స‌హ‌జంగా చాలా మంది టీవీల ముందు, కంప్యూటర్ల ముందు గంటల తరబడి గడపటం వల్ల క్రమంగా కంటి సమస్యల భారిన పడతారు. సరైన నిద్రలేని కారణంగా కళ్లకింద నల్లటి చారలు, కంటిచూపు మందగించటం, కళ్లలో మంటలు, కళ్లలోంచి నీరు కారటం.. వంటివన్నీ క్రమంగా ఒకదాని తరువాత ఒకటిగా వేధిస్తాయి. ఇలాంటి సమస్యల పాలవకుండా.. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే గాకుండా, మిలమిలా మెరిసే అందమైన కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.


క‌ళ్ల‌కు ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా వాటిని నిర్ల‌క్ష్యం చేయ‌రాదు. ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, ఫోన్‌, కంప్యూట‌ర్ ముందు గ‌డిపే వారు క‌ళ్ల‌కు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. వీటిని ఉప‌యోగించేవారు రోజుకు 10శాతం మంది ప్రొఫెష‌న‌ల్స్ పొడిక‌ళ్లు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.


- ఎక్కువ సేపు కంప్యూటర్ పనిలో నిమగ్నమయ్యే వారు తప్పని సరిగా యాంటి రిఫ్లెక్ట్లింగ్ కోటింగ్ గ్లాసెస్ వాడాలి. ఎండలో వెళ్లి వచ్చిన తరువాత కంటిని నీటితో శుభ్రం చేసుకోవాలి.


- కూలర్స్, ఏసీ కి దగ్గరగా కూర్చోకూడదు. ఫ్యాన్‌గాలి నేరుగా కళ్ళపై పడే విధంగా ఉండకూడదు. వీటి వ‌ల్ల క‌ళ్ల‌కు హాని క‌లిగిస్తాయి.


- ముఖ్యంగా క‌ళ్ల‌కు విశ్రాంతిని ఇవ్వాలి. క‌ళ్ల స‌రిప‌డా నిద్ర లేక‌పోతే కంటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉంటాయి.


- క‌ళ్ల శుభ్ర‌త‌కు చ‌ల్ల‌టి నీళ్లు ఉప‌యోగించాలి. చ‌ల్ల‌టి నీటిలో వ‌స్త్రాని ముంచి క‌ళ్ల‌పై పెట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్ల మంట‌లు, పొడిబార‌డం, ఎర్ర‌బ‌డ‌డం త‌గ్గుతాయి.


- కంటికి ఉప‌యోగ‌ప‌డేవాటిలో ఉసిరి ఒక‌టి. దీని వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డ‌డం కోసం ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఉసిరిని ఆహారంలో భాగంగా తీసుకుంటే చాలా మంచిది.


- క‌ళ్ల వాపు, బ్యాక్టీరియా నుంచి క‌ళ్ల‌ను ర‌క్షించుకోవ‌డం కోసం టీ బ్యాగ్‌ను ఫ్రీజ‌ర్‌లో పెట్టి ఆ త‌ర్వాత కంటిపై ఆలీవ్ ఆయిల్ రాసుకుని.. ఆ గ‌డ్డ క‌ట్టిన టీ బ్యాగ్‌ను కంటిపై పెట్టుకోవాలి. ఇది బాగా ఉప‌యోగప‌డుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: