అధిక మానసిక ఒత్తిడి, హైపర్ టెన్షన్ మానవ శరీర ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. గుండెపోటు, గుండె నొప్పి వంటి ప్ర‌మాదాల‌ను తగ్గించుకోవాలంటే మనం రోజు వారి ఆహారంలో హైపర్ టెన్ష‌న్‌ తగ్గించే ఆహారపదార్థాలు చేర్చుకోవాలి. అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్ కొన్ని తీవ్రమైన పరిస్థితుల కారణంగా వస్తాయి. 


ముఖ్యంగా ఊబకాయం, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యం సేవించడం, వ్యాయామం చేయకపోవడం, పిల్లలు పుట్ట‌కుండా మాత్ర‌లు మింగ‌డం, నొప్పి తగ్గించే మాత్రలు, అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, అధిక ఒత్తిళ్లకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీ, జ్ఞాపకశక్తి, లైంగిక‌త్వాల‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే దీని నుంచి యోగ ఆస‌నాల‌తో చెక్ పెట్టండిలా... 


- బాలాస‌నం: రక్తపోటు కారణంగా తరచుగా ఆందోళన, కోపం వస్తూ ఉంటాయి. పిల్లల యొక్క భంగిమలో ఆందోళన అనవసరమైన అయోమయం తగ్గి మనస్సు ప్రశాంత‌త‌కు  ఒత్తిడి త‌గ్గ‌డానికి సహాయపడుతుంది. శ‌రీరంలోని విష‌ప‌దార్ధాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంతో సహాయపడుతుంది.


- శ‌వాస‌నం: విశ్రాంతి కోసం శవాసనం చాలా బాగా పనిచేస్తుంది. శవాసనం రక్తపోటును తక్కువ‌గా ఉంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. కండరాల ఉద్రిక్తత నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.


- సేతుబంధం: ఈ సేతుబంధు ఆసనం వంతెన భంగిమలో ఉంటుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఉద్రిక్తతలను తగ్గిస్తూ  చురుకుదనాన్ని పెంచుతుంది.


- సుఖాసనం: సుఖాసనం వంటి కూర్చునే భంగిమలు గుండెపై ఉన్న ఒత్తిడిని తగ్గించి రక్తపోటు చికిత్సలో సహాయ పడతాయి. ఈ ఆసనం మనసు ఉధృతిని త‌గ్గించి శ‌రీర‌ విశ్రాంతికి ఉపయోగపడుతుంది.


- ప్రాణాయామం: యోగ సాధనలో ప్రాణయామం అనేది మెదడుకు ప్రశాంతతను కలిగించే గొప్ప మార్గం. అనులోమ, విలోమ ప్రాణాయామం ఆందోళన, హాని, గుండె రేటును సాధారణంగా ఉంచుతుంది. అధిక రక్తపోటును తగ్గించడం, రోగనిరోధక వ్యవస్థ, ఎండోక్రైన్ వ్య‌వ‌స్థ‌ల‌ను త‌ట‌స్థీక‌రిస్తుంది.


- ఆధోముఖ ఆసనం: ఆధోముఖ ఆసనం  భంగిమ‌ చాలా గొప్పది. ఇది ఒత్తిడి, ఉద్రిక్తత నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.


- పశ్చిమోత్తాసనం:  రక్తపోటుతో బాధపడుతున్న వారిలో ధమనులు అణిచివేసే అవకాశాలు ఎక్కువ. ఇది క్రమంగా గుండెపోటు, గుండె నొప్పులకు దారితీస్తుంది. దీనికి మంచి పరిష్కారంగా పశ్చిమోత్తాసనం ఉంది. ఇది సౌకర్యవంతంగా ఉంచడం ద్వారా సహజంగానే రక్తపోటును తగ్గిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: