స‌హ‌జంగా అందంగా, య‌వ్వ‌నంగా ఉండ‌డం విష‌యంలో ఎవ్వ‌రూ రాజీ ప‌డ‌రు. కొంచెం వ‌య‌స్సు పెరిగినా యవ్వనంగా క‌నిపిండ‌చం కోసం ప్ర‌య‌త్నిస్తుంటారు. అందంగా మ‌రియు య‌వ్వ‌నంగా ఉండాలంటే ముందుగా దృష్టి పెట్టాల్సింది ఆహారం మీదే. యవ్వనంగా ఉండాలనుకుంటే ఆరోగ్యకరమైన మరియు సమతుల్య ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే వ‌య‌స్సు మ‌ళ్ళినా కూడా య‌వ్వ‌నంగా క‌నిపించ‌డానికి చాలా ప‌ద్ధ‌తులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


- ఉదయం సూర్యోదయంలో వాకింగ్ చేయడం వల్ల మీ శరీరం పైన పడే సూర్యకిరణాల వల్ల మీ శరీరం విటమిన్ డి పొందుతుంది. దీంతో మ‌న‌కు అందే విన‌మిన్ డి వ‌ల్ల ఆర్యోగ్య‌మే కాకుండా య‌వ్వ‌నంగా కూడా ఉండ‌గ‌లం.


- ఆహారంలో మార్ప‌లు చేసుకోవ‌డంతో పాటు ప్ర‌తి రోజు కొంత స‌మ‌యం వ్యాయామానికి కేటాయించాలి. ఇలా చేయ‌డం చాలా మంచిది.


- మ‌న శరీరంలో నీటి స్థాయిలు తగ్గినట్లయితే అవయవాల నిధులు నిలిపి వేయబడతాయి. 10 గ్లాసుల నీటిని తాగటం వల్ల‌ చర్మం ఉపరితలం పైన ఉండే నిర్జీవ కణాలు, ఆరోగ్య వంతమైన కణాలతో మార్చబడి మీరు యవ్వనంగా కనబడతారు.


- రెడ్ వైన్ వ‌య‌స్సును కాపాడడంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. రెడ్ మొతాదులో తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం ఎంతో కాంతివంతంగా మ‌రియు గుండె జ‌బ్బులు రాకుండా కూడా ప‌ని చేస్తుంది.


- గ్రీన్ టీని ప్ర‌తి రోజు ఉద‌యం తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం య‌వ్వనంగా, అందంగా మ‌రియు ఆరోగ్యంగా ఉండ‌డంలో బాగా స‌హాయ‌ప‌డుతుంది.


- ధూమపానం వల్ల వయస్సు మీద పడినట్లు, చిన్న వయస్సులోనే పెద్దగా కనబడేలా క‌నిపిస్తుంది. కాబ‌ట్టి ధూమ‌పానానికి దూరంగా ఉండ‌డం చాలా మంచిది.


- ప్ర‌తి రోజు క‌నీసం ఒక పండును తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పండ్ల‌లో ఉండే పోష‌కాలు ఆరోగ్యంగా మ‌రియు య‌వ్వ‌నంగా ఉండ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.


- జుట్టు తెల్లబడితే మీ పెద్ద వ‌య‌స్సులాగా క‌న‌ప‌డ‌తారు. కాబ‌ట్టి త‌గిన‌ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహరం తినండి మరియు రోజు రాత్రి పడుకోటానికి ముందుగా తలని, జుట్టును నూనెలతో మసాజ్ చేయండి.  



మరింత సమాచారం తెలుసుకోండి: