ఇటీవల కాలంలో నిండా పాతికేళ్లు రాకముందే జుట్టు ఊడిపోవడం, తెల్లబడిపోవడం సమస్యలతో యువతరం సతమతమవుతోంది. అబ్బాయిలేమో బట్టతల వచ్చేసిందని నలుగురిలోకి వెళ్లేందుకు ఆలోచిస్తుంటే, అమ్మాయిలేమో జుట్టు పలుచగా మారిపోయిందని డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. అందుకు ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు, జీవనశైలి, నిద్రలేమి, పొల్యూషన్, హెరిడిటి, కొన్ని రకాల మెడికల్ ట్రీట్మెంట్స్.. 


అయితే జుట్టు సమస్యలతో బాధపడేవారు ఆందోళన చెందకుండా ఆలివ్ అయిల్‌ వాడితే పరిష్కారం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.


- నాలుగు చుక్కల అల్లం రసంలో కొద్దిగా ఆలివ్ నూనె చేర్చి జుట్టు కుదళ్లకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు దృఢంగా మారతాయి. 


- ఆలివ్‌ నూనెలో ఉండే విటమిన్‌-ఇ, ఇతరత్రా యాంటీ ఆక్సిడెంట్లు తలమీద ఉన్న చర్మాన్ని మృదువుగా చేస్తాయి. దాంతో మర్దన చేయడం వల్ల జుట్టు పొడిబారిపోవడం, తెల్లబడటం, వంటి సమస్యలు తగ్గడంతోబాటు కుదుళ్లు దృఢంగా మారతాయి. 


- రసాయనాలు కలిసిన షాంపూలు వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. అలాంటప్పుడు ఆలివ్‌ నూనెతో బాగా మర్దన చేసి అరగంటసేపు తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేయడం వల్ల ఫలితం ఉంటుంది. 


- ఆలివ్‌ ఆయిల్‌లో కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి, తలకు రాచుకుని కాసేపటి తర్వాత తలస్నానం జుట్టు మెత్తగా మారుతుంది. త్వరగా రాలదు కూడా. 


- ఆలివ్ ఆయిల్‌లో వెల్లుల్లి పొట్టును కాల్చిన పొడిని కలిపి తలకు రాసుకుంటే జుట్టు త్వరగా తెల్ల‌ప‌డ‌కుండా ఉంటుంది.


- ఆలివ్‌ ఆయిల్‌ను వేడిచేసి వెంట్రుకల కుదుళ్ళకు పట్టించి 10-15 పదిహేను నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: