ప్రకటన – కనిపించుట లేదు

పేరు మేఘం

ఊరు ఆకాశం

వయసు 480కోట్ల సంవత్సరాలు(సుమూరు)

ఎత్తు నిత్యం మార్చుకుంటుంది


ఆర్యా!

మబ్బు మేఘం అని అనేక పేర్లతో పిలువబడే మేఘం గత ఆరు నెలల నుండి కనిపించడంలేదు.

మేఘమా నీకోసం చంటిబిడ్డలు బెంగ పెట్టుకువ్నారు ముసలి వారు మంచం పట్టారు.ప్రజలు నీవు దూరమై దూర ప్రయాణాలు చేస్తూనే పరలోకప్రయాణం చేస్తున్నారు.నేలలు బీటల నేత్రాలను వెడల్పు చేసి నీకోసం ఎదురు చూస్తున్నాయి. విత్తనాలు మొక్కలుగా మొలకెత్తలేక బిక్కుబిక్కు మంటూ దిక్కులు చూస్తున్నాయి.నీవులేవని తెలిసిన సూర్యుడు మామీద దాడిచేస్తున్నాడు.

వాయుదేవుడు నిప్పుల వర్షం కురిపిస్తన్నాడు.పక్షులు పిట్టల్లా రాలిపోతున్నాయి.రైతన్న నీకోసం కన్నీరు కారుస్తున్నాడు. నీవు ఏర్పడటానికి కారణమైన చెట్లని నరికేస్తున్నామని కోపంతో అలిగి వెళ్ళిపోయావని మాకు తెలుసు. మాతప్పును క్షమించు.ఈసారికి మన్నించు.చెట్లను ప్రతిచోట పెంచడమే కాదు ఇకపై ఏచెట్టుమీద గొడ్డలి పడనివ్వం.

మేఘమా నీకోసం పేపరులలో టీవీలలో ప్రకటనలు ఇచ్చాం. ప్రతీచోటా గాలిస్తున్నాం.పోలీసు స్టేషనులలో కంప్లయింటు ఇచ్చాం .వీలయితే క్షమించు లేదా కుంభవృష్టి కురిసి శిక్షించు. దయచేసి నీకోసం ఎదురుచూస్తున్న మేము ఉన్నామని గుర్తించు.గుర్తించు..ఉపగ్రహ రక్షకభటులారా'ప్రపంచ ప్రజలారా మామేఘం ఆచూకీ తెలిసిన తెలుగు ప్రజలకు సమాచారం అందించినచో తొలకరి జల్లులు బహుమతిగా ఇవ్వగలవారము.

ఇట్లు

తెలుగు ప్రజలు.

( వాట్సప్ సందేశం ‌)

మరింత సమాచారం తెలుసుకోండి: