స‌హ‌జంగా నిద్ర‌పోవ‌డం అనేది అంద‌రికి ఇష్ట‌మైన‌ది. మ‌రియు మ‌నిషి ఆరోగ్యంగా ఉండాల‌న్నా నిద్ర చాలా అవ‌స‌రం. నిద్రలేమి వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయన్న విషయం మనందరీకి తెలిసినదే. నిద్ర పోవ‌డం వ‌ల్ల ఎన్నో స‌మ‌స్య‌లు దూరం చేస్తుంది. చేసే పని, వర్క్‌ టెన్షన్‌, మానసిక ఆందోళన, సెల్‌కబర్లు ఇలా వీటి వ‌ల్ల రాత్రి ప‌డుకోవ‌డ‌మే మ‌ర్చిపోతున్నారు. 


అయితే మనలో చాలా మంది మధ్యాహ్నం పూట నిద్ర పోవడం అలవాటుగా ఉంటుంది. రోజు వారిగా ఉండే పని ఒత్తిడి కారణంగా మధ్యాహ్నం ఓ కునుకు తీయాల‌నిపిస్తుంది. అయితే మ‌ధ్యాహ్నం నిద్ర పోవ‌డం వ‌ల్ల కొన్ని లాభాలు ఉంటే కొన్ని న‌ష్టాలు ఉన్నాయి. నిజానికి మ‌ధ్యాహ్నం భోజ‌నం చేయ‌గానే నిద్ర‌పోవాల‌నిపిస్తుంది. కానీ అలాంటి స‌మ‌యంలో అస‌లు నిద్ర‌పోకూడ‌దు. అలాంటి స‌మ‌యంలో మ‌న నిద్ర‌ను కంట్రోల్ చేసుకోవ‌డం చాలా ఉత్త‌మం. 


మ‌ధ్యాహ్నం నిద్ర వ‌ల్ల అధికబరువుకి దారి తీస్తుంది. అయితే లాభాలు ఏంటంటే.. స‌హ‌జంగా నిద్ర పోవ‌డం వ‌ల్ల తిరిగి శక్తిని కూడగట్టుకోవడానికి కారణమవుతుంది. ఈ క్ర‌మంలోనే మ‌నిషి యాక్టీవ్‌గా ఉండ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. చదువుకునేవారికి మధ్యాహ్నం నిద్ర చాలా స‌హాయ‌క‌రం. బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంచి గుండే మీద ఒత్తిడి కూడా త‌గ్గిస్తుంది. మ‌రియు నరాల కదలిక బాగుంటుంది. రాత్రిళ్లు ప‌ని చేసే వారికి ప‌గ‌లు ప‌డుకోవ‌డం మంచిది. 


బాగా ప‌ని చేసి చేసి అల‌స‌ట‌కు గుర‌వుతున్న‌ప్పుడు కొంత స‌మ‌యం నిద్ర‌పోవ‌డం వ‌ల్ల శ‌క్తి ఇచ్చి ఎక్కువ స‌మ‌యం ప‌ని చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. కానీ భోజ‌నం చేసిన వెంట‌నే అయితే నిద్ర‌పోకూడ‌దు. భోజ‌నం చేసేన వెంట‌నే ప‌డుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువుతో పాటు అనేక జ‌బ్బులు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: