వర్షాకాలం అనగానే చిటపట చినుకులు, ఇంద్రధనస్సులు, వేడివేడి పకోడిలు, వెచ్చని టీ, కాఫీలు మాత్రమే కాదు. చిరాకు తెప్పించే బురద, నిల్వ ఉండే నీరు, వాటిలో పెరిగే దోమలు, తడి వల్ల ఏర్పడే చిత్తడి అక్కడ పెరిగే సూక్ష్మ క్రిములు వాటి వల్ల వచ్చే బుబ్బులు ఇవన్నీ కూడా మోసుకుని వస్తుంది.


వేసవి తాపాన్ని, భూమాత దాహాన్ని తీర్చటానికి చిరు జల్లులతో, గంభీరంగా ఉరుముతూ భారీ వర్షాలతో ముంగిళ్లని తడుపుతూ వానాకాలం వచ్చేసింది. వర్షాకాలం ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త పడవలసిన సమయం. ఎన్నోరకాల వ్యాధులు తేలికగా ప్రబలే అవకాశం ఉంది. వాటి నుంచి కాపాడుకోవాడానికి తీసుకోవాల్సిన ఆహార జాగ్ర‌త్తులు చూద్దాం..


- వేపాకుల పొడిని తేనెతో క‌లిపి ఉద‌యం సాయంత్రం పావు స్పూన్ సేవిస్తే జ‌లుబు, ద‌గ్గు త‌గ్గిపోతాయి. 


- తుల‌సి గింజ‌ల‌ను నాన‌బెట్టి పంచ‌దార క‌లిపి తాగితే అతి వేడి త‌గ్గుతుంది. అంతేకాదు ఆరోగ్యం కూడా అందిస్తుంది.


- ప్ర‌తిరోజూ వెల్లుల్లిపాయ‌ల‌ను నేతిలో గాని నువ్వుల‌నూనెలో గాని వేయించి 2 లేక 3 రేఖ‌ల‌ను తింటుంటే మూత్రాశ‌యంలో రాళ్లు క‌రుగుతాయి.


- ఉసిరిర‌సం ప‌టిక‌బెల్లంతో సేవిస్తే మూల‌ వ్యాధులు న‌యం అవుతాయి.


- సునాముఖి ఆకు చూర్ట‌ము పావు తుల‌ము, ఆర‌స్పూన్ తేనెలో క‌లిపి ప్ర‌తి రోజు సేవిస్తే వ‌ర్షాకాలంలో నీర‌సంగా ఉండేవారికి బ‌లాన్ని చేకూర్చుతుంది.


- మిరియాల చూర్ణంలో నేల ఉసిరిపోడిని క‌లిపి వాడితే రుతుబాధ‌లు నివృత్తి అవుతాయి. 


- నీరు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల శరీరానికి తగినంత తేమ అందదు మరియు శరీరంలోని వ్యర్థాలు తొలిగిపోవు. కాబట్టి సీజన్ ఏదైనా ప్రతి రోజూ తగినంత నీరు తాగడం చాలా అవసరం.


- వర్షాకాలంలో మరో ముఖ్యమైన హెల్త్ కేర్ టిప్, ఆయిల్ ఫుడ్ ను తినకుండా ఉండటమే. ఆయిల్ ఫుడ్ జీర్షం అవ్వడం కష్టం మరియు శరీర బరువు కూడా పెంచేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: