తెలుగులో గాయనిగా, నటిగా తన పాటలతో సంగీత ప్రియులకు అద్భుతంగ ఆహ్లాదం కలిగించిన మొట్టమొదటి పాప్ ఆల్బం సింగర్ మరెవరో కాదు స్మిత. శ్రోతలను అలరించడం లో వివిధ రూపాలలో పాటలను మైమరచి పోయేలా చేయడంలో తన సైలే వేరు. ఒక్క తెలుగు లోనే కాక 9 భాషల్లో తాను పాటల పాడిన ఘనతను సాధించడం గొప్ప విషయం. ఆమె పాప్ సింగర్ గానే కాకుండా భక్తి సంగీతంలోనూ తన మధురమైన గానంతో అథ్యాత్మిక భావన కల్పించడంలో స్మిత పాత్ర మరువలేనిది.



స్మిత మొదటి సారిగా మైక్ పట్టుకొన్న క్షణం 1996 లో పాడుతా తీయగా అనే ప్రోగ్రాం లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె తన పాటలతో ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్నారు. స్మితా 1999 లో ఇండస్ట్రీ లోకి మొట్టమొదటి సారిగా అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన ఇరవై ఏళ్ల కెరియర్ ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు చాలామంది ప్రముఖులు ట్విట్టర్ ద్వారా అభినందనలను తెలిపారు.తన సంగీత ప్రయాణం 20 పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లో ఈ నెల 22 న "ఎ జర్నీ 1999-2019"అనే పేరుతో ఒక వేడుకను నిర్వహిస్తున్నారని సమాచారం.



ఇలా అభినందనలు తెలిపిన వారిలో మన మాజీ ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుగారు ఉండటం విశేషం.ఆయన అభినందనలను తెలుపుతూ ఓ ప్రకటన కూడా విదుదల చేశారు. తెలుగులో ప్రసిద్ధి చెందిన గాయిని నర్తకిగా గుర్తింపు పొందిన స్మిత,వల్లూరుపల్లి తెలుగులో మొట్టమొదటి పాప్ ఆల్బం రూపొందించటం ఎంతో గర్వంగా ఉందని ఆయన తెలిపారు. చంద్రబాబు గారు చేసిన ట్వీట్ పై స్మిత స్పందిస్తూ ఇది నిజంగా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించే సందర్భం అని తనకి ట్వీట్ చేసి తనకి ట్వీట్ చేసినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ట్యాగ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: