ఆన్‌లైన్‌లో చ‌దివిన ఓ విష‌యం కార‌ణంగా లండ‌న్‌లో ఓ యువ‌తి త‌న జీవితంలో తీర‌ని విషాదాన్ని నింపుకుంది. మెక్రోవేవ్‌లో ఉడకబెట్టిన కోడిగుడ్డు ఆమె జీవితంలో చీక‌టిని మిగిల్చింది. బ్రిటన్‌లోని రెడ్డిచ్‌కు చెందిన బెతానీ రోసర్ అనే అమ్మాయి ఒక రోజు బ్రేక్‌ఫాస్ట్ చేయ‌డానికి కోడి గుడ్డును ఉడ‌క‌పెట్టాల‌నుకుంది. అయితే ఎక్క‌డో ఆన్‌లైన్‌లో చ‌దివిన సూచ‌ర మేర‌కు కోడి గుడ్డును మైక్రోవేవ్‌లో పెట్ట‌డం వ‌ల్ల ఎలా ప్ర‌మాదం ఉండ‌ద‌ని మ‌రియు త్వ‌ర‌గా ఉడికిపోతుంద‌నే విష‌యం గుర్తుకువ‌చ్చింది.


ఈ క్ర‌మంలోనే ఆమె ఏం ఆలోచించ‌కుండా ఒక బౌల్‌లో నీళ్లు పోసి అందులో కొంచెం ఉప్పు మ‌రియు గుడ్లును వేసి మైక్రోవేవ్‌లో 900 వాట్స్‌లో ఉడ‌క‌బెట్టింది. ఆ త‌ర్వాత వాటిని బ‌య‌ట‌కు తీసి చ‌ల్లార్చ‌డానికి ప‌క్క‌న పెట్టింది. ఈ క్ర‌మంలోనే అవి ఉడికాయో లేదో తెలుసుకోవాడానికి ఒక గుడ్డును ప్రెస్ చేయ‌డంతో ఒకేసారి అది పేటి ఆమె కుడి వైపు ముఖంపై మ‌రియు కంటిలోని ప‌డింది. దీంతో బాగా వేడిగా ఉండ‌డంతో ఆమె కుడి క‌న్నుపై గ‌ట్టి ఢీ కొని కంటి చూపును కోల్పోయేలా చేసింది. 


అదే విధంగా ఆమె కుడివైపు ముఖం కూడా కాలిపోయింది. వెంట‌నే ఆమె ఆసుప‌త్రికి వెళ్లి చికిత్స చేయించుకుంది. కానీ ఆమె కుడి క‌న్ను కోల్పోయింది. మ‌ళ్లీ తిరిగి త‌న కంటి చూపు వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం కూడా లేద‌ని ఆమె చెప్పింది. ఇండ‌ర్నెట్‌లో చ‌దివి గుడ్డిగా న‌మ్మంనందుకు ఆమెకు ఇలా జ‌రిగింద‌ని చిక‌త్స అనంత‌రం ఆమె వాపోయింది. అలాగే ఆ టైమ్‌లో నేనే నొప్పితో న‌ర‌కం చూసాన‌ని బెతానీ రోసర్ చెప్పింది. కాబ‌ట్టి ఆన్‌లైన్‌లో చ‌దివింది గుడ్డిగా ఎవ‌రు న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆమె చెప్పి బాధ ప‌డింది.


మరింత సమాచారం తెలుసుకోండి: