‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు..మహా పురుషులవుతారూ’ అనే పాట గుర్తుంది కదా.. కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి కష్టాలైనా ఇట్టే అధిగమించ వొచ్చు. దానికి మానసిక వైకల్యం కూడా అడ్డు కాదని ఎంతో మంది నిరూపించారు.  అంగ వైకల్యం, మానసిక వైకల్యంతో బాదపడుతున్న వారు..ఇక ఏమీ చేయలేరని నిరుత్సాహ పడ్డవారు సైతం తామేంటో నిరూపించి సమాజానికి సవాల్ విసిరారు. 
Image result for supermodel-forever-pranav-bakhshi
తాజాగా ఓ యువకుడు చిన్ననాటి నుంచి ఆటిజంతో బాధపడ్డా..ఇప్పుడు తల్లి ప్రోత్సాహంతో పట్టుదలతో స్టార్ మోడల్ గా ఎదిగాడు.  వివరాల్లోకి వెళితే..  డెహ్రడూన్‌కు చెందిన ప్రణవ్ బక్షి అందరు పిల్లలో చలాకీగా ఉన్నా వారి సంతోషాలు మాత్రం పంచుకోలేడు..ఎందుకంటే అతడు చిన్ననాటి నుంచి ఆటీజం తో బాధపడేవాడు. అమ్మ పిలిచినా పలకరు...ఒకవేళ పలికినా చెప్పింది వినరు... మాటలు కూడా సరిగా రావు అంతెందుకు పాతికేళ్లు వచ్చినా పసిపిల్లల్లానే ఉంటారు.  ఈ వ్యాధితోనే బాధపడుతున్న బక్షికి మరో సమస్య కూడా ఉంది అదే ఎకోలలియా.

అంటే చెప్పిన మాటనే పదే పదే చెబుతుంటాడు. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కన్నతల్లికి ముద్దు బిడ్డే..అందుకే అతన్ని కంటికి రెప్పలా సాకింది.  చిన్నతనంలో ముద్దుగా బొద్దుగా ఉన్న ప్రణవ్ అమ్మా అని ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూసింది..రెండేళ్లైనా ఉలుకూ లేదు, పలుకూ లేదు.. దాంతో ఆమెకు అనుమానం వచ్చి  హాస్పిటల్‌లు తీసుకువెళితే మానసిక ఎదుగుదలలో లోపం అని చెప్పారు డాక్టర్లు. అంత ముద్దుగా ఉన్న తన చిన్నారికి మాటలు రాకపోవడం..వినకపోవడం ఏంటా అని ఆశ్చర్యం వేసింది..కన్నీళ్లు దిగమింగింది. 
Image result for supermodel-forever-pranav-bakhshi
ఆనాటి నుంచి ప్రణవ్‌కి అన్నీ తానై నిలిచింది..ప్రత్యేక పాఠశాలలో చదివించేది, ప్రతీ చిన్న విషయం గురించి అతనికి చెబుతూ ఆ చిన్నారిలో విజ్ఞానాన్ని పెంపెందేలా చేసింది. ప్రణవ్ కి పదహారేళ్ల వయసులో ఓ మాల్ కి వెళ్లింది అనుపమ.  ఆ షాప్ యజమాని యూత్ తో ఓ ర్యాంప్ వాక్ ఏర్పాటు చేశాడు.  అయితే ప్రణవ్ ర్యాంప్ పై వస్తున్న వారిని చూసి చప్పట్లు కొడుతూ..తాను కూడా వెళ్తానని అన్నాడు. మొదట సంశయించినా యజమానితో మాట్లాడి తన కొడుకును కూడా ర్యాంప్ వాక్ చేయించింది. 
Image result for supermodel-forever-pranav-bakhshi
అంతే స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్న తన కొడుకు ని వీడియో తీసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ వీడియో పదే పదే చూడటం తెగ సంబరపడిపోయింది అనుపమ. ఆ క్షణమే నిర్ణయించుకుంది కొడుకుని మోడల్ చేయాలని. అప్పటి నుంచి కనిపించిన ప్రతి మోడలింగ్ ఏజెన్సీకి కొడుకు పరిస్థితిని వివరిస్తూ మోడల్‌గా అవకాశం ఇమ్మని కోరింది. ప్రణవ్ గురించి విన్నవారు అంత రిస్క్ తీసుకోలేమని ముఖంపైనే సమాధానం ఇచ్చారు..కొంత మంది తర్వాత చూస్తామని చెప్పారు. 

అయినా ఆమెలో పట్టుదల మాత్రం పోలేదు...చివరికి ఆమె ప్రయత్నం ఫలించి మోడల్ నీంజా సింగ్‌ నుంచి కాల్ వచ్చింది. ఢిల్లీలో నింజా మోడల్ మేనేజ్‌మెంట్ సంస్థని నడుపుతోంది. ఆమె కాల్‌తో తల్లీకొడుకులిద్దరూ ఢిల్లీ బయలు దేరారు. అక్కడ అనేక ఫోటో షూట్లు చేశాక ప్రణవ్‌కి మోడల్‌గా అవకాశం ఇచ్చింది నీంజా.  ప్రణవ్‌తో యూఎస్ పోలో, యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్ వంటి బ్రాండెడ్ దుస్తుల మోడలింగ్‌ను చేయించింది. అంతే కాదు తన కొడుకు అంత పెద్ద మోడల్స్ తో కలిసిన పనిచేయడం..వారితో సమానం పోటీ పడటం చూస్తుంటే అనుపమ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అయితే ప్రణవ్ ని మోడల్ గా సెలెక్ట్ చేయడానికి ఓ కారణం ఉందట.. ఆస్ట్రేలియాకు చెందిన మేడెలిన్ స్టువర్ట్ అనే సూపర్ మోడల్‌కు డౌన్స్ సిండ్రోమ్ అనే వ్యాధి వుంది. అయినా ఆమె న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌, ప్యారిస్ ఫ్యాషన్ వీక్, లండన్ ఫ్యాషన్ వీక్.. ఇలా చాలా షోలలో ర్యాంప్ వాక్ చేస్తోంది. ప్రణవ్ సెలక్ట్ చేయడానికి కారణమం ఆమే అని వివరించింది నీంజా. ప్రస్తుతం ప్రణవ్ ఎంతో కష్టపడి స్టార్ మోడల్ గా ఎదిగేందుకు కృషి చేస్తున్నాడు.  ఆటీజం ఉందని అక్కడే ఉంటే జీవితం అక్కడే ఆగేది..కానీ ప్రణవ్ అతని తల్లి అనుపమ కృషి పట్టుదల ముందు ఆటీజం అనే మానసిక వ్యాధి తోక ముడిచింది.



మరింత సమాచారం తెలుసుకోండి: