స‌హ‌జంగా చాలామంది మహిళలకు మేకప్ అంటే పిచ్చి. అది లేకుండా ఇంటి నుంచి బయటకే రారు. తాము అందంగా కనిపించాలన్న తాపత్రయంతో తరుచూ మేకప్ వేసుకుంటూనే ఉంటారు. అయితే అలాంటివారు గర్భం దాల్చినా మేకప్ వేసుకోవడం మానరు. గర్భిణి స్త్రీలు మేకప్ వేసుకోకూడదని చెబుతుంటారు. సాధారణంగా గర్భిణులను జలుబు, దగ్గు వంటి చిన్నచిన్న సమస్యలకు మందులు వాడొద్దని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే కడుపులో ఉండే చిన్నారిపై ఈ మందులు తీవ్ర ప్రభావం చూపుతాయి. 


తాజాగా ఈ జాబితాలో లిపిస్టిక్‌లు, మాయిశ్చరైజర్లు, ఇతర సౌందర్య సాధనాలు చేరాయి. గర్భిణులు వీటిని వినియోగిస్తే, పుట్టే పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేందుకు అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం ఓ ప‌రిశోధ‌న చేసింది. 11 ఏళ్ల వయసున్న బాలబాలికల్లో శరీర కదలికలకు సంబంధించి ‘బాట్‌-2’ పరీక్షలను నిర్వహించింది. వీరిలో కొందరు చురుగ్గా లేకపోవడం, మరికొందరు తమ పనులను తామే చేసుకోలేకపోవడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ విషయమై ఆరా తీయగా ఈ పిల్లల తల్లులు గర్భవతులుగా ఉన్న సమయంలో సౌందర్య సాధనాలను విరివిగా వాడినట్లు తేలింది.


అయితే ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఫాక్టర్‌-లిత్వాక్‌ మాట్లాడుతూ.. గర్భధారణ సమయంలో కొన్ని ప్రత్యేకమైన బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం గర్భిణి స్త్రీలకు సురక్షితం కాదు. బ్యూటీ ప్రొడక్ట్స్‌లో వాడే కొన్ని రసాయనాలు మహిళల పునరుత్పత్తి వ్యవస్థ మీద దుష్పభావం చూపుతాయి. అందువల్ల ఈ మేకప్ వస్తువులు వాడే వారికి పుట్టే పిల్లలు తక్కువ బరువుతో లేదా పుట్టుక లోపాలతో ఉంటారని చెప్పారు. అందువల్ల గర్భిణి స్త్రీలు కాస్మోటిక్స్ వస్తువులు వాడకపోవడమే మేలు.


మరింత సమాచారం తెలుసుకోండి: