కోడి గుడ్డుతో మనం ఎనో రకాల వంటకాలను చేస్తాము.కూర చేసుకుంటాము,ఆమ్లేట్ వేసుకుంటాము,బిర్యాని చేసుకుంటాము,ఫ్రైడ్ రైస్ చేసుకుంటామ్,ఇంకా మరెన్నో రకరకాలు చేసుకుంటాము.అందులో ఒకటి  "చిల్లీ ఎగ్గ్". ఇప్పుడు మనం ఈ చిల్లీ ఎగ్గ్ ఎలా తయారు చేస్తారో మనం తెలుసుకుందాం.చిల్లీ ఎగ్గ్ కి కావాల్సిన పధార్ధాలు, తయారు చేసే విధానాన్ని చుదాం.

"చిల్లీ ఎగ్గ్" కి కావాలిన పధార్ధాలు:

గుడ్లు 6

అల్లం వెల్లులి పేస్ట్ కొదిగా

ఉప్పుతగినంత

కారంతగినంత

కార్న్ ఫ్లోర్కొద్దిగా

మైదాకొద్దిగా

ఉల్లిపాయలు2

పచ్చిమిర్చీ2

వెల్లులీ రెబ్బలు5

టొమేటో సాస్-కొద్దిగా

సోయా సాస్కొద్దిగా

గ్రీన్ చిల్లీ సాస్కొద్దిగా

పంచదారచిటికెడు

వెనీగర్చిటికెడు

ఉల్లికాడలు 5

ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

"చిల్లీ ఎగ్గ్" తయారి విధానం:

 మొద్దటీగా మనం గుడ్లను ఉడికించుకోవాలీ. అవి ఉడికిన తరవాత వాటీని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.కట్ చేసిన వాటిలో సరిపడా ఉప్పు,కారం,అల్లం వెల్లుల్లి పేస్ట్,ఒక గుడ్డు,కార్న్ ఫ్లోర్ కొదిగా ,మైదా కొదిగా వేసుకోని మిక్స్ చేసుకోవాలి.


తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసుకోవాలి.ఆయిల్ వేడైయాక మనం ముందుగా మిక్స్ చేసుకున్న మిస్రమాన్ని ఈ ఆయిల్ లో వేసుకోని సిమ్ లొ వీటిని గోల్డెన్ కలర్ వచే అంతవరకు మనం ఫ్రై చేసుకోవలి. అవి గోల్డెన్ కలర్ లోకి వచ్చాక ప్లేట్ లోకి తీసి పక్కన పెటుకోవాలి.


ఉల్లిపాయలు,పచ్చిమిర్చీ,వెల్లులి రెబ్బలు,ఉల్లికాడలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.తర్వాత ఒక స్టవ్ మీద మరొక ప్యాన్ పెటి ప్యాన్ వేడైయాక కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయలు,పచ్చిమిర్చీ,వెల్లులి వేసుకోవాలి. తర్వాత కొదిగా అల్లం వెల్లులి పేస్ట్ వేసి కొంచం వేగ నివ్వాలి.


తర్వాత దాంట్లో తగినంత ఉప్పు,కారం వేసుకుని బాగా కలుపుకుని తర్వాత చిటికెడు వెనీగర్,ఒక టేబుల్ స్పూన్ టమేటో సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, చిటికెడు పంచదార వేసి అలాగే కొద్దిగా నీళ్ళు పోసుకుని మరిగించాలి.ఈ మిస్రమం కొంచం చిక్కపడినాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్గ్ పీసెస్ ని ఇందులో వేసి కలుపుకోవాలి.చివరగా దించే ముందు ఉల్లికాడలను వేసి దించేయాలి. ఎంతో రుచికరమైన "చిల్లీ ఎగ్గ్" తయారైపొయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: