ఎలాంటి సమస్య పరిష్కారానికైనా ఎదో ఒక మార్గం తప్పకుండా ఉంటుంది. అయితే ఆ సమస్య తీవ్ర రూపం దాల్చినపుడు తప్పకుండా సమస్య పరిష్కరించబడే మార్గం కనిపిస్తుంది. ఇలాంటి సంఘటనే జర్మనీలు జరిగింది.  తమతో ప్రేమగా ఉండమని, తమని పట్టించుకోమని, మీరు తప్ప మాకు ఎవరు ఉన్నారు అంటూ మాకు మీ ప్రేమ కావాలంటూ చిన్న చిన్న పిల్లలు సమూహంగా ఏర్పడి రోడ్లపై నిరసన కార్యక్రమం చేపట్టారు. అంతేకాదు ఈ పిల్లలందరికీ నాయకత్వం వహించినది కూడా ఏడేళ్ళ బాలుడు కావడం ఇక్కడ మరొక విశేషం. వివరాలలోకి వెళ్తే..

 Related image

అప్పుడెప్పుడో వచ్చిన దేవుళ్ళు సినిమాలో ఆలోచించండి ఓ అమ్మా నాన్నా ఏమి చెప్పగలం మీకు ఇంతకన్నా అంటూ నిత్యం తిట్టుకుంటూ , పిల్లల్ని పట్టించుకోకుండా  ఉండే తమ తల్లి తండ్రులని కలపడం కోసం ఆ చిన్నారులు చేసిన ప్రయత్నమే జర్మనీలో ఓ ఏడేళ్ళ పిల్లాడు చేశాడు. అయితే ఇక్కడ తమ తల్లి తండ్రుల నుంచీ తమని వేరు చేసే స్మార్ట్ ఫోన్ పై ఈ బుడతడు నిరసన యుద్ధం ప్రకటించాడు.

 Image result for germany 7 years old boy emil

పెరుగుతున్న సోషల్ మీడియా ప్రభావంతో  కుటుంభాలకి కుటుంభాలు చెల్లా చెదురు అయ్యిపోతున్నాయి. ఎవరి చేతులో చూసిన స్మార్ట్ ఫోన్ కనిపిస్తూనే ఉంటుంది. చివరికి ఫ్యామిలీ తో హ్యాపీ గా గడపాల్సిన సమయంలో కూడా స్మార్ట్ ఫోన్ కి బానిసలుగా బ్రతుకుతున్నారు. ముఖ్యంగా తల్లి తండ్రులు ఇద్దరూ చేతిలో స్మార్ట్ ఫోన్ తోనే కనిపిస్తున్నారు. పిల్లలతో సరదాగా గడిపే సందర్భాలే తక్కువై పోతున్నాయి. దాంతో పిల్లలు ఎవరితో సరదాగా గడపాలో తెలియక, సతమతమవుతున్న పరిస్థితులు ఈ మధ్యకాలంలో లెక్కకి మించి పోతున్నాయి.

 Image result for germany 7 years old boy emil

ఇలాంటి పరిస్థితినే ఎదుర్కున్న ఓ బాలుడు తనలా ఇబ్బందులు పడుతున్న కొంతమంది పిల్లలని పోగేసి అమ్మా, నాన్నా స్మార్ట్ ఫోన్ వదలండి, ప్రేమని పంచండి అంటూ ఓ ఉద్యమమే చేపట్టాడు. అంతేకాదు ఈ ఉద్యమానికి నేతృత్వం వహించాడు. ఫ్లకార్డులతో నిరసనలు తెలుపుతూ జర్మనీ వీధుల్లో తిరగడం ఎంతో మందిని కదిలించింది. ఈ బుడతడి నిరసనకి కొంతమంది పెద్దలు కూడా తోడయ్యారు. దాంతో ఈ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎంతో మంది నెటిజన్లు పిల్లల్ని పట్టించుకోని తల్లి తండ్రులు ఎందుకు కన్నారు అంటూ  కామెంట్స్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: