ప్రభుత్వ బడుల పై సమాజంలో చిన్న చూపుంటుంది. సరైన సదుపాయాలు ఉండవని, పిల్లల భవిష్యత్‌ నాశనం అవుతుందని మధ్యతరగతి వారిలో ఒక నమ్మకం గూడు కట్టుకుంది. కానీ తెలంగాణలోని ఒక అధికారి తన చిన్నారిని అంగన్‌ వాడీ కేంద్రంలో చేర్పి అందరికీ అదర్శంగా మారారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్‌కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తన కూతురు రితికరాజ్‌ను అంగన్‌వాడీ పాఠశాలకు పంపిస్తున్నారు.

పద్నాలుగు నెలల వయస్సుగల రితికరాజ్‌ బెల్లంపల్లి కాంట్రాక్టర్‌ బస్తీలోని అంగన్‌వాడీ పాఠశాలకు వెళ్తుంది. ఐఏఎస్‌ అధికారి అయిన రాహుల్‌ రాజ్‌ చిన్నపుడు తాను కూడా ప్రభుత్వ బడిలోనే చదవారట. ఆయన చదువుకున్న ప్రభుత్వ పాఠశాలను గుర్తు చేసుకుంటూ కూతురును అంగన్‌వాడీ పాఠశాలలో చేర్పించారు.

ఈనెల 19న అంగన్‌వాడీ పాఠశాల గురించి సబ్‌కలెక్టర్‌ సిబ్బందితో వాకబు చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్‌ పద్మ మాట్లాడుతూ సబ్‌కలెక్టర్‌ కూతురును తమ పాఠశాలలో చేర్పించడం వల్ల అంగన్‌ వాడీల మీద గౌరవం పెరుగుతుందని అన్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: