అందమైన భామలను చూస్తే బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు.. అని నానుడి.. అందుకే చాలా మంది తమ కామవాంఛలు తీర్చుకునేందుకు పోర్న్ వైబ్ సైట్లు చూస్తుంటారు. అయితే ఇలా తాము పోర్న్ వెబ్ సైట్లు చూస్తున్న విషయం ఎవరికీ తెలియకూడదనే అనుకుంటారు.


అందుకోసం వెబ్ బ్రౌజర్లలోని ఇన్ కాగ్నిటో ఆప్షన్లను ఎంచుకుంటారు. సాధారణంగా ఈ పద్దతిలో గెస్ట్ లాగిన్ ద్వారా ఇంటర్ నెట్ చూస్తే హిస్టరీ రికార్డు కాదు.. అందువల్ల తాము ఏ వెబ్ సైట్ చూశామో ఎవరికీ తెలిసే అవకాశం ఉండదని భావిస్తుంటారు.


కానీ ఇలా చేయడం పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగడం వంటిదే అంటున్నారు సాంకేతిక నిపుణులు. గూగుల్, ఫేస్ బుక్ వంటి కంపెనీలు సహా పలు బ్రౌజింగ్ సంస్థలు తమ వినియోగదారుల ట్రాకింగ్ రికార్డులను పలు సంస్థలకు అమ్ముకుంటున్నాయట. మైక్రోసాఫ్ట్, కార్నెగీ మెలన్ యూనివర్శిటీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలిందట.


మరింత సమాచారం తెలుసుకోండి: