్.. అంతా మోసం అని అరుస్తావ్...  అయినా స్పెక్యులేషన్ మానవ్..!

 

* డబ్బు మహా చెడ్డది అంటావ్.. అయినా ....సంపదను పోగుచేయడం మానవ్...!

 

* పదవులు వస్తే అందరికీ దూరం అయిపోతాం అని లెక్చరిస్తావ్ ....అయినా పదవుల వెంటపడతావ్...!

 

* మనిషీ... ఓ! మనిషీ!! నువ్వో చిత్రం!నీవు అనుకున్నది చేయవు.. చేసేది చెప్పవు...!

 

మనిషీ... ఓ!మనిషీ!! 

నువ్వో మహా విచిత్రం!!

 

* జీవితంలో ఏది శాశ్వతం కాదు. మనకు కూడా మరణం ఉందన్న విషయం మరువకూడదు.

 

* అందుకే, బతికనాళ్ళు ఎవరిని ద్వేషించకుండా, అందరిని కలుపుకుంటూ, అందరితో సంతోషంగా జీవిస్తూ, అందరికి ప్రేమను పంచుకుంటూ, అందరి ప్రేమను పొందుతూ.., పెదవిపై ఎల్లప్పుడూ చిరునవ్వు ఉండేలా జీవించమంటున్నాను....

మరింత సమాచారం తెలుసుకోండి: