మ‌న పూర్వీకులు ఆడ‌వారికి 11 సంవ‌త్ప‌రాల‌కే పెళ్లి జ‌రిపించేసేవారు. వాళ్ల‌కు య‌క్త వ‌య‌స్సులో అంటే 20 సంవ‌త్స‌రాల లోపే వారు పిల్ల‌లకు జ‌న్మ‌నిచ్చేవారు. కాక‌పోతే అప్ప‌టి ఆహారంలో పోష‌కాలు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల వాళ్లు యుక్త వ‌య‌స్సులో గ‌ర్భం దాల్చినా ఎక్కువ ప్ర‌మాదాలు జ‌రిగేవి కాదు. అయితే అప్ప‌టి కాలానికి ఇప్ప‌టి కాలానికి చాలా మార్పులు ఉన్నాయి. అయితే ఆ త‌ర్వాత బాల్య వివాహాలు త‌ప్ప‌ని ఎన్నో చ‌ర్య‌లు వ‌చ్చాయి. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుత స‌మాజంలో యుక్త వ‌య‌స్సులోనే చాలా శాతం మంది గ‌ర్భం దాల్చుతున్నారు.  


నిజానికి గ‌ర్భ‌దార‌ణ మ‌రియు శిశువుకు జ‌న్మ‌నివ్వ‌డం ఒక మ‌హిళ జీవితంలో ప‌రివ‌ర్త‌న ద‌శ‌లు. శిశువుకు జ‌న్మ‌నిచ్చే స‌మ‌యంలో త‌ల్లి  ఆరోగ్యంగా, దృడంగా ఉండ‌డం చాలా ముఖ్యం. మ‌రియు వీటితో పాటు సుర‌క్షిత‌మైన గ‌ర్భం కోసం వ‌య‌స్సు చాలా ముఖ్య‌మైన‌ది. 20 సంవ‌త్స‌రాలలోపు కంటే తక్కువ వయసు గల అమ్మాయి గర్భం దాల్చటాన్ని యుక్త వయసు గర్భం అంటారు. యుక్త వయసులో వచ్చే గర్భాల వల్ల‌ చాలా రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.


20 సంవ‌త్స‌రాల‌ కంటే తక్కువ వయసు ఉన్న వారిలో గర్భం వల్ల‌ చాలా సమస్యలు కలుగుతున్నాయి. 17 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న వయసు గల వారిలో గర్భం వల్ల‌ ఎక్కువ తల్లులు చనిపోతున్నారు. అయినా కూడా ఇది రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. యుక్త వ‌య‌స్సులో గ‌ర్భం దాల్చ‌డంతో అలసట ఎక్కువగా రావటం, చిరాకులు, రుతు స‌మ‌స్య‌లు, అధిక రక్త పీడనం, ఒమిటింగ్స్ ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు. మ‌రియు దీని ఎఫెక్ట్ పుట్టే పిల్ల‌ల‌పై కూడా ప‌డుతుంది.


మ‌రియు యుక్త వయసులలో వచ్చే గర్భం దాల్చ‌డంతో శిశువులు వివిధ రకాల ఆరోగ్య సమస్యలకి గురవుతున్నారు. అందులో ముఖ్యంగా వీరిలో జ్ఞాపక శక్తి లోపాలు, అవయవ లోపాలు, పెరుగుదల లోపాలు పోషకాల లోపాలతో జన్మిస్తున్నారు. ఇది చాలా ప్ర‌మాద‌క‌రం. అందుకే స‌రైన స‌మ‌యంలో అంటే 20 సంవ‌త్స‌రాల‌పైన గ‌ర్భం దాల్చ‌డం ఉత్త‌మం మ‌రియు త‌ల్లికి, శిశువు ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: