ప్రతి మనిషిలోనూ సహజంగా ఒత్తిడి అన్నది కామన్.  ఉద్యోగస్తుల్లో ఒత్తిడి ఉంటుంది.  కానీ, జీతానికి అలవాటుపడిపోయిన జీవితం కావడంతో వీరు ఆ ఒత్తిడి నుంచి బయటపడలేకపోతున్నారు.  ఒత్తిడి మధ్య పనిచేయడం వలన పెద్దగా ఫలితాలు కనిపించవు.  తప్పని సరి పరిస్థితుల్లో అలా పనిచేస్తూనే ఉంటారు.    


మనిషిపై ఉండే ఒత్తిడి వలన జీవితంలో ఎఫెక్ట్ పడుతుంది.  ఇది సహజమే.  ఒత్తిడితో కుటుంబాన్ని నడపలేరు.  అదే కొంతమేర జీవితంలో సక్సెస్ అయ్యి.. ఏదైనా బిజినెస్ చేస్తుండే వ్యక్తులను తీసుకుంటే.. వారు నెలకు ఒకసారి ప్రయాణం చేస్తుంటారు.  వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది.  వివిధ రకాల వ్యక్తులతో మాట్లాడటం వలన ఒత్తిడి కొంతమేర తగ్గుతుంది.  


అందుకే చాలామంది ఒత్తిడి నుంచి దూరం కావడానికి ప్రయాణాలు చేయమని సలహా ఇస్తుంటారు.  సెలెబ్రిటీలు ఎందుకు ప్రయాణాలు చేస్తుంటారు అంటే ఇదే కారణం.  తరచుగా ప్రయాణం చేయడం వలన పని ఒత్తిడి అనే ఫీలింగ్ కలగదు.  పైగా పని పూర్తయ్యాక తప్పకుండా మరో ప్లేస్ కు వెళ్ళాలి అని లక్ష్యంగా పెట్టుకుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయాణం చెయ్యొచ్చు.  


ప్రయాణాలు ఒక్కటే కాదు.. తరచుగా కొత్త వ్యక్తులతో మాట్లాడటం కూడా ఒత్తిడి నుంచి దూరం కావొచ్చు. అందుకే రోజుకో కొత్త వ్యక్తితో పరిచయం పెంచుకోవాలి అంటారు.  సో, ఒత్తిడిని నుంచి బయటపడటానికి ఇలాంటి మార్గాలను అనుసరించవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: