ఒకప్పుడు బాలీవుడ్ లో ముద్దు సీన్లకు ఫేమస్ ఎవరు అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు ఇంరాన్ హష్మి. అయితే తాజాగ ఇమ్రాన్ హష్మీ ఓ సంచలన విషయాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.గతంలో తాను ఒక పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగా ఇమ్రాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పుగా దాన్ని భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు.


తనకు పెళ్లైన విషయం ఆ అమ్మాయి ఇమ్రాన్ హష్మీ దగ్గర దాచిపెట్టిందనీ పేర్కొన్నాడు. తను నటించిన మర్డర్ చిత్రంలో సన్నివేశం తన జీవితంలో కూడా జరగడం అసలు ఊహించలేదని చెప్పాడు. అనుకోకుండా అది కాస్తా జరిగిందని, ఇక ఆ విషయంలో తాను ఇప్పటికీ గిల్టీ గానే ఫీలవుతున్నాననీ అన్నాడు.

ఆ అమ్మాయ్ విషయంలో అనుకోకుండా తప్ప్పు చేశానని,ఆమెతో ఉన్న సమయంలో ఆమె భర్త చూశాడని,అప్పుడు పెద్ద గొడవ జరిగిందని ఆయన వివరించాడు.జీవితంలో దానిని తలచుకున్న ప్రతిసారి తన మీద తనకే అసహ్యం వేస్తోందని తెలిపాడు.ఇదిలా ఉండగా తన జీవితంలో జరిగిన తప్పును సెలబ్రెటీస్ స్టేటస్ లో ఉండే ఇమ్రాన్ హష్మి ఇలా భారీ బహిర్గతం చేయడంతో పలువురు నెటిజన్ లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: