స‌హ‌జంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని కాపాడుకోవటంలో పోషకాహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. జీవనశైలి అలవాట్లు సక్రమంగా లేకపోవడం, సకాలంలో భోజనం చేయకపోవడం మరియు వ్యాయామం చేయకపోవడం మూలంగా అనేక వ్యాధులు తలెత్తడంతో పాటుగా, తగినంత నిద్ర కూడా లభించదు. క్రమంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దేహం ఆరోగ్యవంతంగా ఉండటానికి రోజులో కనీసం ఆరు గంటలపాటు నిద్ర అవసంమ‌ని చెబుతున్నారు.


పడుకునే ముందు క్రమం తప్పకుండా మద్యం సేవించే అలవాటును కలిగి ఉండడం, లేదా కెఫిన్ ఆధారిత పానీయాలు తీసుకోవడం వంటివి కూడా నిద్రలేమికి అత్యంత సాధారణ కారణాలుగా చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో, సాధారణ జలుబు జ్వరాలకు తీసుకున్న ఔషధాలు కూడా నిద్రలేమికి కారణాలుగా ఉంటాయి. అయితే మీ ఆరోగ్యంపై నిద్రలేమి ఎటువంటి ప్రతికూల ప్రభావాలను కలుగజేస్తుందో తెలుసుకుందాం.


- ప్రొటెక్టివ్ సైటోకైన్స్ మరియు ఇన్ఫెక్షన్ ఫైటింగ్ యాంటీబాడీస్ ఉత్పత్తి తగ్గడం మూలంగా, మీ శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ రాజీ పడుతుంది. నిద్ర సమయంలో, మానవ శరీరం దాని రోగనిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుంది. కానీ నిద్రలేమి మూలంగా మీ శరీరానికి ఆ అవకాశం ఉండదు.


- నిద్రలేమి మూలంగా భావోద్వేగ రుగ్మతలు తలెత్తడం మాత్రమే కాకుండా, తీవ్రమైన మానసిక మరియు నరాల వ్యాధులకు కూడా కారణంగా మారుతుంది. 


- అలాగే కొన్ని సందర్భాల్లో నిద్రలేమి మూలంగా ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి.


- నిద్ర లేకపోవటం వ‌ల్ల అధిక రక్తపోటు, స్ట్రోక్, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు వ‌స్తాయి.. తగినంత నిద్రను పొందని వారిలో ఇది అత్యంత సాధారణమైన విషయంగా ఉంటుంది.


- నిద్రలేమి కూడా ఆకలి విపరీతంగా పెరగడానికి గల ప్రధాన కారణం. నిద్రలేని రాత్రులలో మిమ్మల్ని మీరు యాక్టివ్ గా ఉంచడానికి చేసే ప్రయత్నాలలో భాగంగా అనారోగ్యకరమైన స్నాక్స్, అకాల ఆహారపు అలవాట్లు మొదలైనవి ఉంటాయి. ఇటువంటి చర్యలు కూడా హార్మోన్ స్థాయిల హెచ్చుతగ్గులపై ప్రభావాన్ని కలిగి ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: